అన్వేషించండి

Bigg Boss 8 Telugu Episode 55 Day 54: ఒక్కరి మీదే ఫోకస్ పెట్టకు, ఇల్లు జాగ్రత్త, కొత్త మెగా చీఫ్ విష్ణుప్రియకి గౌతమ్ కౌంటర్లు

Bigg Boss 8 Telugu Episode 55: బిగ్ బాస్ ఇంట్లో ఎనిమిదో వారం టాస్క్ ల ప్రకారం విష్ణుప్రియ మెగా చీఫ్‌గా నిలిచింది. ఇది ఉమెన్ వీక్ కాబట్టి.. ఉమెన్‌ను మెగా చీఫ్ చేస్తానని గౌతం విష్ణు కి ఛాన్స్ ఇచ్చాడు.

Vishnpiya Become Mega Chief :

బిగ్ బాస్ ఇంట్లో ఎనిమిదో వారం విష్ణుప్రియ మెగా చీఫ్‌గా నిలిచింది. రాజ్యాలు నిర్మించుకునే టాస్కులో రాయల్ క్లాన్ ఒక గేమ్ గెలిచింది. ఓజీ క్లాన్ మూడు ఆటలు గెలిచింది. చివరకు ఆరుగురు మెగా చీఫ్ కంటెండర్లుగా నిలిచారు. పృథ్వీ, నిఖిల్, విష్ణు, ప్రేరణ, తేజ, రోహిణి ఇలా ఆరుగురు మెగా చీఫ్ కంటెండర్లుగా నిలుస్తే.. మిరపకాయ్ దండలు అంటూ ఆట పెట్టడంతో.. చివరకు విష్ణు ప్రియ మెగా చీఫ్‌గా నిలిచింది. అసలు శుక్రవారం నాటి ఎపిసోడ్ ఎలా సాగిందో ఓ సారి చూద్దాం.

మీలో ఎవరు తెలివైన వారు అనే టాస్క్ పెట్టిన బిగ్ బాస్.. అందులో నిఖిల్‌ను సంచాలక్‌గా నియమించాడు. సంచాలక్ అయినా కూడా ఆట ఆడొచ్చు అని ఆఫర్ ఇచ్చాడు. ఈ ఆటలో టేస్టీ తేజ మరోసారి తన తెలివిని ప్రదర్శించాడు. ఈ టాస్కులో ఓజీ క్లాన్ విన్ అయినట్టుగా నిఖిల్ చెప్పేశాడు. దీంతో ప్రేరణను మెగా చీఫ్ కంటెండర్‌గా చేశారు. అటు క్లాన్ నుంచి మెహబూబ్‌ను తీసేశారు.

ఈ టాస్కు మధ్యలోనే గౌతమ్, ప్రేరణ మధ్య గొడవ జరుగుతుంది. యష్మీ ఏదో మాట్లాడేందుకు వస్తే.. మధ్యలో ఎందుకు వస్తున్నావ్. నీ పని నువ్వు చూసుకో అని గౌతమ్ అరిచేస్తాడు. అలా ఈ ఇద్దరి మధ్య కాస్త దూరం పెరిగినట్టు అయింది. గౌరవం ఇవ్వకపోతే మాట్లాడిన పని లేదంటూ యష్మీ గురించి తన టీంతో గౌతమ్ చెప్పుకుని తన బాధను బయటపెట్టేసుకున్నాడు.

నిఖిల్, యష్మీ ఇద్దరూ కూడా డైనింగ్ టేబుల్ వద్ద పెట్టుకున్న నార్మల్ ముచ్చట్లు సీరియస్ అయ్యాయి. నా నుంచి ఎక్కువ ఆశించకు అని నిఖిల్ అంటే యష్మీ హర్ట్ అయింది. నువ్వేమైనా పెద్ద అనుకుంటున్నావా? నాకు ఎవ్వరూ దొరక్క నీ వెనక పడుతున్నా అని అనుకుంటున్నావా? నీకు నాకు సెట్ అవ్వదు అంటూ యష్మీ అనేసింది. నేను కూడా అదే చెబుతున్నా కదా? అని నిఖిల్ అంటాడు.

ఆ తరువాత యష్మీ, ప్రేరణ ముచ్చట్లు పెట్టుకున్నారు. నేను గౌతమ్‌తో డ్యాన్స్ చేస్తుంటే.. జెలసీగా ఉందని విష్ణుతో నిఖిల్ చెప్పాడట.. అలా ఎందుకు చెప్పడం అంటూ యష్మీ హర్ట్ అయింది. ఆ తరువాత బిగ్ బాస్ ఇరు క్లాన్‌లకు ఆఫర్ ఇచ్చాడు. ఇరు క్లాన్‌ల నుంచి ఒక్కో కంటెస్టెంట్‌ పేరు చెప్పండి.. ఆ ఇద్దరు కూడా మెగా చీఫ్ కంటెండర్ అవుతారని చెప్పాడు.

దీంతో ఓజీ క్లాన్ విష్ణుని, రాయల్ క్లాన్ తేజని సెలెక్ట్ చేస్తారు. అలా చివరకు నిఖిల్, విష్ణు, ప్రేరణ, పృథ్వీ, తేజ, రోహిణిలు మెగా చీఫ్ కంటెండర్లు అయ్యారు. మెగా చీఫ్ కంటెండర్లంతా కూడా పూల దండలు వేసుకుని ఉండాలి.. బజర్ మోగినప్పుడు మిగిలిన కంటెస్టెంట్లు  మిరపకాయ్‌ని పట్టుకుని.. మెగా చీఫ్ కంటెండర్లోంచి ఓ కంటెస్టెంట్‌ను తీసి మిరపకాయ్‌ దండను వేయాల్సి ఉంటుంది. అలా మిరపకాయ్ దండం వేయడం చీఫ్ రేసు నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్ సంచాలక్‌గా ఉండాల్సి వస్తుంది. ఆ తరువాత ఆ కంటెస్టెంట్ కూడా మిరపకాయ్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించొచ్చు అని బిగ్ బాస్ అంటాడు.

అయితే ఒక కంటెస్టెంట్ ఒకసారి మాత్రమే మిరపకాయ్ పట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ బజర్‌కు మెహబూబ్ వచ్చి..  ప్రేరణని అవుట్ చేస్తాడు. రెండో బజర్‌కి నబిల్ వచ్చి రోహిణిని అవుట్ చేస్తాడు. మూడో బజర్‌కు అవినాష్ వచ్చి పృథ్వీని లేపేస్తాడు ఆ తరువాత పృథ్వీ పట్టుకుని తేజని తప్పిస్తాడు. అలా చివరకు నిఖిల్, యష్మీ మిగిలిపోతారు. ఆ చివరి రౌండ్‌లో గౌతమ్ మిరపకాయ్ పట్టుకుంటాడు. ఇది ఉమెన్ వీక్ కాబట్టి.. ఉమెన్‌ను మెగా చీఫ్ చేస్తానని అంటాడు. కానీ మెగా చీఫ్ చేసే ముందే వార్నింగ్ ఇస్తాడు. 

కంటెస్టెంట్‌గా ఉన్నప్పుడు ఎలా ఉన్నా.. ఒకరితోనే ఉన్నా.. ఒకరి మీదే ఫోకస్ పెట్టి ఉన్నా.. పట్టించుకోను కానీ.. మెగా ఛీప్ అంటే ఇంట్లో అందరినీ ఒకేలా చూసుకోవాలి.. ఇంటి మీద ఫోకస్‌తో ఉండాలి అంటూ ఇలా స్వీట్ వార్నింగ్‌లు సూచనలు ఇస్తూనే విష్ణుని మెగా చీఫ్ చేస్తాడు గౌతమ్. అలా ఎలాంటి ఆటలు ఆడకుండా చివరకు విష్ణు మెగా చీఫ్ అయింది. ఈమె చేతికి ఇచ్చిన లెటర్‌లో రెండు లక్షలు ఉండటంతో.. చివరకు ప్రైజ్ మనీ నలభై లక్షల 16 వేలకు పెరిగింది. మరి మెగా చీఫ్ అయిన విష్ణు ఎలా ఉంటుంది.. ఇంటి గురించి ఆలోచిస్తుందా? ఇంకా ఆ పృథ్వీని పట్టుకుని వేలాడుతూ ఉంటుందా? అన్నది చూడాలి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandra Babu Episode In Unstoppable Show : జైలుకు వెళ్లిన మొదటి రోజు ఏం ఆలోచించారు? పవన్‌తో ఏం మాట్లాడారు? అన్‌స్టాపుబుల్‌ షోలో రివీల్ చేసిన చంద్రబాబు 
జైలుకు వెళ్లిన మొదటి రోజు ఏం ఆలోచించారు? పవన్‌తో ఏం మాట్లాడారు? అన్‌స్టాపుబుల్‌ షోలో రివీల్ చేసిన చంద్రబాబు 
Prakash Raj: ప్రకాష్ రాజ్ JustAsking అంటూ ప్రశ్నలు ఎందుకు అడుగుతారో తెలుసా !
Prakash Raj: ప్రకాష్ రాజ్ JustAsking అంటూ ప్రశ్నలు ఎందుకు అడుగుతారో తెలుసా !
ABP Southern Rising Summit 2024 : మంత్రుల ఫోన్లు సీఎం ట్యాప్ చేస్తున్నారు - రేవంత్ లై డిటెక్టర్ టెస్టుకు వస్తారా ? - ఏబీపీ సదరన్  రైజింగ్ సమ్మిట్‌లో కేటీఆర్ సవాల్
మంత్రుల ఫోన్లు సీఎం ట్యాప్ చేస్తున్నారు - రేవంత్ లై డిటెక్టర్ టెస్టుకు వస్తారా ? - ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో కేటీఆర్ సవాల్
ABP Southern Rising Summit 2024 : మధ్యతరగతికి విమాన ప్రయాణం చేరువ చేస్తాం - మోదీ స్వేచ్చ ఇచ్చి పని చేయించుకుంటారు - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు
మధ్యతరగతికి విమాన ప్రయాణం చేరువ చేస్తాం - మోదీ స్వేచ్చ ఇచ్చి పని చేయించుకుంటారు - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను చాలా ప్రాక్టికల్, కొంచెం సెంటిమెంటల్ కూడా - నటి గౌతమిరేవంత్ రెడ్డి నా ఫోన్ ట్యాప్ చేయిస్తున్నాడు - కేటీఆర్ సంచలనంపర్ఫెక్ట్‌గా పాట పాడేవాళ్లు ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు - సింగర్ శిల్పా రావువిమానాలకు బాంబ్ కాల్స్, అలా చేస్తే బ్లాక్ లిస్ట్‌లోకే - రామ్మోహన్ నాయుడు వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandra Babu Episode In Unstoppable Show : జైలుకు వెళ్లిన మొదటి రోజు ఏం ఆలోచించారు? పవన్‌తో ఏం మాట్లాడారు? అన్‌స్టాపుబుల్‌ షోలో రివీల్ చేసిన చంద్రబాబు 
జైలుకు వెళ్లిన మొదటి రోజు ఏం ఆలోచించారు? పవన్‌తో ఏం మాట్లాడారు? అన్‌స్టాపుబుల్‌ షోలో రివీల్ చేసిన చంద్రబాబు 
Prakash Raj: ప్రకాష్ రాజ్ JustAsking అంటూ ప్రశ్నలు ఎందుకు అడుగుతారో తెలుసా !
Prakash Raj: ప్రకాష్ రాజ్ JustAsking అంటూ ప్రశ్నలు ఎందుకు అడుగుతారో తెలుసా !
ABP Southern Rising Summit 2024 : మంత్రుల ఫోన్లు సీఎం ట్యాప్ చేస్తున్నారు - రేవంత్ లై డిటెక్టర్ టెస్టుకు వస్తారా ? - ఏబీపీ సదరన్  రైజింగ్ సమ్మిట్‌లో కేటీఆర్ సవాల్
మంత్రుల ఫోన్లు సీఎం ట్యాప్ చేస్తున్నారు - రేవంత్ లై డిటెక్టర్ టెస్టుకు వస్తారా ? - ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో కేటీఆర్ సవాల్
ABP Southern Rising Summit 2024 : మధ్యతరగతికి విమాన ప్రయాణం చేరువ చేస్తాం - మోదీ స్వేచ్చ ఇచ్చి పని చేయించుకుంటారు - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు
మధ్యతరగతికి విమాన ప్రయాణం చేరువ చేస్తాం - మోదీ స్వేచ్చ ఇచ్చి పని చేయించుకుంటారు - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు
ABP Southern Rising Summit 2024 : డీలిమిటేషన్లో దక్షిణాదికి అన్యాయం అనేది ప్రాంతీయ పార్టీల వాదన - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో తేల్చేసిన బీజేపీ ఎంపీ రఘునందన్
డీలిమిటేషన్లో దక్షిణాదికి అన్యాయం అనేది ప్రాంతీయ పార్టీల వాదన - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో తేల్చేసిన బీజేపీ ఎంపీ రఘునందన్
ABP Southern Rising Summit : జయలలిత చాలా స్వీట్.. అన్నాడీఎంకేలో గౌతమి చేరడానికి ఆమె రీజనా?
జయలలిత చాలా స్వీట్.. అన్నాడీఎంకేలో గౌతమి చేరడానికి ఆమె రీజనా?
Allu Arjun News: నటుడు అల్లు అర్జున్‌కి హైకోర్టులో ఊరట, అప్పటివరకూ చర్యలు తీసుకోవద్దన్న ధర్మాసనం
నటుడు అల్లు అర్జున్‌కి హైకోర్టులో ఊరట, అప్పటివరకూ చర్యలు తీసుకోవద్దన్న ధర్మాసనం
Asifabad News: ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మికి హైకోర్టులో భారీ ఊరట
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మికి హైకోర్టులో భారీ ఊరట
Embed widget