Bigg Boss 8 Telugu Day 12 Review: ఏడుపుగొట్టు ఎపిసోడ్ - క్రింజ్ టాస్కులు విరక్తి పుట్టించిన కంటెస్టెంట్లు
Bigg Boss 8 Telugu Day 12: శుక్రవారం నాటి ఎపిసోడ్‌ను బిగ్ బాస్ ఎమోషనల్‌గా మార్చే ప్రయత్నం చేశాడు. అయితే గట్టిగా 2 వారాలు గడవకముందే ఫ్యామిలీ మిస్సింగ్ ఎపిసోడ్చి చిరాగ్గా అనిపించే అవకాశం ఉంది.
Bigg Boss 8 Telugu Day 12 Episode 16 Review: బిగ్ బాస్ ఇంట్లో కొందరు ఊ అంటే చాలు కన్నీరు పెట్టేసుకుంటూ ఉంటారు. గత సీజన్లలో ఇలా పదే పదే ఏడుస్తూ పాతాళ గంగని పేరు తెచ్చుకుంది శివ జ్యోతి. ఇక ఇప్పుడు ఈ ఎనిమిదో సీజన్లోనూ అలాంటి కంటెస్టెంట్లు ఉన్నారు. శుక్రవారం నాటి ఎపిసోడ్‌ను బిగ్ బాస్ ఎమోషనల్‌గా మార్చాడు. ఇలాంటి ఎమోషనల్ ఎపిసోడ్‌ను లాస్ట్ రెండు మూడు వారాల్లో పెడితే కాస్త రియల్ ఎమోషన్స్లా అనిపిస్తాయి. కానీ షో ప్రారంభం అయి రెండు వారాలు కూడా నిండక ముందే ఇలాంటి ఎమోషనల్ ఎపిసోడ్ పెడితే చాలా చిరాగ్గా అనిపించొచ్చు.
శుక్రవారం నాటి ఎపిసోడ్ ఎలా సాగిందంటే... నిఖిల్ క్లాన్ గెలిచిన అమౌంట్‌ను ప్రైజ్ మనీలో యాడ్ చేశారు. స్పిన్ ది బాటిల్ అనే టాస్క్ ఆడియెన్స్‌కు విరక్తి పుట్టించేలా ఉంది. విష్ణు ప్రియ చేసింది పోల్ డ్యాన్స్ ఎవ్వరూ అనరు... యష్మీ చికెన్ దొంగతనం చేసినట్టు ఒప్పుకుంది. సోనియా ఆడపులి అని బిల్డప్ ఇచ్చింది. కానీ గెటప్ వేసుకున్న తరువాత ఆడ పిల్లిలా అనిపించింది. ఆదిత్య లిప్ స్టిక్ చాలా చెత్తగా అనిపిస్తుంది. నిఖిల్ లేడీ గెటప్ డ్యాన్స్ మరింత క్రింజ్‌లా అనిపిస్తుంది.
వచ్చిన రెండు వారాలకే బిగ్ బాస్ ఏదో నెలల తరబడి ఫ్యామిలీ మెంబర్లకు దూరంగా ఉన్నట్టు బిల్డప్ ఇచ్చాడు. ఇక కంటెస్టెంట్లు సైతం ఏదో ఫ్యామిలీ మెంబర్లను వదిలి ఏళ్లు గడిచినట్టుగా తెగ ఏడ్చేశారు. ఐదుగురు కంటెస్టెంట్లకు ఆఫర్ ఇచ్చాడు. ఫ్యామిలీ మెంబర్ల నుంచి వచ్చిన గిఫ్ట్‌లను తీసుకునే ఛాన్స్ ఇచ్చాడు. కానీ ఆ ఐదుగురు కంటెస్టెంట్లు ఎవరన్నది మిగిలిన కంటెస్టెంట్లు డిసైడ్ చేస్తారని అన్నాడు. ఇద్దరికి టై పెట్టి.. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే..వారికే గిఫ్ట్‌ను సొంతం చేసుకునే ఛాన్స్ వస్తుందని అన్నాడు.
Read Also: ఎమోషనల్ సర్ప్రైజ్, ఒక్కొక్కరి స్టోరీతో ప్రోమో ద్వారానే ఏడిపించిన బిగ్ బాస్...
అలా అభయ్, నిఖిల్‌కు ఫాదర్ సెంటిమెంట్ పడింది. అభయ్ తన తండ్రికి కొనిచ్చిన వాచ్ ఒకవైపు.. నిఖిల్ దొంగతనం చేసి తన తండ్రి షర్ట్ మరో వైపు ఉంది. దీంతో ఇంటి సభ్యుల్లో మెజార్టీ అభయ్ తరుపుని నిలబడ్డారు. దీంతో అభయ్‌కి వాచ్ వచ్చేసింది. ఆ తరువాత సీత, నయనికలకు గిఫ్ట్‌లు వచ్చాయి. అందులో నయనిక బాయ్ ఫ్రెండ్ షర్ట్ ఉంది. తనకు జరిగిన బ్రేకప్.. తన రిలేషన్షిప్ గురించి తలుచుకుని ఏడ్చేసింది. సీత సైతం బ్రేకప్ నుంచి బయటపడే క్రమంలో కొన్న టెడ్డీ బియర్‌ను మిస్ అవుతోందట. అది లేకుండా నిద్ర పోదట. కానీ బిగ్ బాస్ ఇంట్లో తనకు ఫ్రెండ్స్ దొరికారని చెప్పుకొచ్చింది. ఇంటి సభ్యుల ఓట్లతో నయనికకు ఆమె బాయ్ ఫ్రెండ్ షర్ట్ లభించింది.
నబిల్ తన ఫాదర్‌తో ఉన్న చివరి ఫోటో.. పృథ్వీ తన ఫాదర్‌తో ఉన్న ఏకైక ఫోటోను బిగ్ బాస్ పంపించాడు. ఇంటి సభ్యులంతా కూడా నబిల్‌కు సపోర్ట్ చేశారు. దీంతో నబిల్‌కు తన తండ్రి ఫోటో వచ్చింది. మణికంఠకి తన అమ్మమ్మ శాలువా వచ్చింది. ఆదిత్యకు తన తండ్రి ఫోటో వచ్చింది. తండ్రి అంటే తనకు ఎంత ఇష్టమో వివరించి ఏడ్చేశాడు ఆదిత్య. ఇంటి సభ్యుల్లో మెజార్టీ ఆదిత్యకు ఉండటంతో.. తండ్రి ఫోటోను గిఫ్ట్‌గా పొందగలిగాడు. ఇలా ఈ శుక్రవారం నాటి ఎపిసోడ్ పూర్తి ఏడ్పు గుట్టు ఎపిసోడ్‌గా మారింది. నిఖిల్, శేఖర్ బాషా, ఆదిత్య ఓంలు కూడా తెగ ఏడ్చేశారు. యష్మీ, సోనియా, సీత, నయనికలు కూడా తమ ట్యాంకుని ఓపెన్ చేశారు. ఇలాంటి ఎపిసోడ్ ఇంకో పది వారాల తరువాత పడి ఉంటే ఆడియెన్స్ కూడా కాస్త బాధ పడేవారు. కానీ ఇప్పుడే రావడంతో వాళ్లకి చిరాగ్గా అనిపించే ఛాన్స్ ఉంది.