అన్వేషించండి

Bigg Boss 8 Contestant: కొట్టుకపోతానంటున్న బేబక్క, కప్పు కొడతానంటున్న ఆర్జే శేఖర్‌ భాషా 

Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్‌లో హౌజ్ లోకి ఆరో కంటెస్టెంట్‌గా సోనియా, 7వ కంటస్టెంట్‌గా బెజవాడ బేబక్క, 8వ కంటస్టెంట్‌గా ఆర్జే శేఖర్‌ భాషా, 9వ కంటెస్టెంట్‌గా కిరాక్‌ సీత వచ్చారు. 

https://x.com/BBTeluguViews/status/1830240508859359535

Image Credit: BigBoss Telugu Views/Twitter

ఆరో కంటెస్టెంట్‌గా ఆర్జీవీ హీరోయిన్‌ సోనియా

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మను ఆశా ఎన్‌కౌంటర్‌ హీరోయిన్‌ సోనియా ఆకుల హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. జార్జ్‌ రెడ్డి సినిమాతో నటిగా పరిచయం అయ్యింది. కలెక్టర్‌ కావాలనుకుని యాక్టర్‌ అయిన సోనియా సామాజీక సేవలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. అంతేకాదు ఆసా పేరుతో ఫౌండేషన్‌ పెట్టి దానికి ద్వారా ఎంతోమంది సేవలు అందిస్తోంది. అంతేకాదు సేవలోనే సంతోషాన్ని వెతుక్కుంటున్నానంటుంది. నిజానికి ఆమె సొంతూరు తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలోని మంథని. సేవలోనే సంతోషాన్ని వెతుక్కుంటున్న ఈ బ్యూటీ బిగ్‌బాస్‌ 8లో ఏ మేర రాణిస్తుందేమో చూడాలి. 

ఏడో కంటెస్టెంట్‌గా బెజవాడ బేబక్క

ఈసారి బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి ఏడో కంటెస్టెంట్‌గా సోషల్‌ మీడియా ఇన్‌ప్లూయేన్సర్‌ 'బెజవాడ బేబక్క'. హౌజ్‌లోకి  వచ్చి రాగానే నాగ్‌కు రెండు హార్ట్‌ మెసేజ్‌లు ఇచ్చింది. ప్రస్తుతం సింగిల్‌గా ఉంటున్న ఆమె పెళ్లయినా వివాహ బంధం ఎక్కువ కాలం నిలవలేదని తనస్టైల్లో చెప్పింది. తనకంటూ ఓ క్రేజ్‌ ఉండాలన్న కసితో సోషల్‌ మీడియాలో ఫన్నీగా వీడియోలు ట్రై చేశానని, అవి జనాలకు రీచ్‌ అయ్యింది. వారం రోజుల్లోనే వైరల్‌ కావడంతో బెజవాడ బేబక్కగా ఫేమస్‌ అయ్యానంది. అయితే ఈ పేరు తానే పెట్టుకున్నానంది. తన అసలు పేరు మధు నెక్కంటి అని చెప్పింది. ఇక నాగ్‌ సిగ్గు పడుతూ కళ్లల్లో ఏముందో పాట పాడి ఫిదా చేసింది. కానీ ఆయన కళ్లల్లోకి చూడమంటూ కొట్టుకుపోతానంటూ కామెడీ చేసింది. మొత్తానికి ఎంట్రీతోనే తనదైన మాట తీరు, కామెడీతో అలరించిన ఈ బేబక్క. మరి హౌజ్‌లో ఎంత ఎంటర్‌టైన్‌ చేస్తుందో చూడాలి. 

కప్పు కొట్టేసుకుపోతానంటున్న ఆర్జే శేఖర్‌ భాషా!

ఈ మధ్య యూట్యూబ్‌, మీడియాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఆర్జే శేఖర్‌ భాషా. అతని అసలు పేరు గుదిమెళ్ల రాజశేఖర్‌. ఇంజనీరింగ్‌ చదివిన శేఖర్‌ భాషా జెమిని మ్యూజిక్‌ ద్వారా యాంకర్‌గా పరిచయం అయ్యాడు. చైల్డ్‌ ఎపిసోడ్‌ హాయ్‌ బుజ్జీ ప్రోగ్రామ్స్‌తో పాటు మూడువేలకు పైగా షోలలో పాల్గొన్నాడు. తర్వాత రేడియో జాకీగా గుర్తింపు పొందాడు. వెల్‌కమ్‌ ఒబామా సినిమాతో సినీరంగ ప్రవేశం చేశాడు. 'వెతికా నేను నా ఇష్టంగా' అనే చిత్రంతో దర్శకుడిగా మారిన పంచముఖి మూవీలో దర్శకుడిగా మారాడు. ఇక ఇప్పుడు బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి వస్తున్న ఆర్జే శేఖర్‌ భాషా తనని శత్రువులా చూస్తే మీకే నష్టమని, కప్పు కొట్టేసుకుని పోతానంటూ కంటెస్టెంట్స్‌ని హెచ్చరించాడు. మరి లావణ్య-రాజ్‌ తరుణ్‌ కేసులో సంచలన విషయాలు బయటపెడుతూ కేసు ఎన్నో మలుపులు తిప్పిన అతడు హౌజ్‌లో ఎలాంటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తాడో చూడాలి. 

కాన్ఫిడెంట్‌ ఎక్కువ అంటున్న కిర్రాక్‌ సీత

కిర్రాక్‌ సీత అంటే ఎవరికి తెలియకపోవచ్చు. కానీ బేబీ సినిమాలో హీరోయిన్‌ ఫ్రెండ్‌ అంటే మాత్రం వెంటనే గుర్తు పట్టేస్తారు. ఎక్కువగా నెగిటివ్‌ షేడ్స్‌లోనే కనిపించింది. ఇక బేబీలో ఆమె పోషించిన నెగిటివ్‌ పాత్ర ఆడియన్స్‌లోకి బాగా వెళ్లింది. ఈ పాత్రతో ఆమె ఫుల్‌ నెగిటివిటీని మూటగట్టుకుంది. సోషల్‌ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొంది. ఇక తాజాగా తొమ్మిదొవ కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి వచ్చిన ఆమె తనకు మందు తాగే అలవాటు ఉందంది. అంతేకాదు ప్రేమ, బ్రేకప్‌ అవ్వడంతో డిప్రెషన్‌కి వెళ్లానంది. పొట్టిగా ఉన్నా తనకు కాన్ఫిడెన్స్‌ ఎక్కువేనంటోంది. ఏదైనా ముఖం మీదే మాట్లాడే ఈ బ్యూటీ బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎలా ఉంటుందో చూడాలి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Embed widget