Bigg Boss Telugu 7: హౌజ్ నుండి అశ్విని ఔట్, తనతో పాటు మరో లేడీ కంటెస్టెంట్‌పై డబుల్ ఎలిమినేషన్ వేటు!
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7 నుండి అశ్విని ఎలిమినేట్ అయ్యింది. తనతో పాటు ఈవారం జరగనున్న డబుల్ ఎలిమినేషన్‌లో మరో లేడీ కంటెస్టెంట్ కూడా ఔట్ అవ్వనుందని టాక్ వినిపిస్తోంది.
![Bigg Boss Telugu 7: హౌజ్ నుండి అశ్విని ఔట్, తనతో పాటు మరో లేడీ కంటెస్టెంట్‌పై డబుల్ ఎలిమినేషన్ వేటు! ashwini leaves bigg boss house in the recent elimination and rathika is in line for next one Bigg Boss Telugu 7: హౌజ్ నుండి అశ్విని ఔట్, తనతో పాటు మరో లేడీ కంటెస్టెంట్‌పై డబుల్ ఎలిమినేషన్ వేటు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/25/6c92afaf57c71bd914a10bd4677a799a1700933836009802_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో ఫైనల్స్ దగ్గర పడుతున్న సమయంలో హౌజ్‌లో ఇద్దరు కంటెస్టెంట్స్ ఒకేసారి ఎలిమినేట్ అవ్వనున్నారు. వచ్చేవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని గతవారమే నాగార్జున క్లారిటీ ఇచ్చారు. అయితే డబుల్ ఎలిమినేషన్ ఉందని తెలిసినా.. అశ్విని సెల్ఫ్ నామినేట్ చేసుకొని పెద్ద రిస్క్ తీసుకుంది. ఒకవేళ తనను తాను నామినేట్ చేసుకోకపోయింటే.. గతవారం తను ఆడిన టాస్కులకు, అందరితో ఇంటరాక్ట్ అయిన విధానానికి తనను ఎవరు నామినేట్ చేసుండేవారు కాదేమో. అయినా కూడా అశ్విని రిస్క్ తీసుకుంది. ఇప్పుడు దాని రిజల్ట్‌గా ఎలిమినేట్ అయిపోయి హౌజ్ నుండి బయటికి వెళ్లిపోయింది.
సెల్ఫ్ నామినేషన్ వల్లే..
తనకు ఎవరిని నామినేట్ చేయడానికి పాయింట్స్ లేవని, సిల్లీ కారణలతో ఎవరినీ నామినేట్ చేయను అని నామినేషన్స్ సమయంలో బిగ్ బాస్‌తో చెప్పింది అశ్విని. ఒకవేళ ఎవరినీ నామినేట్ చేయకపోతే సెల్ఫ్ నామినేషన్ తప్పదని బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా సెల్ఫ్ నామినేషన్ తనకు ఓకే అని అశ్విని ఒప్పుకుంది. సెల్ఫ్ నామినేట్ చేసుకున్న తర్వాత కూడా శివాజీ వచ్చి తనను నామినేట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే సెల్ఫ్ నామినేట్ చేసుకున్న కంటెస్టెంట్‌ను మళ్లీ నామినేట్ చేసే అవకాశం ఉండదు అనడంతో సైలెంట్ అయిపోయారు. అయినా కూడా ఈ నామినేషన్స్ గురించి అశ్వినికి, శివాజీకి గొడవ కూడా జరిగింది. వెంటనే సెల్ఫ్ నామినేట్ చేసుకోకుండా ఉండాల్సింది అని అశ్విని బాధపడి, ఏడ్చింది. కానీ అప్పటికే లేట్ అయిపోయింది.
ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఇవ్వను..
ఒకసారి ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ జరిగి.. ఆ పాస్ యావర్ చేతికి వచ్చింది. కానీ ఫౌల్ గేమ్స్ ఆడి ఆ పాస్‌ను గెలుచుకున్నాడని నాగార్జున వీడియోలతో సహా ఆధారం చూపించడంతో యావర్.. ఆ పాస్‌ను తిరిగి ఇచ్చేశాడు. దీంతో మళ్లీ ఈ వారం.. ఆ పాస్ కోసం పోటీ జరిగింది. పల్లవి ప్రశాంత్ దానిని గెలుచుకొని ఇమ్యూనిటీని దక్కించుకున్నాడు. బిగ్ బాస్ ప్రకారం ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎవరి దగ్గర ఉన్నా.. వారు ఎలిమినేట్ అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు దానిని ఉపయోగింవచ్చు లేదా ఇంకెవరైనా కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం ఇష్టం లేకపోతే అది వారికోసం కూడా ఉపయోగించవచ్చు. అందుకే అశ్విని ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోతున్న సమయానికి పల్లవి ప్రశాంత్.. తనకోసం ఆ పాస్‌ను ఉపయోగిస్తాడా అని నాగార్జున అడిగారు. కానీ ఆ పాస్‌ను 14వ వారం ఎవరికోసమో ఉపయోగించాలో చెప్తానని అన్నాడు ప్రశాంత్. దీంతో అశ్విని ఎలిమినేట్ అయిపోయి బయటికి వచ్చేసింది.
మరో లేడీ కంటెస్టెంట్..
ఈవారం డబుల్ ఎలిమినేషన్ కాబట్టి అశ్వినితో పాటు మరో లేడీ కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. ఎక్కువశాతం రతికనే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. రతిక ఇప్పటికే ఒకసారి ఎలిమినేట్ అయ్యి.. మళ్లీ సెకండ్ ఛాన్స్‌తో హౌజ్‌లోకి అడుగుపెట్టింది. ఒకసారి తను ఆడిన గేమ్ వల్ల ఎలాంటి నెగిటివిటీ వచ్చింది అని చూసిన రతిక.. మళ్లీ హౌజ్‌లోకి వచ్చిన తర్వాత కూడా తన గేమ్ ప్లాన్‌ను మార్చుకోలేదు. దీంతో మళ్లీ మళ్లీ నామినేషన్స్‌లోకి వస్తుంది. ఈవారం నేనేంటో చూపిస్తా అని డైలాగులు చెప్తుందే తప్పా ఆటలో మాత్రం ఎలాంటి మార్పు ఉండడం లేదు. అందుకే ఈవారం డబుల్ ఎలిమినేషన్‌లో అశ్వినితో పాటు రతిక కూడా బిగ్ బాస్ హౌజ్ నుండి బయటికి వెళ్లనుంది.
Also Read: వేంకటేశ్వర స్వామి పరమ భక్తురాలిని, అందుకే క్రైస్తవ మతంలోకి మారాను - నటి దివ్యవాణి
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)