Bigg Boss 7 Telugu: అర్జున్ స్ట్రాటజీ బెడిసి కొట్టనుందా? శివాజీని అనవసరంగా టార్గెట్ చేశాడా?
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో అర్జున్ స్ట్రాటజీ మొదటిసారిగా ఫెయిల్ అయినట్టు అనిపిస్తోంది. అది శివాజీకి ప్లస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో ఓటింగ్ రిజల్ట్స్ అనేవి రోజురోజుకీ మారిపోతున్నాయి. ఈరోజు ప్రేక్షకుల్లో ఎక్కువ ఆదరణ సంపాదించుకున్నవారు రేపు నెగిటివ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. నిన్న ప్రేక్షకుల్లో నెగిటివ్ అయిపోయినవారు.. నేడు పాజిటివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. టాస్కుల కంటే ఎక్కువగా నామినేషన్స్ సమయంలోనే కంటెస్టెంట్స్ ప్రవర్తనపై దృష్టిపెడుతున్నారు ప్రేక్షకులు. నామినేషన్స్‌ను బట్టే ఓటింగ్ రిజల్ట్స్ అనేవి తారుమారవుతున్నాయి. గత కొన్ని వారాలుగా తన ప్రవర్తనతో, మాటలతో ప్రేక్షకుల్లో నెగిటివ్ ఇంప్రెషన్ సంపాదించుకున్న శివాజీ.. తాజాగా జరిగిన నామినేషన్స్ వల్ల మళ్లీ పాజిటివ్ సైడ్ వెళ్లిపోయాడు. దీనికి ముఖ్య కారణం అర్జునే.
అర్జున్ స్ట్రాటజీ ఫెయిల్..
వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా సీజన్ 7లోకి పలువురు కంటెస్టెంట్స్ ఎంటర్ అవ్వగా.. అందులో అర్జున్ మాత్రమే ఇప్పటివరకు మిగిలాడు. తను హౌజ్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక స్ట్రాటజీతోనే ముందుకు వెళ్తున్నాడు. మొదటి నామినేషన్స్ అప్పటి నుంచి ఇప్పటివరకు అర్జున్ పాయింట్ మాట్లాడతాడు. ఆ పాయింట్ మీదే స్ట్రాంగ్‌గా నిలబడి నామినేట్ చేస్తాడు అనే మంచి పేరును సంపాదించుకున్నాడు. కానీ తాజాగా జరిగిన నామినేషన్స్‌లో తన స్ట్రాటజీలు రివర్స్ అయిపోయారు. తను వేసిన స్ట్రాటజీ శివాజీకి ప్లస్ అయ్యింది. గత కొంతకాలంగా ఓటింగ్ విషయంలో మెల్లగా ఒకటవ స్థానం నుంచి రెండో స్థానానికి చేరుకున్న శివాజీ.. అర్జున్ స్ట్రాటజీ వల్ల మళ్లీ ఒకటవ స్థానానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కెప్టెన్సీ టాస్క్ వల్లే..
గతవారం బిగ్ బాస్ సీజన్ 7లో చివరి కెప్టెన్సీ టాస్క్ జరిగింది. ఈ కెప్టెన్సీ టాస్క్‌లో కంటెస్టెంట్స్ మద్దతుపైనే కెప్టెన్‌ను ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి సమయంలో అప్పటివరకు కెప్టెన్ అవ్వని అమర్‌దీప్‌ను సపోర్ట్ చేయాలని పలువురు కంటెస్టెంట్స్ నిర్ణయించుకున్నారు. కానీ అర్జున్ కూడా తన భార్య సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకొని మరోసారి కెప్టెన్ అవ్వాలని అనుకుంటున్నాడు. దీంతో అమర్‌దీప్‌కు వెళ్లాల్సిన కొన్ని ఓట్లు.. అర్జున్ వైపు వెళ్లాయి. చివరిగా అర్జున్, అమర్‌దీప్‌లలో ఒకరు కెప్టెన్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ నిర్ణయం శోభా, శివాజీల చేతిలో ఉంది. అప్పుడు శోభా.. అమర్‌కు సపోర్ట్ చేస్తుండగా.. శివాజీ మాత్రం అర్జున్‌కు సపోర్ట్‌గా నిలబడ్డాడు. అమర్ ఎంత ప్రాధేయపడినా.. తనకు కెప్టెన్సీ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అర్జున్ భార్య కోరుకుంది కాబట్టి తననే కెప్టెన్ చేయాలనుకుంటున్నానని శివాజీ పదేపదే చెప్పాడు. దీంతో భార్య సెంటిమెంట్‌ను అర్జున్ అడ్డం పెట్టుకుంటున్నాడని చాలామంది ప్రేక్షకులకు అనిపించింది. తాజాగా జరిగిన నామినేషన్స్‌లో అదే పాయింట్‌పై శివాజీని నామినేట్ చేశాడు అర్జున్.
నామినేషన్ అవసరం ఏముంది.?
శివాజీ.. పదేపదే తన భార్య కారణం చెప్పి కెప్టెన్సీ టాస్కులో తనకు సపోర్ట్ చేయడం అనేది ప్రేక్షకుల్లో నెగిటివ్ ఇంప్రెషన్ తెచ్చిపెట్టిందేమో అన్న అనుమానంతో శివాజీని నామినేట్ చేశాడు అర్జున్. అయితే ఈ విషయం మామూలుగా కూడా చెప్పి ఉండవచ్చని నామినేట్ చేసి చెప్పాల్సిన అవసరం ఏముందని తిరిగి తనను నామినేట్ చేస్తూ చెప్పాడు శివాజీ. నామినేషన్స్ అయిపోయిన తర్వాత కూడా తనకు సపోర్ట్ చేసినందుకు నన్ను నామినేట్ చేశాడు కాబట్టి అది తనకే మైనస్ అవుతుంది అని అర్జున్ గురించి స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు. సరిగా శివాజీ ఊహించినట్టుగానే జరిగింది. శివాజీ.. తనకు సపోర్ట్ చేయడం నచ్చకపోతే అప్పుడే చెప్పేసి ఉండవలసిందని, అప్పుడు సైలెంట్‌గా ఉండి ఇప్పుడు నామినేట్ చేయడం ఏంటి అని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. దీంతో పడిపోతున్న శివాజీ గ్రాఫ్.. ఈ నామినేషన్స్ వల్ల మళ్లీ పెరిగింది.
Also Read: రూ.2 కోట్లు ఇస్తా, బిగ్ బాస్ నుంచి నన్ను బయటకు పంపేయండి - కంటెస్టెంట్ సీరియస్ కామెంట్స్
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply