Bigg Boss 6 Telugu: టాస్క్ రద్దు, ఇంటి సభ్యులు కంటెంట్ ఇవ్వకపోవడంతో బిగ్‌బాస్ ఆగ్రహం- ఏ సీజన్లో ఇలా జరుగలేదు
Bigg Boss 6 Telugu: చప్పగా సాగుతున్న టాస్కును మధ్యలోనే నిలిపివేశారు బిగ్‌బాస్.
Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్‌కి కోపం వచ్చింది. చివరికి షోలో తన కంటెంట్ తానే క్రియేట్ చేసుకుంటున్నాడు. ఇంటి సభ్యులు ఎలాగూ క్రియేట్ చేయరని తానే రంగంలోకి దిగాడు. ఇలా ఏ సీజన్లోను జరగలేదు. సీజన్ 6 చప్పగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు మరీ దారుణంగా మారింది. ఇంటి సభ్యులకు తెలుగుసినిమాల్లో హిట్ అయిన పాత్రలను ఇచ్చారు. వారిలా నటించమని అడిగారు. కానీ ఇంటి సభ్యులు కాసేపు ఆయా పాత్రలకు తగ్గట్టు నటించి, తరువాత రిలాక్స్ అవ్వడం మొదలు పెట్టారు. దీంతో బిగ్ బాస్‌కి చాలా కోపం వచ్చింది.
ఇక ప్రోమోలో ఏముందంటే బిగ్ బాస్ చాలా గంభీరమైన గొంతుతో ఇంటి సభ్యులందరినీ గార్డెన్లో వరుసగా నిల్చోమని చెప్పారు. అందరూ నిల్చున్నాక... ‘ఇంటి సభ్యులుకు ఈ టాస్కు ఇచ్చిన ఏ సీజన్లో కూడా ఇంత నిరాశజనకంగా జరుగలేదు. అందుక్కారణం ఇంటి సభ్యుల నిర్లక్ష్యం. టాస్కుల పట్ల నిర్లక్ష్యం. బిగ్బాస్ ఆదేశాల పట్ల నిర్లక్ష్యం. మీ నిర్లక్ష్యం బిగ్‌బాస్ నే కాక ప్రేక్షకులను కూడా నిరాశపరిచింది. బిగ్‌బాస్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా నిరాశపరుస్తున్న కారణంగా ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ రద్ధు చేస్తున్నాం. ప్రేక్షలకు పట్ల, ఈ షో పట్ల గౌరవం, ఆసక్తి మీకు లేనట్టు అనిపిస్తే మీరు ఇప్పుడే బయటికి వెళ్లిపోవచ్చు. తక్షణమే మీ కాస్ట్యూమ్స్ స్టోర్ రూమ్ లో పెట్టండి’ అని చెప్పాడు.
View this post on Instagram
దీంతో ఇంటి సభ్యులంతా క్షమించమని అడిగారు. ఇక ఫైమా కెమెరాల దగ్గర కొచ్చి ‘ఆడని వారికోసం ఆడిన వారికి కూడా మోసం జరుగుతోంది బిగ్ బాస్’ అని బాధపడింది. శ్రీహాన్ కూడా ‘రిలాక్స్ గా ఉండి సోది ముచ్చట్లు చెప్పుకోవాలి’ అంటూ కొందరి గురించి అనుకుంటూ కనిపించాడు. సూర్య ఇనయాపై కోప్పడుతూ కనిపించాడు. ఇద్దరు ముగ్గురు తప్పుల వల్ల అందిరికీ ఎఫెక్టు అవుతోంది అంటూ శ్రీహాన్ తనలో తానే మాట్లాడుకుంటూ ఉన్నాడు. చివర్లో ఇనయా కంటతడి పెట్టుకుంటూ కనిపించింది. ఈరోజు షో అదిరిపోయేలా ఉంది. చివరికి బిగ్ బాస్ తన కంటెంట్ తానే క్రియేట్ చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చారు ఇంటి సభ్యులు.
Also read: మీకు షోపై ఇంట్రెస్ట్ లేకపోతే వెళ్లిపోండి, మెయిన్ డోర్ ఓపెన్ చేసిన బిగ్బాస్