Bigg Boss 8 Contestant: డబ్బు, ఫేం కావాలంటున్న 'నాగ పంచమి' మోక్ష బాబు - ఆ మాట తప్పిన విష్ణు ప్రియ
Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్ 8 హౌజ్‌లోకి 10వ కంటెస్టెంట్‌గా నామ మణికంఠ, 11వ కంటెస్టెంట్‌గా పృథ్వీరాజ్, 12వ కంటెస్టెంట్‌గా విష్ణుప్రియ, 13వ కంటెస్టెంట్‌గా నైనిక చివరిగా ఆఫ్రిది ఎంట్రీ ఇచ్చేశారు.
రెండేళ్లకే తండ్రిని, ఇటీవల తల్లిని కొల్పోయిన మణికంఠ
పుట్టిన రెండేళ్లకే నాన్న చనిపోయాడు. దాంతో అమ్మ రెండో పెళ్లి చేసుకుది. ఊహా తెలిశాక నాన్న అని పిలిచిన ఆ వ్యక్తి తన కన్నతండ్రి కాదని తెలిసి జీర్ణించుకోలేకపోయాడు. రెండో పెళ్లి కావడంలో అతడితో తరచూ గోడవలు. పెద్దయ్యాక మంచి ఉద్యోగం తెచ్చుకుని తల్లిని బాగా చూసుకోవాలనుకున్నాడు. కానీ అంతలోనే అమ్మకు ప్రాణాంతవ్యాధి అని బయటపడింది. తన తల్లికి క్యాన్సరని తెలిసి కుప్పకూలిపోయాడు. తల్లిని కాపాడుకోవాలని ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. 2019లో క్యాన్సర్‌తో తల్లి కన్నుమూసింది. ఆమె చనిపోయిన పదకొండు రోజులకే ఇంటి నుంచి బయటకు వచ్చిన సొంత కాళ్లపై ఎదిగాడు. కష్టపడి మంచి జాబ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయాడు. అమ్మలా చూసుకుంటుందనుకున్న భార్య తరచూ గొడవలు పెట్టుకుంటూ చివరికి మనస్పర్థలతో విడిపోయింది. ఇక ఇండియా వచ్చిన అతడు బుల్లితెర అవకాశాలు కోసం ప్రయత్ని ఇప్పుడిప్పుడే నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. అతడే టీవీ నటుడు నాగమణికంఠ.
11వ కంటెస్టెంట్‌గా నాగ పంచమి మోక్షబాబు
పృథ్వీరాజ్ ఈ పేరు చెబితే అంతా 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు. కానీ, అతడు కాదు. ఈ పేరు చెబితే అతనెవరో చెప్పలేరు. కానీ మోక్ష బాబు అంటే బుల్లితెర ప్రేక్షకుల ఇట్టే పట్టేస్తారు. నాగ పంచమి సీరియల్ హీరో పృథ్వీరాజ్ ఇతడే. తన లుక్, స్టైల్‌తో ఎంతోమంది అమ్మాయిల కలల రాకూమారుడిగా మారాడు. నాగ పంచమి మోక్షబాబుగా గుర్తింపు పొందిన పృథ్వీ పదకొండవ కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టాడు. ఇక ఈ రియాలిటీ షో గురించి మాట్లాడుతూ.. ఎక్స్‌పీరియన్స్ కోసం బిగ్‌బాస్ వస్తున్నానన్నాడు. అలాగే డబ్బు, పేరు కూడా ముఖ్యమేనన్నాఈ మోక్ష బాబు ప్రస్తుతం తాను సింగిల్ అని చెప్పాడు. దీంతో లేడీ ఫ్యాన్స్ అంతా ఖుష్ అవుతున్నారు. మరి బుల్లితెరపై మెప్పించిన ఈ హీరో బిగ్‌బాస్ హౌజ్‌లో ఎలా అదరగడోతాడో చూడాలి.
కోట్లు ఇచ్చిన రానని మాట తప్పిన విష్ణు
యాంకర్ విష్ణుప్రియ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై ఎంతో పాపులారి సంపాదించుకుంది. పెద్ద పెద్దగా మాట్లాడుతూ గోల గోల చేసే ఈ అల్లరి యాంకర్ ఇప్పుడు బిగ్‌బాస్ హౌజ్‌లో సందడి చేసేందుకు వచ్చేసింది. 12వ కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి అడుగుపెట్టింది. కోట్లు ఇచ్చిన బిగ్‌బాస్‌కు వెళ్లనన్న ఈ భామ ఇప్పుడు హౌజ్‌లోకి అడుగపెట్టడంతో కొస్తా ట్రోల్స్‌కి గురవుతుంది. మరి హౌజ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తూ ట్రోల్స్ నుంచి బయటపడుతుందో లేదో చూడాలి.
డ్యాన్స్ షోతో పాపులరైన నైనిక
డ్యాన్స్ ఇండియా డ్యాన్స్, ఢీ 13, 14 డ్యాన్స్ షోతో ఎంతో ఫేమస్ అయ్యింది నైనిక. ప్రస్తుతం కవర్ సాంగ్స్, మ్యూజిక్ అల్బమ్స్ చేస్తూ సోషల్ మీడియాలో యమ క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఢీలో తన కో కంటెస్టెంట్ సాయితో రొమాంటిక్ స్టెప్పులు వేసి పాపులరైన నైనికి అతడితో ప్రేమలో మునిగి తేలిసింది. ఆ తర్వాత అతడితో బ్రేకప్‌తో వార్తల్లో నిలిచింది. ఈ తెలుగమ్మాయి డ్యాన్సరే కాదు మంచి నటి కూడా! గ్లామర్‌లో హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని ఈ బ్యూటీ బిగ్‌బాస్ హౌస్‌లోని లేడీ కంటెస్టెంట్లకు గట్టి పోటీనిస్తుందేమో చూడాలి!
ఆ ఆలోచనే యూట్యూబ్ స్టార్‌ని చేసింది...
కామన్ మ్యాన్‌గా హౌజ్‌లోకి అడుగుపెట్టాడు యూట్యూబర్ అఫ్రిది. షార్ట్ ఫిల్మ్స్ చేసిన అనుకున్నంత గుర్తింపు రాలేదు. దాంతో సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వీడియోలు చేస్తున్నాడు. ఆ గుర్తింపు బిగ్‌బాస్ ఆఫర్ కొట్టేసిన ఈ వరంగల్ యూట్యూబర్ 14వ కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి ఎంట్రి ఇచ్చాడు. ఈ సందర్భంగా స్టేజ్‌పై తన గురించి చెబుతూ తనకు దికి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే పిచ్చి అని, తరచూ తన తండ్రి ఆడిషన్స్ తీసుకువెళ్లమని విసిగించేవాడినన్నాడు. ఇతడి పోరు పడలేక సరే, నీకు నచ్చింది చేసుకో అన్నాడట తన తండ్రి. దాంతో ర్యాప్ సాంగ్స్, షార్ట్ ఫిలింస్ చేశాడు. కానీ అవి పెద్దగా ఆదరణ పొందలేదు. దీంతో తాను అనుకున్నదొకటి, అయ్యిందోకి అయ్యింది. దీంతో టైం వేస్ట్ చేసుకున్నాననే డిప్రెషన్‌లోకి వెళ్లాడట. ఇక ఎలాగైనా సాధించాలనే కసితో కొత్తగా ట్రై చేయాలనుకున్నాడట. అలా మనపై మనమే కుళ్లు జోకులు చేసుకుంటే ఎలా ఉంటుందని ఆలోచించాడట. ఆ ఆలోచనే ఇప్పుడు తనని యూట్యూబ్ స్టార్‌ని చేసిందంటున్నాడు ఆఫ్రిది.