అన్వేషించండి
Advertisement
Bigg Boss 5 Telugu: రవితో షణ్ముఖ్ డిస్కషన్.. ప్రియాంకని పట్టుకొని ఏడ్చేసిన సిరి..
బిగ్ బాస్ సీజన్ 5 లేటెస్ట్ ప్రోమోలో షణ్ముఖ్.. యాంకర్ రవితో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావని డిస్కషన్ పెట్టాడు. దీనికి రవి ఏమంటున్నాడంటే..?
బిగ్ బాస్ సీజన్ 5 ప్రస్తుతం నాల్గో వారంలోకి ఎంటర్ అయింది. ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడానికి మొత్తం ఎనిమిది మంది సభ్యులు నామినేట్ అయ్యారు. ఇక నిన్నటి నుంచి షోలో కెప్టెన్సీ టాస్క్ జరుగుతోంది. 'గెలవాంటే తగ్గాల్సిందే' అనే ఈ టాస్క్ లో ఇంటి సభ్యులు తమ బరువుని తగ్గించుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఇంట్లో మొత్తం ఆహారాన్ని తీసుకెళ్లిపోయారు బిగ్ బాస్.
దీంతో హౌస్ లో ఆకలి కేకలు మొదలయ్యాయి. ఉదయం విడుదల చేసిన ప్రోమోలో లోబో.. ఆకలిని తట్టుకోలేక చెత్త బుట్టలో ఆహారం కోసం వెతుక్కుంటూ కనిపించారు. తాజాగా మరో ప్రోమోను విడుదల చేశారు. ఇందులో విశ్వ-ప్రియాంక ఫిజికల్ టాస్క్ లో పోటీ పడుతూ కనిపించారు. ఇక ఆకలితో ఉన్న హౌస్ మేట్స్ ఆకలిని తీర్చారు బిగ్ బాస్. అందరి కోసం ఫుడ్ బండి ద్వారా మటన్ బిరియానీని పంపించారు. దీంతో హౌస్ మేట్స్ అందరూ ఆనందంలో మునిగిపోయారు. హాయిగా మటన్ బిరియాని ఆరగించేశారు.
ఆ తరువాత 'ఏడు సముద్రాలు దాటంట.. ఇంటిముందున్న మురికిగుంటలో కాలెట్టేశారు' అంటూ లోబోతో సామెతలు చెబుతూ కనిపించాడు నటరాజ్ మాస్టర్. షణ్ముఖ్-రవి కూర్చొని మాట్లాడుతుండగా.. 'టాస్క్ లో ఆడుతున్నప్పుడు కూడా నీ కారణంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నా అనిపిస్తుంది' అని రవితో అన్నాడు షణ్ముఖ్. 'ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి నేనెక్కడ మాట్లాడాను నీతో..?' అంటూ ప్రశ్నించాడు రవి. ఆ తరువాత సన్నీ-మానస్ లకు పవర్ రూమ్ యాక్సెస్ దక్కినట్లు చూపించారు. ఛాలెంజ్ కోసం వీరు హౌస్ లో ఏ జంటను ఎన్నుకుంటారో చూడాలి. ఇక ప్రోమో చివర్లో.. సిరి.. ప్రియాంకను పట్టుకొని ఏడుస్తూ కనిపించింది. వెంటనే కళ్లు తుడుచుకుంటూ.. షన్ను చూస్తే తిడతాడని చెప్పింది.
Mutton biryani kummesina housemates...#Sunny #Maanas evarini pick cheskuntaru?#BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/XuTGbexXxF
— starmaa (@StarMaa) September 29, 2021
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
పాలిటిక్స్
ఇండియా
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion