Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 86 రివ్యూ... టికెట్ టు ఫినాలే కోసం ఫైట్లు... ముదురుతున్న తనూజా - రీతూ గొడవ... ఇమ్మూలో ఇంత ట్యాలెంటా?
Bigg Boss 9 Telugu Today Episode - Day 86 Review : బిగ్ బాస్ 9 తెలుగుకు ఎండ్ కార్డు పడడానికి మరికొన్ని రోజులే ఉండడంతో టికెట్ టు ఫినాలే టాస్కులు స్టార్ట్ చేశారు బిగ్ బాస్. ఈరోజు పెట్టిన టాస్క్ లు ఏంటి?

బిగ్ బాస్ డే 86 రోజు "నువ్వు పెట్టిన పాయింట్స్ కరెక్ట్ అయితే బాధ పడేదాన్ని కాదు. నీ మీద అరిచినందుకు నాకు నేనే నచ్చట్లేదు. బ్యాడ్ అయ్యాను" అంటూ బాధ పడింది తనూజా. సారీ చెప్పిన డెమోన్ దీన్ని సాగదీయొద్దు అని రిక్వెస్ట్ చేశాడు. మరోవైపు సంజనతో ఇమ్మూ "ఆ అమ్మాయి నిన్న ఎందుకు ఏడ్చిందో అర్థం కాలేదు మమ్మీ. నేను అంత ప్రిఫరెన్స్ ఇస్తే ఫ్రెండువే కాదు పో అని, తరువాత అలా అన్నంత మాత్రాన ఫ్రెండువి కాకుండా పోతావా అని ఏడుస్తుంది ఏంటి? మరోవైపు నాకు ఏడుపు వస్తోంది ఇంత చేసినా అలా అనేసింది అని" అంటూ తన కన్ఫ్యూజన్ ను బయట పెట్టాడు ఇమ్మూ. "ఆ అమ్మాయి నీతో బాగుంటే నువ్వు కూడా అలాగే ఉండు. ఇంకా కొన్ని వారాలే ఉంది కదా" అని సర్ది చెప్పింది సంజన.
కనుక్కోండి చూద్దాం
ఉదయం 11 గంటలకు "ఎన్నో అడ్డంకులు దాటుకుని మిమ్మల్ని మీరు నిరూపించుకున్నారు. అవరోధాలు దాటుకుని ఇక్కడిదాకా వచ్చి, ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్న మీరు ట్రోఫీకి ఒక్క అడుగు దూరంలో నిలిచే సువర్ణావకాశం టికెట్ టు ఫినాలే రూపంలో ఇవ్వబోతున్నాను. మీ ముందున్న ప్లాట్ ఫాంపై ఉన్న గడులు మీ రణభూమి. ఇందులో మీ రంగు గడిని ఎంచుకుని అందులో నిలబడండి. సమయానుసారం నేనిచ్చే టాస్క్ లు ఆడి, ప్రత్యర్థుల గదులు స్వాధీనం చేసుకోవడానికి పోటీ పడాల్సి ఉంటుంది. పక్కనున్న ఖాళీ గదులను సొంతం చేసుకోవడానికి ముందుగా ఆడబోయే ముగ్గురు ఎవరో చెప్పండి అని అడిగారు బిగ్ బాస్.
ఈ డిస్కషన్ లో కళ్యాణ్, డెమోన్, ఇమ్మూ ఆడతారు అని తనూజా చెప్పేసింది. కానీ రీతూ కూడా ఆడతాను అనడంతో తనూజా, రీతూ మధ్య గొడవ జరిగింది. హౌస్ వర్సెస్ రీతూ అన్నట్టుగా జరిగింది ఈ గొడవ. చివరకు డెమోన్ త్యాగం చేయడంతో రీతూ, కళ్యాణ్, ఇమ్మూ ఆడారు. ఈ ముగ్గురికీ 'కనుక్కోండి చూద్దాం' అంటూ మ్యాథ్స్ క్వశ్చన్స్ ఇచ్చారు. బిగ్ బాస్ చెప్పే ఆన్సర్ ను బట్టి, క్వశ్చన్ తీసుకుని చూపించాలి. ఇమ్మూ ఈ టాస్క్ లో విన్ అయ్యి, సంజనాతో నెక్స్ట్ గేమ్ ఆడడానికి రెడీ అయ్యాడు. అయితే రీతూ ఇందులో ఒక్క పాయింట్ కూడా రాబట్టుకోలేకపోయింది. దీంతో బిగ్ బాస్ ఆమెపై పంచులు వేసి నవ్వించారు.
పంతం నీదా నాదా
ఫస్ట్ ఫైనలిస్ట్ కావడానికి సంజన, ఇమ్మూలను "పంతం నీదా నాదా" అనే ఫస్ట్ టాస్క్ పెట్టారు. సీసాలు ఉన్న తాడును పట్టుకుని, అవతలి వైపు ఉన్న బాస్కెట్ ను పైకి లాగి, బాల్స్ వేయాలి. ఈ టాస్క్ లో కూడా ఇమ్మూనే విన్ అయ్యాడు. దీంతో తాడును వదిలేసిన సంజన ఎమోషనల్ అయ్యింది. మొదట్లోనే గేమ్ నుంచి బయటకు వెళ్ళాను అంటూ ఆమె ఏడిస్తే... ఇమ్మూ, కళ్యాణ్, రీతూ అద్భుతంగా ఆడారు అంటూ ఆమెను ఓదార్చారు.
యాక్టివిటీ ఏరియాలో సంజన ఏరియాను స్వాధీనం చేసుకున్నాడు ఇమ్మూ. తరువాత డెమోన్, తనూజా, భరణికి 'నాటు నాటు' అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో తనూజా విన్ అయ్యింది. డెమోన్ ఫిజికల్ అవుతున్నావు అంటుంది. ఇంకేం చేయాలి అంటూ రీతూ దగ్గర బాధ పడ్డాడు. మరోవైపు తనూజ సుమన్ శెట్టితో గేమ్ ఆడడానికి సిద్ధం అయ్యింది.





















