Bigg Boss Telugu 7: శివాజీతో అమర్‌దీప్ రాజకీయాలు, ఏం చేయాలో తెలియక శోభా ఏడుపు
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో టికెట్ టు ఫైనల్ రేసు మొదలవ్వడంతో కంటెస్టెంట్స్ మధ్య రాజకీయాలు మొదలయ్యాయి.
![Bigg Boss Telugu 7: శివాజీతో అమర్‌దీప్ రాజకీయాలు, ఏం చేయాలో తెలియక శోభా ఏడుపు amardeep requests sivaji to support him in ticket to finale task in bigg boss telugu 7 Bigg Boss Telugu 7: శివాజీతో అమర్‌దీప్ రాజకీయాలు, ఏం చేయాలో తెలియక శోభా ఏడుపు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/28/91157ec568f4e9f8ccd4e00484a860d51701167005432802_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో ఫైనల్స్ దగ్గర పడుతున్నాయి. దీంతో ‘టికెట్ టు ఫైనల్’ కోసం రేసు మొదలయ్యింది. అయితే ఈ రేసులో ఒకటి కాకుండా చాలా టాస్కులు ఉండబోతున్నాయని నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన రెండో ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే మొదటి ప్రోమోలో ఫైనల్ అస్త్రా కోసం కంటెస్టెంట్స్ అంతా ‘వీల్ ఛాలెంజ్’ అనే టాస్క్‌ను ఆడినట్టు చూపించారు. ఇక రెండో ప్రోమోలో మరో టాస్క్‌తో బిగ్ బాస్ సిద్ధమయ్యారు. అయితే ఈ ప్రోమో చివర్లో కంటెస్టెంట్స్‌కు బిగ్ బాస్ చిన్న ట్విస్ట్ కూడా ఇచ్చారు. కెప్టెన్సీలాగానే ఫైనల్ అస్త్రాలో కూడా ఎవరికి నచ్చిన కంటెస్టెంట్స్‌ను వారు గెలిపించుకునే అవకాశం ఉందని ప్రోమో చూస్తుంటే అర్థమవుతోంది.
పూలనే సేకరించాలంట..
ముందుగా ఫైనల్ అస్త్రాను గెలుచుకోవడానికి బిగ్ బాస్ ఇస్తున్న రెండో ఛాలెంజ్ ‘పూలనే సేకరించాలంట’ అని బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. ఈ టాస్క్‌లో యాక్టివిటీ ఏరియాలో పెట్టి ఉన్న పువ్వులను తీసుకొచ్చి గార్డెన్ ఏరియాలో కంటెస్టెంట్స్ పేర్లపై ఏర్పాటు చేసిన ట్రేలలో వేయాలి. దీంతో కంటెస్టెంట్స్ అంతా ఎవరికి దొరికినన్ని పువ్వులను వారు తీసుకొచ్చారు. చాలావరకు కంటెస్టెంట్స్ వాటిని షర్ట్స్‌లో, టీషర్ట్స్‌లో వేసుకొని తెచ్చుకున్నారు. ఇది చూసిన శివాజీకి కోపం వచ్చింది. ‘‘అందరు టీషర్ట్స్‌లో వేసుకొస్తే ఎలా బిగ్ బాస్’’ అని నిరాశపడ్డాడు. అందరు వేగంగా ఆడడం చూసి ‘‘అంతే. మేమే లీస్ట్’’ అని ముందే ఫిక్స్ అయిపోయాడు.
లీస్ట్‌లో శివాజీ, శోభా..
బజర్ మోగిన తర్వాత ఎవరు ఎన్ని పువ్వులను సేకరించారో లెక్కపెట్టుకోవాలి. ఎన్ని పువ్వులను సేకరించారని అమర్.. శివాజీని అడగగా నవ్వుతూ 110 అని చెప్పడమే కాకుండా చేతులతో తెచ్చానయ్యా నేను అని చెప్పుకున్నాడు. ఇక మొదటి రౌండ్‌లో అందరికంటే శోభా, శివాజీ.. ఇద్దరూ తక్కువ పువ్వులను సేకరించారు, అంటే తక్కువ పాయింట్స్‌ను సాధించారు. దీంతో వారు ఆట నుంచి తప్పుకోవాలి. కానీ తప్పుకునే ముందు వారు సాధించిన పాయింట్స్‌ను మిగతా పోటీదారుల నుంచి ఎవరో ఒకరికి తాము సాధించిన పాయింట్స్ అన్నింటిని ఇవ్వాల్సి ఉంటుంది అని బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చారు. ఆట నుంచి తప్పుకోవాలి అని తెలిసిన వెంటనే శోభా ఏడవడం మొదలుపెట్టింది.
నాకు మాటిచ్చారు..
తమ పాయింట్స్‌ను వేరేవారికి ఇవ్వాలని బిగ్ బాస్ చెప్పడంతో శివాజీతో చర్చలు మొదలుపెట్టాడు అమర్‌దీప్. ‘‘నాకు మాటిచ్చారు’’ అని అందరికంటే ముందుగా అమర్ వచ్చి శివాజీకి గుర్తుచేశాడు. ఆ మాట విన్న శివాజీ.. ‘‘నీకు శోభా ఇస్తుంది’’ అని అమర్‌తో అన్నాడు. దానికి సమాధానంగా ‘‘నువ్వే ఇవ్వు. నువ్వు నాకు చెప్పావు టికెట్ టు ఫైనల్ ఇస్తా అని’’ అంటూ అమర్ గుర్తుచేశాడు. ‘‘నీకు శోభాది ఉంది కదా లేకపోతే నేను నీకు ఇచ్చేవాడిని ప్రామిస్‌గా’’ అని శివాజీ.. అమర్‌ను ఒప్పించే ప్రయత్నం చేశాడు. అలా శివాజీ, అమర్‌దీప్ మధ్య డిస్కషన్ జరుగుతుండగానే బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇచ్చారు. శోభా, శివాజీ ఇద్దరూ కలిసి వారి పాయింట్స్‌ను ఒకరికే ఇవ్వాల్సి ఉంటుంది అని అన్నారు. అది విని శివాజీ షాక్ అయ్యాడు.
Also Read: అర్జున్ స్ట్రాటజీ బెడిసి కొట్టనుందా? శివాజీని అనవసరంగా టార్గెట్ చేశాడా?
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)