Bigg Boss Telugu Season 8 : పెంట పెంట చేసిన యష్మీ, తేజ మీద పడిపోయిన హరితేజ, నిఖిల్, పృథ్వీ
Bigg Boss Telugu Season 8 : బిగ్ బాస్ ఇంట్లో పదో వారం ప్రేరణ మెగా చీఫ్ అయింది. విష్ణుకి చుక్కలు చూపించింది. అలాగే ఈ ఎపిసోడ్ లో పృథ్వీ రెచ్చిపోయాడు.
Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ ఇంట్లో పదో వారం మెగా చీఫ్ కంటెండర్ టాస్క అయిపోయింది. చివరకు ప్రేరణ మెగా చీఫ్ అయింది. చివరి రౌండ్‌లో రోహిణి, ప్రేరణ మిగిలారు. పృథ్వీని తప్పించడంతో ఊగిపోయాడు. నబిల్ మీదకు వెళ్లాడు. అనవసరంగా కయ్యానికి కాలు దువ్వాడు. ఇక ప్రేరణ మెగా చీఫ్ అవ్వడంతో విష్ణుకి చుక్కలు కనిపించాయి. టార్చర్ చేస్తోందంటూ విష్ణు ప్రియ రెచ్చిపోయింది.మరో వైపు ఎవిక్షన్ పాస్ గురించి టాస్క్ పెట్టాడు. ఇందులో ఎవరు ఎవరి కోసం ఆడుతున్నారు.. ఎవరికి ఎవరు శత్రువులు, మిత్రులు అన్నది అర్థం అవుతుంది.
ఇక ఈ శుక్రవారం నాటి ఎపిసోడ్ ఎలా సాగిందంటే.. అబద్దం ఆడి పృథ్వీ దొరికిపోయాడు. వీకెండ్‌లో ఆ వీడియోని వేస్తాడో లేదో చూడాలి. నబిల్ దాంట్లో బొమ్మలు వేయమని పృథ్వీ అన్నాడు. కానీ తాను అనలేదు అని బుకాయించాడు. నబిల్ తనని అవుట్ చేశాడనే కోపంతో ఊగిపోయాడు. అనవసరంగా గొడవకు దిగాడు. ఇక గంగవ్వ ఆడిన ఆటను తప్పు పట్టింది హరితేజ. కానీ అదే తీరులో హరితేజ ఆడితే ఒప్పుగా మారింది. అదే విషయాన్ని తేజ అడగడంతో నోరు మూసింది. తాను చేస్తే ఒప్పు.. మిగతా వాళ్లు చేస్తే తప్పు అన్నట్టుగా హరితేజ వ్యవహారం ఉంది.
ప్రేరణ మెగా చీఫ్‌గా గెలవడం.. తనకు ఇంటి సభ్యులు సపోర్ట్ చేయలేదంటూ రోహిణి కంటతడి పెట్టేసింది. ప్రేరణ మెగా చీఫ్ అవ్వడంతో విష్ణుకి తన సామాన్లు, తన డెస్క్‌ను జాగ్రత్తగా పెట్టుకోమని చెప్పింది. ఇక ఈ విషయంలో పలు మార్లు ఈ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. టార్చర్ చేస్తోంది అంటూ ప్రేరణ మీద విష్ణు తన గ్యాంగ్ వద్ద చాడీలు చెప్పుకుంటూ తిరిగింది. ఇక తన వస్తువులను అన్నీ తీసి ఇష్టమొచ్చినట్టుగా పారేసింది విష్ణు. హరితేజ చెప్పిన హరికథ అంత రసవత్తరంగా ఏమీ సాగలేదు. బిగ్ బాస్ ఆ హరికథకు మెచ్చి రెండు గంటల కిచెన్ టైంని ఇచ్చాడు.
ఎవిక్షన్ పాస్ గురించి టాస్క్ పెట్టాడు. గార్డెన్ ఏరియాలో పాము ఉంటుంది.. దానికి ఆకలి వేసినప్పుడు ఎగ్స్ పెట్టాలి.. ఆ ఎగ్స్ మీద కంటెస్టెంట్ల ఫోటోలుంటాయి.. చివరకు మిగిలిన గుడ్డుకి సంబంధించిన కంటెస్టెంట్‌కు ఎవిక్షన్ పాస్ వస్తుందని అన్నాడు. మెగా చీఫ్ అయిన ప్రేరణకు స్పెషల్ పవర్ ఇచ్చాడు. దీంతో ఆమె విష్ణు, గౌతమ్, పృథ్వీ, గంగవ్వ, హరితేజలను తప్పించేసింది. నువ్వు నన్ను తీస్తావని నాకు తెలుసు అంటూ హరితేజ మళ్లీ అదే పాతరాగం అందుకుంది.
ఇక సమయానుసారంగా.. ఆ పాము ఇద్దరిద్దరిని పిలిచింది. ఏదో ఒక ఎగ్ పెట్టమని కోరింది. అలా మొదటగా నబిల్, అవినాష్‌లను పిలిచింది. వారిద్దరూ కలిసి యష్మీని తప్పించారు. నన్ను తప్పించినందుకు థాంక్స్ అంటూ ఏడ్వలేక నవ్వుతూ.. లోపలి బాధను బయటకు తెలీకుండా కవర్ చేసింది యష్మీ. ఆ తరువాత నిఖిల్, గౌతమ్‌లను పిలిచాడు. నిఖిల్ తన ఎగ్ తాను ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. నాకు ఎవిక్షన్ పాస్ వచ్చినా నాకు నేను వాడుకోను అని అన్నాడు. కానీ గౌతమ్ మాత్రం ప్రేరణను తప్పించాలని అనుకున్నాడు. చివరకు టేస్టీ తేజను బలి చేశారు. సరైన కారణం చెప్పకుండా ఎలా తీసేస్తావ్ అంటూ గౌతమ్‌తో తేజ వాగ్వాదానికి దిగాడు. నీకు ఆ ఎవిక్షన్ పాస్ కావాలా? అది అవసరం లేకపోయినా ఉంటావ్ కదా అని గౌతమ్ అన్నాడు.
ఆ తరువాత విష్ణు, పృథ్వీ వచ్చి.. ప్రేరణను తీసేశారు. ఆపై రోహిణి, హరితేజలు వచ్చారు. హరితేజ ముందుగా అవినాష్‌ను తీసేద్దాం అని చెప్పింది. రోహిణి మాత్రం నిఖిల్‌ను తీసేద్దామని చెప్పింది. నిఖిల్‌ను తప్పా ఎవ్వరినైనా తీసేద్దామని చెప్పింది హరితేజ. అలా ఈ ఇద్దరి మధ్య నిర్ణయం ఎప్పటికీ తెగకపోవడంతో హెచ్చరించాడు. త్వరగా ఎగ్ పెట్టకపోతే తీవ్ర పరిణామాలుంటాయని అన్నాడు. దీంతో చివరకు రోహిణి కాస్త తగ్గి అవినాష్ ఎగ్‌ను వేసేసింది. దీంతో అవినాష్ హర్ట్ అయ్యాడు. ఇంత వరకు అవినాష్ నామినేషన్లోకి రాలేదు అందుకే వేశానని చెప్పింది హరితేజ.
ఆపై యష్మీ, తేజలను పిలిచాడు. యష్మీ మాత్రం రోహిణి ఎగ్ తీసేద్దామని పట్టుపట్టుకుని కూర్చొంది. తేజ మాత్రం నిఖిల్‌ను తీసేద్దామని అన్నాడు. నిఖిల్ తనది తాను తీసేందుకు సిద్దపడ్డాడు అందుకే అతని ఎగ్ తీసేద్దామని అన్నాడు. అలా ఈ ఇద్దరి మధ్య ఎంతకీ ఓ ఏకాభిప్రాయం రాలేదు. దీంతో ఇది హౌస్ నిర్ణయం అంటూ ఓ మాట జారి.. నిఖిల్ ఎగ్‌ను పడేశాడు. ఆ తరువాత వెంటనే యష్మీ వచ్చి రోహిణి ఎగ్‌ను కూడా పడేసింది. దీంతో నబిల్ ఎగ్ మాత్రమే అక్కడ మిగిలింది. మరి ఇది నియమాలకు విరుద్దం. దీన్ని బిగ్ బాస్ అంగీకరిస్తాడో లేదో చూడాలి. యష్మీ కావాలని పంతం పట్టి ఇలా చేసిందని చూస్తేనే తెలుస్తోంది. ఇక తేజ చెప్పిన కారణం సరైంది కాదంటూ నిఖిల్, పృథ్వీ, హరితేజ, యష్మీ ఇలా అందరూ అతని మీద పడ్డారు. తాను చేసింది తప్పే.. పరిణామాలు ఎదుర్కొనేందుకు రెడీ అని అన్నాడు. చివరకు మిగిలిన ఎగ్ నబిల్‌ది కాబట్టి.. నబిల్‌కే ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఇస్తాడా? లేదా? అన్నది చూడాలి.
Read Also: ‘పుష్ప 2’ ఐటెమ్ సాంగ్ ఫోటో లీక్ - అల్లు అర్జున్ తో శ్రీలీల ఊరమాస్ స్టెప్పులు!