Bigg Boss 8 Telugu Day 11 Episode 12 Review: ప్రైజ్‌మనీ టాస్క్‌లో దుమ్మురేపిన నిఖిల్ క్లాన్- టాస్క్‌లలో తేలిపోతున్న సోనియా
Bigg Boss 8 Episode 12 Review: బిగ్ బాస్ ఇంట్లో రేషన్ మంట రగులుతూనే ఉంది. మరోవైపు గురువారం నాటి ఎపిసోడ్‌లో ప్రైజ్ మనీకి సంబంధించిన టాస్కులు పెట్టాడు బిగ్ బాస్
Bigg Boss 8 Telugu Day 11 Episode 12 Review: బిగ్ బాస్ ఇంట్లో రేషన్ పెద్ద మంట పెట్టేసింది. యష్మీ క్లాన్, నయనిక క్లాన్‌లకు రేషన్ వచ్చింది. నిఖిల్ క్లాన్‌కు రేషన్ లేకుండా పోయింది. టాస్కుల్లో ఓడిన నిఖిల్, మణికంఠలకు ఫుడ్ లేదు. కానీ బిగ్ బాస్ ఉడకపెట్టిన వెజిటబుల్స్, రాగి పిండి పంపిన సంగతి తెలిసిందే. ఇక గురువారం నాటి ఎపిసోడ్‌లో ప్రైజ్ మనీకి సంబంధించిన టాస్కులు పెట్టాడు.
స్విమ్మింగ్ పూల్‌లో దూకాలనే టాస్కులో సోనియా బొక్క బోర్లా పడింది. విష్ణు ప్రియ విన్ అయింది. ఆ తరువాత టాస్కులో నిఖిల్ అదరగొట్టేశాడు. పృథ్వీ, నబీల్‌లను ఓడగొట్టి నిఖిల్ యాభై వేలు సంపాదించాడు. స్పెల్ బీ ఆటలో నయని, యష్మీలు ఓడిపోయారు. ఈ టాస్కులో మణికంఠ విన్ అయి 70 వేలు సంపాదించాడు. నాలుగో ఛాలెంజ్‌లో లక్షా యాభై వేలు ఉంటే.. ఇద్దరికి 75 వేల చొప్పున ప్రైజ్ మనీ వస్తుందని అన్నాడు. మినిట్ మెయిడ్ టాస్కులో అభయ్, నిఖిల్‌లు గెలిచారు.
ఆ తరువాత వ్యాక్స్ చేసుకునే టాస్కులో యాభై వేల ప్రైజ్ మనీ పెట్టాడు. ఈ టాస్కులో నబీల్ గెలిచాడు. మధ్యలోనే పృథ్వీ చేతులెత్తేస్తాడు. ఆ తరువాత ఛాలెంజ్ విలువ లక్షకు పెంచాడు. చివరి వరకు సాక్స్‌ను ధరించి ఎవరు ఉంటారో అని టాస్క్ పెట్టాడు. ఈ క్రమంలో టాస్కుల్లో పాల్గొన్న నిఖిల్, విష్ణు, మణికంఠ, నబీల్,అభయ్, పృథ్వీ మధ్య గొడవలు జరుగుతాయి. ఒకరిపై ఒకరు అర్చుకుంటారు. సంచాలక్‌గా యష్మీ సరైన చర్యలు తీసుకోలేదనిపిస్తుంది. చివరకు ఈ ఛాలెంజ్‌ను గెలిచి అభయ్, నిఖల్‌లు చెరో యాభై వేలు సంపాదించుకుంటారు. అలా మొత్తం నిఖిల్ క్లాన్ రూ. 245000తో లీడ్‌లోకి వస్తుంది.
ఇక గురవారం నాటి ఎపిసోడ్‌లో మణికంఠ ఆకల్ని తట్టుకోలేకపోతాడు. దోశలు వేసుకుని అర్దరాత్రి తింటాడు. మణికంఠతో పాటుగా నిఖిల్ కూడా తింటాడు. ఇంటి సభ్యులంతా చూస్తుంటారు. కానీ ఎవ్వరూ అడ్డు చెప్పలేదు. దీంతో రాత్రి రెండు గంటలకు అందరినీ నిద్ర లేపి.. లివింగ్ రూంకి రమ్మంటాడు. నియమాలు పెడితే లెక్కలేకుండా పోయింది.. మీరంతా కలిసి బిగ్ బాస్ నిరుత్సాహపరిచారని వార్నింగ్ ఇస్తాడు. ఈసారి వదిలి పెడతాను అని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఇంకోసారి ఇది రిపీట్ కాకూడదని అన్నాడు.
మధ్యలో యష్మీ, విష్ణు ప్రియల గొడవ జరిగింది. ఎవరి రేషన్ వారిదే అంటే.. నయనిక క్లాన్‌కు సంబంధించిన చికెన్‌ను యష్మీ దొంగిలించింది. కానీ సాక్ష్యం ఉందా? అని యష్మీ బుకాయించింది. విష్ణుప్రియని నానా మాటలు అనేసింది. టాస్కుల్లో గొడవలు అవుతున్నాయి.. టాస్కులు అంటే పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని పృథ్వీ గురించి నిఖిల్ చెప్పుకొచ్చాడు. టాస్కుల్లో భాగంగా ఈ సారి కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదాలు, అరుపులు, గొడవలు బాగానే అయ్యాయి. సోనియా ఆటల్లో వేస్ట్ అని మరోసారి ఫ్రూవ్ అయింది. నిఖిల్ టీం టాస్కులతో అదరగొట్టేసింది.
Also Read: 6 టాస్క్‌లు, 4.5 లక్షల ప్రైజ్ మనీ... 'బిగ్ బాస్' లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఎవరెంత గెలుచుకున్నారంటే?