బిగ్ బాస్ హౌస్ లో యాభై రోజులు పూర్తి చేసుకున్నందుకు గాను హౌస్ మేట్స్ కి కంగ్రాట్స్ చెప్పారు బిగ్ బాస్. హౌస్ మేట్స్ కి ప్రియమైన వారి దగ్గర నుంచి ఒక లేఖ దక్కించుకునే అవకాశం ఉంటుందని చెప్పిన బిగ్ బాస్.. నామినేషన్ ప్రక్రియలో భాగంగా సమయానుసారం ఒక పోస్ట్ మ్యాన్ వచ్చి ఇద్దరు ఇంటి సభ్యులను పిలుస్తారని.. వాళ్లిద్దరూ పవర్ రూమ్ కి వచ్చి పోస్ట్ బ్యాగ్ ను తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. పోస్ట్ బ్యాగ్ లోపల ఇద్దరు ఇంటి సభ్యులకు వారి ప్రియమైన వాళ్లు.. వారి కోసం పంపిన లేఖలు ఉంటాయని చెప్పారు. పవర్ రూమ్ కి వచ్చిన సభ్యులు.. ఏ ఇద్దరి ఇంటి సభ్యులు లేఖలైతే వారి దగ్గరున్నాయో వారిద్దరి నుంచి ఎవరికి లేఖను ఇస్తారో.. ఎవరి లెటర్ ను చించేస్తారో నిర్ణయించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఎవరికైతే పవర్ రూమ్ లో ఉన్న సభ్యులు లేఖను ఇస్తారో వారు ఈ వారం నామినేషన్ నుంచి సేవ్ అవుతారు. లేఖ లభించని సభ్యులు నామినేట్ అవుతారు.
Also Read: ప్రభాస్-పూజాహెగ్డేల మధ్య గొడవ.. నిజమేనట..
ముందుగా శ్రీరామ్, మానస్ లను పవర్ రూమ్ లోకి పిలవగా.. వారికి ప్రియాంక-లోబో లేఖలు వచ్చాయి. ప్రియాంకకు తన తల్లిదండ్రుల నుంచి లేఖ రావడంతో అదే విషయాన్ని లోబోకి చెప్పి ఆయన్ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది. 'చాలా సంవత్సరాల నుంచి నేను మా నాన్నగారితో సరిగ్గా మాట్లాడలేదు' అంటూ చెప్పింది. తన భార్య గర్భవతి అని ఎలా ఉందో తెలియదని.. ఈ లెటర్ తనకు కూడా ఇంపార్టెంట్ అని లోబో అన్నాడు. కానీ ప్రియాంకకు లేఖ ఇవ్వమని చెప్పాడు. ఫైనల్ గా శ్రీరామ్-మానస్ లు ప్రియాంకకు లెటర్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రియాంకకు లెటర్ ఇచ్చి.. లోబో లెటర్ చించేయడంతో అతడు ఎమోషనల్ అయి ఏడ్చేశాడు.
షణ్ముఖ్-రవిలను పవర్ రూమ్ లోకి పిలవగా.. వారిని సిరి-విశ్వల లేఖలు వచ్చాయి. విశ్వ ఏడుస్తూ.. సిరిని రిక్వెస్ట్ చేయడంతో 'తీస్కో' అంటూ ఎమోషనల్ గా చెప్పింది. దీంతో విశ్వ లెటర్ తీసుకున్నాడు.
ప్రియాంక-కాజల్ లను పవర్ రూమ్ లోకి పిలవగా.. వారికి మానస్-యానీ మాస్టర్ ల లెటర్స్ వచ్చాయి. మానస్ సింపుల్ గా నవ్వుతూ.. తీస్కోండి మాస్టర్ అంటూ చెప్పేశాడు. ప్రియాంక 'ఐ కాంట్ డూ దిస్' అంటూ మానస్ లేఖను చించడానికి ఇష్టం లేదని చెప్పింది. తన లెటర్ ను చదువుతూ ఎమోషనల్ అయింది యానీ. నువ్ లేకపోతే నా జీవితంలో ఇంకేం లేదు నిక్కు అంటూ కొడుకును గుర్తుచేసుకుంటూ ఏడ్చేసింది.
విశ్వ-లోబో లు పవర్ రూమ్ లోకి వెళ్లగా.. వారికి రవి, శ్రీరామ్ ల లెటర్స్ వచ్చాయి. రవికి లెటర్ ఇవ్వమని శ్రీరామ్ అన్నారు. లోబో.. రవిని ఉద్దేశిస్తూ.. 'నీకు వదిన పంపిన లేఖ ఉంది.. డాల్ ఉంది.. టీషర్ట్ ఉంది.. తనకేం రాలేదు' అంటూ శ్రీరామ్ కి ఛాన్స్ ఇవ్వమని అడిగాడు. కానీ శ్రీరామ్ తనకు ఎలాంటి ప్రాబ్లెమ్ లేదని.. రవికి లెటర్ ఇవ్వమని అన్నారు. శ్రీరామ్ కి ఫ్యామిలీతో ఎలాంటి కాంటాక్ట్ లేదని.. తనకు లెటర్ ఇవ్వడమే కరెక్ట్ అని రవి చెప్పడంతో ఫైనల్ గా శ్రీరామచంద్రకు లెటర్ ఇచ్చారు. బెడ్ రూమ్ లో ఆ లెటర్ చుదువుకుంటూ ఏడ్చేశాడు శ్రీరామ్.
వెక్కి వెక్కి ఇచ్చేసిన షణ్ముఖ్..
యానీ మాస్టర్-సిరిలకు షణ్ముఖ్-కాజల్ ల లెటర్స్ వచ్చాయి. దీంతో షణ్ముఖ్.. కాజల్ ని లెటర్ తీసుకోమని చెప్పగా.. సిరి మాత్రం ఇవ్వనని చెప్పింది. కొంతసేపు ఇద్దరూ ఎమోషనల్ అయిన తరువాత కాజల్ ని లెటర్ తీసుకోమని చెప్పాడు షణ్ముఖ్. 'అమ్మా.. క్యాన్సర్ వచ్చినప్పుడు సర్వైవ్ అయ్యావ్.. అమ్మమ్మ చనిపోయినప్పుడు సర్వైవ్ అయ్యావ్.. నువ్వే నా ఇన్స్పిరేషన్.. ఐ విల్ సర్వైవ్ దిస్' అంటూ ఏడ్చేశాడు షణ్ముఖ్. బెడ్రూమ్ లోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చేశాడు షణ్ముఖ్.
సన్నీని పవర్ రూమ్ లోకి పిలిచిన బిగ్ బాస్.. కెప్టెన్ గా అతడికొక పవర్ ఉంటుందని చెప్పారు. జెస్సీకి మాత్రమే లెటర్ రాలేదని.. ఆ లెటర్ మీ చేతుల్లో ఉందని.. జెస్సీని నామినేట్ చేయాలనుకుంటే చించేసి.. నామినేట్ చేయమని.. సేవ్ చేయాలనుకుంటే ఇప్పటివరకు సేవ్ అయిన వాళ్లలో ఎవరైనా ఒకరి దగ్గర నుంచి లెటర్ తీసుకొని చించేసి.. అప్పుడు జెస్సీని సేవ్ చేయమని చెప్పారు. దీంతో శ్రీరామ్ తన లెటర్ ని ఇవ్వడానికి రెడీ అయ్యాడు. మొదట జెస్సీ నో చెప్పినా.. ఫైనల్ గా లెటర్ తీసుకున్నాడు. దీంతో శ్రీరామ్ నామినేషన్ లోకి వచ్చాడు.
ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అయిన సభ్యులు లోబో, సిరి, మానస్, రవి, షణ్ముఖ్, శ్రీరామచంద్ర.
సన్నీకి కూడా ఇంటి నుంచి ఒక లేఖ వచ్చిందని.. కెప్టెన్ అయిన కారణంగా ఎలాంటి షరతులు లేకుండానే ఆ లెటర్ లభిస్తుందని బిగ్ బాస్ చెప్పారు. వెంటనే లెటర్ ను వెతుక్కుంటూ వెళ్లాడు సన్నీ. తన తల్లి రాసిన లెటర్ ను చదువుకొని ఆనందపడ్డాడు.