By: ABP Desam | Updated at : 03 May 2022 03:34 PM (IST)
బాబా భాస్కర్ తో నటరాజ్ మాస్టర్ గొడవ
బిగ్ బాస్ ఓటీటీ తెలుగు తొమ్మిది వారాలను పూర్తి చేసుకొని ఇప్పుడు పదో వారంలోకి ఎంటర్ అయింది. ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లడానికి ఏడుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. వారెవరంటే.. యాంకర్ శివ, అరియనా, అషురెడ్డి, మిత్రాశర్మ, బిందు, అఖిల్, అనిల్. మరో మూడు వారాల్లో షో ముగుస్తుందని అంటున్నారు. కానీ హౌస్ తొమ్మిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. కాబట్టి ఈ రెండు వారాల్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని అంటున్నారు.
దీనికోసం బిగ్ బాస్ సీజన్ 5లో టాప్ 5 కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపించి మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తారని టాక్. దానికి తగ్గట్లే ఈరోజు విడుదలైన ప్రోమోలో బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ సిరి హౌస్ లో కనిపించింది. ఉదయాన్నే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయింది సిరి. ఆమెని చూసి ఎగ్జైట్ అయ్యారు కంటెస్టెంట్స్. వారితో కాసేపు ముచ్చటించిన సిరి.. ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం కొన్ని గేమ్స్ ఆడాలని వారితో ఆడించింది.
ఆ తరువాత కిచెన్ లో ఉన్న బాబా భాస్కర్ దగ్గరకు వెళ్లిన నటరాజ్ మాస్టర్.. 'ఇప్పుడు ఎవరెవరికి మటన్ వండుతున్నారు..?' అని అడిగాడు. దానికి బాబా.. 'నీకు వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తాను' అని చెప్పారు. వెంటనే నటరాజ్ మాస్టర్ 'నేను చేసుకుంటా.. ప్రాబ్లెమ్ లేదు' అని అన్నాడు. దానికి బాబా.. 'ఆశగా చేస్తాను అంటే ఎందుకలా అంటావ్' అని అనగా.. 'నువ్ వండి మళ్లీ నాకు వండడం ఎందుకు.. నేను వండుతాను కదా..' అంటూ వెటకారంగా సైగలు చేస్తూ చెప్పారు.
అక్కడితో ఆగకుండా.. 'ముసలోడికేమో(బాబా భాస్కర్) కాలు విరిగిపోయింది. ఒక మూలన కూర్చో అంటే కూర్చోవట్లేదు. పొద్దున్నే లేచి నొప్పులని బాధపడుతున్నాడు' అంటూ యాక్ట్ చేసి చూపించాడు. దానికి బాబా భాస్కర్ హర్ట్ అయ్యారు. 'నీ దగ్గర చెప్పింది నీ దగ్గర పెట్టుకో' అంటూ తన చేతిలో ఉన్న కత్తితో బాక్స్ ని బలంగా గుద్దాడు. దానికి నటరాజ్ మాస్టర్ 'ఎందుకింత ఓవర్' అంటూ కామెంట్ చేయగా.. బాబా భాస్కర్ బాగా సీరియస్ అయ్యారు.
Also Read: పవన్ సినిమాలో నోరా ఫతేహి క్యారెక్టర్ ఇదే!
Also Read: హాస్పిటల్ లో మిథున్ చక్రవర్తి - వైరల్ అవుతోన్న ఫొటో
"IDHI OVER ANTE OVER RAA!" 😡😲
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) May 3, 2022
Surprise in the Bigg Boss Non-Stop house! But there’s also a new fight 🤭👊
Are you geared up for the new episode tonight at 9PM on @DisneyPlusHS?#BiggBoss #BiggBossTelugu #BiggBossNonStop @EndemolShineIND pic.twitter.com/HUisBZwWCW
Bigg Boss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6లోకి సామాన్యులకు అవకాశం, నాగ్ ఆహ్వానం
Urfi Javed: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్, ఉర్ఫి జావెద్ మరో అరాచకం, తాకితే చేతులు తెగుతాయ్!
Bindu Madhavi: బాత్రూమ్ లో బిందు మాధవి స్మోకింగ్ - నిజమేనా?
Bigg Boss Non-Stop Winner Prize Money: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ - ప్రైజ్ మనీ ఎంత గెలుచుకుందంటే?
Bindu Madhavi vs Nataraj: నటరాజ్‌తో శపథం, చివరికి పంతం నెగ్గించుకున్న ఆడపులి బిందు మాధవి
Bengal Cabinet: మొన్న తమిళనాడు, నేడు బంగాల్- కేంద్రానికి షాక్‌లు, గవర్నర్ అధికారాల్లో కోతలు!
PM Modi Hyderabad Tour: కేసీఆర్‌పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం
May 26 Records in Cricket: మే 26తో భారత క్రికెట్‌కు ప్రత్యేక కనెక్షన్ - రెండు మర్చిపోలేని రికార్డులు - ద్రవిడ్‌కు కూడా!
Hyderabad News : సరూర్ నగర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం కేసు, వెలుగులోకి సంచలన విషయాలు