Bigg Boss 9 Telugu : డబుల్ ఎలిమినేషన్ డేంజర్లో హౌజ్ మేట్స్... మిడ్ వీక్ ఎవిక్షన్ బాంబు లీస్ట్ ఓటింగ్‌లో ఉన్న ఆమెపైనేనా ?
Bigg Boss 9 Telugu : ఈ వారం బిగ్ బాస్ 9 తెలుగు ఎపిసోడ్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని, అలాగే డబుల్ ఎలిమినేషన్ జరగబోతోందనే వార్త వైరల్ అవుతోంది. సమాచారం ప్రకారం డేంజర్ జోన్లో ఉన్నది ఎవరు ?

బిగ్ బాస్ సీజన్ 9 లో మరికొన్ని గంటల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరగబోతుందనే వార్త ఆడియన్స్ ని తెగ ఊరిస్తోంది. కానీ అంతలోనే ఈవారం డబుల్ ఎలిమినేషన్ డేంజర్ లో హౌజ్ మేట్స్ ఉన్నారనే న్యూస్ వైరల్ అవుతుంది. అందులోనూ మిడ్ వీక్ వైల్డ్ కార్డు ఎంట్రీనే కాకుండా, ఒక ఎలిమినేషన్ జరగబోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఈవారం డబుల్ ఎలిమినేషన్ జరిగితే హౌజ్ నుంచి బయటకు వెళ్ళబోయే కంటెస్టెంట్స్ ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది.
డేంజర్ జోన్లో ఆ ఇద్దరూ...
బిగ్ బాస్ హౌజ్ లో ప్రస్తుతం మూడవ వారం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ వారం మొత్తం 6 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు. ఈ లిస్టులో రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ, రాము రాథోడ్, ప్రియా శెట్టి, శ్రీజ దమ్ము, హరిత హరీష్, కళ్యాణ్ పడాల ఉన్నారు. ఇంకా ఓటింగ్ కు టైమ్ ఉండగానే నామినేట్ అయిన వారిలో ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారని తెలుస్తోంది. ఇక లీస్ట్ లో ఉన్నది మరెవరో కాదు ప్రియా శెట్టి. ఆమెను ఈ వారం బిగ్ బాస్ బయటకు పంపబోతున్నట్టు సమాచారం.
ఓటింగ్ లో దుమ్ము లేపుతున్న లక్స్ పాప
హీరోయిన్ ఫ్లోరా షైనీ ఓటింగ్ పరంగా అదరగొడుతోంది. మొదటి వారమే ఈ అమ్మడు ఎలిమినేట్ అవుతుందని ఆడియన్స్ అనుకున్నారు. కానీ ఆమె అందరికీ షాక్ ఇస్తూ మూడో వారం కూడా హౌజ్ లో కొనసాగడమే ఒక విచిత్రం అనుకుంటే, ఓటింగ్ లోనూ టాప్ లో ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా ప్రియా - శ్రీజ వంటి కంటెస్టెంట్స్ పై ఉన్న హేట్ ఇలా సైలెంట్ గా ఉన్న ఫ్లోరాకి ఓట్లు పడేలా చేస్తోంది అన్నది విశ్లేషకుల అభిప్రాయం. నిజానికి ఫ్లోరా హౌజ్ లో పెద్దగా ఆడింది, చేసింది ఏమి లేకపోయినా ఆమెకు 28% ఓటింగ్ తో టాప్ లో ఉంది. సెకండ్ ప్లేస్ లో 26%తో రాము రాథోడ్, మూడో ప్లేస్ లో 14 శాతం ఓటింగ్ తో హరిత హరీష్ ఉన్నారు. ఆ తరువాత స్థానంలో 13 శాతం ఓట్లతో రీతూ చౌదరి కొనసాగుతోంది. 12 శాతం ఓట్లతో కళ్యాణ్ పడాల, 8 శాతం ఓట్లతో ప్రియా లీస్ట్ లో ఉన్నారు. కళ్యాణ్ నుంచి పెద్దగా కంటెంట్ ఏం లేదు కాబట్టి అతను డేంజర్ లోనే ఉన్నట్టు. అలాగే వైల్డ్ కార్డు ఎంట్రీ ల ద్వారా సెలబ్రిటీలు హౌజ్ లోకి అడుగు పెట్టబోతున్నారు, పైగా ఓటింగ్ పరంగా లీస్టులో ఉంది కాబట్టి ప్రియాని ఎలిమినేట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
బిగ్ బాస్ ప్రెస్టేజ్ ఇష్యూ... రీతూ చౌదరి అవుట్?
బిగ్ బాస్ హౌస్ లో డెమాన్ పవన్ తో లవ్ ట్రాక్ నడుపుతూ రీతు చౌదరి ప్రతిరోజూ హాట్ టాపిక్ అవుతుంది. కానీ బయట జరుగుతున్న పరిణామాల దృష్ట్యా రీతూ చౌదరిని డబుల్ ఎలిమినేషన్ ద్వారా బిగ్ బాస్ బయటకు పంపించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం రీతూకు సంబంధించిన కొన్ని ప్రైవేటు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. గౌతమి అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఈ వీడియోను రిలీజ్ చేసి కొత్త వివాదానికి దారి తీసింది. రీసెంట్ గా తన భర్త, టాలీవుడ్ నటుడు ధర్మ మహేష్ కట్నం కోసం వేధిస్తున్నాడని పోలీసులకు కంప్లైంట్ చేసిన ఆమె, తాజాగా రీతూ చౌదరి ఎందుకు అర్ధరాత్రి తన ఇంట్లో, తన భర్తతో ఉన్నాడు అంటూ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. ఒకవేళ ఈ వివాదం దృష్ట్యా బిగ్ బాస్ గనుక ప్రెస్టేజ్ ఇష్యూ అనుకుంటే ఆమెను కచ్చితంగా మిడ్ వీక్ లేదా వీకెండ్ బయటకు పంపుతారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి బిగ్ బాస్ ఆమె విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.





















