By: Haritha | Updated at : 24 Sep 2022 04:43 PM (IST)
(Image credit: Star Maa)
Bigg Boss 6: అందరూ ఎంతగానో వెయిట్ చేసే వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసింది. నాగార్జున ఎవరికి క్లాసు తీసుకుంటారో, ఎవరికి చప్పట్లు కొడతారో అని ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా విడుదలైన ప్రోమోలో నాగార్జున బాలదిత్యకు క్లాసు తీసుకున్నారు. స్క్రీన్ మీదకి రావడమే నాగార్జున చాలా సీరియస్ ముఖంతో కనిపించారు. గతవారం సరిగా ఆడని కారణంగా తొమ్మిది మంది సోఫా వెనక్కి నిల్చున్నారు. వారిని తిరిగి సోఫా వెనక్కి నిల్చోమన్నారు నాగార్జున. వారిలో శ్రీసత్య, శ్రీహాన్ బాగా ఆడారని సోఫాలో కూర్చోమని చెప్పారు. వారి కోసం చప్పట్లు కూడా కొట్టరా? అని అడిగారు. దానికి బాలాదిత్య ‘వెనక్కి ఉండిపోయామన్న షాక్‌లో కొట్టలేదు’ అన్నాడు. దానికి నాగార్జున ‘నువ్వు ఆడిన తీరు చూసి మేము కూడా షాకయ్యాం’ అన్నారు.
వీడియోతో...
బాలాదిత్యకు సంబంధించిన వీడియో వేయమన్నారు నాగార్జున. అందులో ఇనయాను ముగ్గురు, నలుగురు లాక్కెళ్లుతుంటే, పెద్ద గొడవ అవుతుంటే... బాలాదిత్య మాత్రం కిమ్మనకుండా కూర్చుని ఉన్నాడు. అంత గొడవ జరుగుతున్నా తనకు పట్టనట్టు ఉన్నాడు. అది చూపించి నాగార్జున బాలాదిత్యను అడిగారు. ‘ఇది నా ఆటతీరు కాదు, నా తీరే అంత అని అన్నావ్ కదా, పోలీసు టీమ్ లో నీ బాధ్యతేంటి?’ అని అడిగారు. దానికి బాలాదిత్య ‘సర్ నేను అప్పుడు పోలీసు కన్నా, మనిషిగా ఆలోచించాను’ అన్నాడు. దానికి నాగార్జున ‘బాలాదిత్య మంచి వాక్చాతుర్యంతో ఇచ్చిన సమాధానాన్ని మీరు ఒప్పుకుంటారా’ అని ఆడియెన్స్ ను అడిగారు. దానికి ఆడియెన్స్ ‘నో’ అని చెప్పారు.
పిట్టకధలు...
ముందున్న వాళ్ల గురించి చాలా చాలా పిట్ట కథలు చెప్పాలి అన్నారు నాగార్జున. దానికి గీతూ, ఇనయ, శ్రీహాన్ ఎక్స్ ప్రెషన్స్ మారిపోయాయి. ఎందుకంటే వారి ముగ్గురు మధ్యే పిట్ట గొడవ అయింది. ఈ మొత్తం సీన్లో ఎవరికి క్లాసు పడుతుందో తెలియదు. ఈ ఎపిసోడ్ కోసం అంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఈ వారం నామినేషన్లలో మొత్తం తొమ్మిది మంది నిలిచారు.
1. వాసంతి
2. ఆదిత్య
3. చంటి
4. ఆరోహి
5. నేహ
6. ఇనయా
7. శ్రీహాన్
8. రేవంత్
9. గీతూ
ఈ తొమ్మిది మందిలో బాగా వీక్ కంటెస్టెంట్ వాసంతి. ఆమె వెళ్లే ఛాన్సులు అధికంగా ఉన్నాయి. ఆమె కాకపతే ఇనయాకు ఎసరు తప్పేలా లేదు.
"Mee aata teeru chusi memu kuda shock lo unnam..." says 👑 Nagarjuna! 😱
— starmaa (@StarMaa) September 24, 2022
Don't miss tonight's exciting episode of #BiggBossTelugu6 on @StarMaa & @DisneyPlusHSTel.@iamnagarjuna #BBLiveOnHotstar #StarMaa #DisneyPlusHotstar pic.twitter.com/6pUkPxj9Jh
Also read: ఇంటి మూడో కెప్టెన్ ఆదిరెడ్డి, భార్యకు ఐలవ్యూ చెప్పిన కామన్‌మ్యాన్, జైలుకెళ్లిన లవర్ బాయ్
Mehaboob On Sri Satya: శ్రీసత్య విషయంలో చొక్కాలు పట్టుకుని మరీ కొట్టుకోబోయిన అర్జున్, మెహబూబ్
Deepthi Sunaina vs Shanmukh: ఏమోనే vs జాను - యూట్యూబ్లో పోటాపోటీగా దీప్తి, షన్నుల వీడియో సాంగ్స్, ఎవరికి ఎన్ని వ్యూస్ అంటే!
వీజే సన్నీ దొంగతనం చేశాడా? బ్యాగ్ నిండా డబ్బులతో సీసీటీవీ కెమేరాకు చిక్కిన వైనం
Bigg Boss Telugu TRP: క్రేజ్ తగ్గిందా? పాతాళానికి పడిపోయిన ‘బిగ్ బాస్’ రేటింగ్? సీజన్-6 ఫెయిల్యూర్కు కారణాలివే!
Inaya Proposes Sohel : సోహైల్ అంటే పిచ్చి, ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తా - ప్రపోజ్ చేసిన 'బిగ్ బాస్' ఇనయా
Majilis Congress : మజ్లిస్ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?
Supreme Court Amaravati Case : ఫిబ్రవరి 23న సుప్రీంకోర్టులో అమరావతి కేసు విచారణ - త్వరగా చేపట్టాలని ఏపీ న్యాయవాది విజ్ఞప్తి !
Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!
Top Mileage Bikes: మంచి మైలేజ్ ఇచ్చే బైక్స్ కొనాలనుకుంటున్నారా? - బడ్జెట్‌లో బెస్ట్ లుక్, బెస్ట్ మైలేజ్ వీటిలోనే!