అన్వేషించండి

Bigg Boss 8 Telugu Day 9 Episode 10 Review : సోనియా ఓవర్ కాన్ఫిడెన్స్! ఆదిత్య ఓం ఉపదేశం - రెండో వారం నామినేట్ అయింది వీరే

Bigg Boss telugu Season 8: బిగ్ బాస్ హౌస్ లో రెండవ వారం నామినేషన్ ప్రక్రియ ముగిసిపోయింది. ఈ సారి మణికంఠ, పృథ్వీ, ఆదిత్య, నిఖిల్, సీత, శేఖర్ బాషా, నయనిక, విష్ణు ప్రియలు నామినేట్ అయ్యారు.

Bigg Boss Season 8, Day 9 Review: బిగ్ బాస్ ఇంట్లో ఇప్పుడు రెండో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ ముగిసింది. సోమవారం నాడు పూర్తవ్వాల్సిన నామినేషన్ ప్రక్రియ.. మంగళవారం ఎపిసోడ్ వరకు సాగింది. మొత్తానికి ఈ రెండో వారంలో.. మణికంఠ, పృథ్వీ, ఆదిత్య, నిఖిల్, సీత, శేఖర్ బాషా, నయనిక, విష్ణు ప్రియలు నామినేట్ అయ్యారు. ఇక కంటెస్టెంట్లకు ఇచ్చిన రేషన్ మొత్తాన్ని బిగ్ బాస్ లాగేసుకున్నాడు. ఇకపై ఏం తినాలన్నా.. వండుకోవాలన్నా.. సొంతంగా సంపాదించుకోవాలని చెప్పాడు. ఈ పదో ఎపిసోడ్ ఎలా సాగిందంటే.

Read Also: బాత్రూంలో తింటానంటోన్న ప్రేరణ.. గట్టి రిప్లై ఇచ్చిన సీత..

నిఖిల్ చీఫ్‌గా ఫెయిల్ అయ్యాడని, ఫుడ్ అందరికీ ప్రిపేర్ చేసి పెట్టేలా టీంను చూసుకోలేదని, లంచ్ ప్రిపరేషన్ జరగలేదనే కారణాలు చెప్పి ప్రేరణ నామినేట్ చేసేసింది. ఇక సీతను నామినేట్ చేస్తూ.. వాగ్వాదం చేస్తూనే ఉంటావ్.. ఎదుటి వాళ్లని మాట్లాడనివ్వవు.. ఎదుటి వాళ్లు చెప్పింది వినవు.. టాస్కుల్లో క్లారిటీ ఉండదు.. డస్ట్ బిన్‌లోంచి తీసింది.. నేను.. ఫీల్ అవ్వాల్సింది నేను.. అంటూ ప్రేరణ కారణాలు చెప్పింది. కానీ ప్రేరణ చెప్పిన దానికి సీత ఒప్పుకోలేదు.. నా తప్పు లేదని, నాకు క్లారిటీ ఉందని.. రైట్ అనిపిస్తే.. నేను పోరాడుతా.. వంద మందితో అయినా సరే పోరాడతాను వెనక్కి తగ్గను అని .. సీత రివర్స్‌లో ఫైర్ అయింది.

ఆ తరువాత పృథ్వీ వచ్చి మణికంఠను నామినేట్ చేశాడు. ఒక క్లాన్ నుంచి మరో క్లాన్‌కి సర్వైవల్ కోసం మారిపోయావ్.. మోసం చేసినట్టుగా అనిపించింది అనే కారణం చెప్పాడు.. క్లాన్ నుంచి క్లాన్ మారిపోవడం తప్పు కాదు.. అది నా ఆట అంటూ.. మణికంఠ వాదించాడు. నయనిని నామినేట్ చేస్తూ.. చీఫ్‌గా ఫెయిల్ అయిందని, నేను తిన్న ప్లేట్లను తీయలేదు.. క్లీన్‌గా ఉంచలేదు.. క్లాన్ మొత్తం ఫెయిల్ అయిందనే కారణాలు చెప్పాడు. తిన్న ప్లేట్లను తీస్తారా? తీయరా? అని చివరగా అడిగితే.. మూడ్ఋను బట్టి తీస్తా.. అని నయనిక చెప్పింది.

ఆ తరువాత నబిల్ వచ్చి.. నిఖిల్‌ను నామినేట్ చేశాడు. ఇద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉంటే. చీఫ్ అయి ఉండి సైలెంట్‌గా ఉన్నావ్ అని.. చీఫ్‌గా ఫెయిల్ అయ్యావనే కారణాలు చెప్పి నామినేట్ చేశాడు. పృథ్వీని నామినేట్ చేస్తూ.. కేర్ లెస్, ఇర్రెస్పాన్సిబుల్.. టవల్ సోఫా మీదే పెట్టావ్..  సోఫా మీద కాళ్లు పెట్టావ్.. హౌస్ రూల్స్ బ్రేక్ చేశావ్ అనే కారణాలు చెప్పాడు నబిల్

ప్రేరణతోనే నేను ఎక్కువ మింగిల్ అయ్యా..డస్ట్ బిన్ బాటిల్‌ను జోక్‌గానే చేసి ఉండొచ్చు..  గేమ్ ఆడుతూ సెన్సిబుల్‌ను వదిలి పెట్టకు అని నయని నామినేట్ చేస్తూ కారణాలు చెప్పింది. నేను కావాలని చేయలేదు.. నాలో అంత క్రూయాలిటీ లేదు అని ప్రేరణ క్లారిటీ ఇచ్చింది. పృథ్వీ కంఫర్ట్ జోన్‌లోనే ఉంటున్నాడు.. పనుల నుంచి తప్పించుకుంటున్నాడు.. సేఫ్ ఆడుతున్నాడు.. అని కారణాలు చెప్పి నయని నామినేట్ చేసింది. 

క్లాన్‌లో డబుల్ మైండ్‌తో ఉన్నావ్.. డస్ట్ బిన్ ఇష్యూ మీద నీకే ఓ క్లారిటీ లేదు.. అందరినీ వెళ్లి అడుగుతున్నావ్..  తప్పు చేసినా రైట్ చేసినా.. అది నీ మైండ్‌కు తెలియాలి అంటూ ప్రేరణని నామినేట్ చేశాడు నిఖిల్. ఇంట్లో పని చేయలేదు.. క్లాన్‌లోకి వెళ్లాక, లగ్జరీ వచ్చాక  చేయడం లేదు.. అంతకు ముందు కూడా చేయలేదు..అంటూ పృథ్వీని నిఖిల్ నామినేట్ చేశాడు. అలా చివరకు మణికంఠ, ప్రేరణ, పృథ్వీ, ఆదిత్య, నిఖిల్, సీత, శేఖర్ బాషా, నయనిక నామినేషన్‌లోకి వచ్చారు. కానీ బిగ్ బాస్ అక్కడే ట్విస్ట్ ఇచ్చాడు. యష్మీకి ఓ పవర్ ఇచ్చి.. ఒకరిని సేవ్ చేసి.. దానికి బదులు మరొకరిని నామినేట్ చేయమని అన్నాడు. దీంతో ప్రేరణని సేఫ్ చేసి.. విష్ణుప్రియని నామినేట్ చేసింది యష్మీ.

Read Also: నామినేషన్స్​లో యశ్మీకి అదిరే పవర్ ఇచ్చిన బిగ్​బాస్.. ఏడ్చేసిన నైనిక.. ఓదార్చిన నిఖిల్..

ఈ నామినేషన్ల గొడవ అయ్యాక.. నిఖిల్ మీద పృథ్వీ అలిగాడు. గేమ్ కోసం మారిపోయావ్ అని నిఖిల్‌ను అన్నాడట. ఇక పృథ్వీ అలా అలగడంతో సోనియా వెళ్లి సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. నిఖిల్ సెట్ అవుతాడులే.. చూద్దాం.. ఈ వారం ఎలా ఉంటాడో.. అయినా వెళ్లాల్సిన వాళ్లు ఇంకా చాలా మంది ఉన్నారు.. మనం ఎలాగూ ఇంకా ఉంటాం కదా? అని సోనియా తన ఓవర్ కాన్ఫిడెన్స్‌ను చూపించింది. పృథ్వీ తనను అపార్థం చేసుకుంటున్నాడని నిఖిల్ కూడా కాస్త హర్ట్ అయ్యాడు. 

మరుసటి రోజు ఉదయం విష్ణుప్రియతో యష్మీ మాట్లాడుతూ.. నామినేట్ చేసింది తన పర్సనల్ నిర్ణయంతో కాదని, క్లాన్ నిర్ణయమని క్లారిటీ ఇచ్చేసుకుంది. బాత్‌రూం ఏరియాలో నబిల్‌కు ఆదిత్య హితోపదేశం చేశాడు. అందరితో బాగుండొద్దు.. అలా ఉంటే పృథ్వీకి ఏమైంది.. క్లాన్‌లో పృథ్వీనే ఎక్కువగా ఆడాడు.. చివరకు యష్మీ ఎవరిని సేవ్ చేసింది.. నిఖిల్ ప్రేరణలు ఒకరినొకరు నామినేట్ చేసుకోవడం కూడా గేమే అంటూ ఇలా ఆదిత్య విశ్లేషించి నబిల్‌కు చెప్పుకొచ్చాడు.

ఇక ఇంట్లో మొదటి వారం ఎలా గడిచిందని కంటెస్టెంట్లను బిగ్ బాస్ అడిగాడు. ఇంట్లో ఉన్న రేషన్ మొత్తాన్ని స్టోర్ రూంలో పెట్టమన్నాడు. వండినవి, వండనవి అన్నీ కూడా పెట్టమన్నాడు. దీంతో అందరూ ధీనంగా మొహాలు పెట్టి.. అయ్యయ్యో కాస్త ముందుగానే ఇవన్నీ తినేసినా అయిపోవు కదా? అని అనుకున్నారు. కొంత మంది తింటూనే స్టోర్ రూంలో పెట్టారు. చివరకు వీళ్ల బాధ చూసిన బిగ్ బాస్ కాస్త టైం ఇచ్చాడు. ఆ టైంలో ఎంత కావాలంటే అంత తినమన్నాడు. దీంతో ఒక్కొక్కరు కక్కుర్తికి కేరాఫ్ అడ్రస్ (శేఖర్ బాషా డైలాగ్ కూడా అదే) అన్నట్టుగా తినేశారు. చివరకు రేషన్ అంతా స్టోర్ రూంలో పెట్టించాడు బిగ్ బాస్. ఇక ఈ రెండో వారంలో కంటెస్టెంట్లకు రేషన్ ఎలా వస్తుందో.. బిగ్ బాస్ ఎలాంటి టాస్కులు ఇస్తాడో చూడాలి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Embed widget