Amardeep: నామినేషన్స్ నుంచి తప్పించుకున్న అమర్, నమ్మకద్రోహం అంటూ ప్రశాంత్ కన్నీళ్లు
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో ఈవారం నామినేషన్స్ నుంచి అమర్‌దీప్ చాలా తెలివిగా తప్పించుకున్నాడు.
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమయిన కొత్తలో శివాజీ.. అందరు కంటెస్టెంట్స్‌తో సాన్నిహిత్యంగానే ఉండేవాడు. చాలావరకు అందరినీ సమానంగానే చూసేవాడు. కానీ మెల్లగా పల్లవి ప్రశాంత్‌కు, యావర్‌లకు ఎక్కువగా సపోర్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఇక గత కొన్నివారాల నుంచి వారిద్దరిని మాత్రమే మంచివాళ్లు అన్నట్టుగా పరిగణిస్తూ.. మిగతా కంటెస్టెంట్స్‌తో గొడవలు పెట్టుకుంటున్నాడు శివాజీ. అంతే కాకుండా అందరి గురించి వెనుక చెడుగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇదంతా గమనిస్తున్న కంటెస్టెంట్స్ సైతం తాజాగా జరిగిన నామినేషన్స్‌లో తనకే ఎక్కువ నామినేషన్స్ పడేలా చేశారు. ఓవైపు శివాజీకి ఎక్కువ నామినేషన్స్ రావడం హైలెట్ అవ్వగా.. మరోవైపు అమర్ అసలు నామినేషన్స్‌లో లేకపోవడం మరొక హైలెట్‌గా మారింది.
గౌతమ్‌పై శివాజీ ఆరోపణలు..
తాజాగా జరిగిన నామినేషన్స్‌లో గౌతమ్, అర్జున్, ప్రియాంక.. ఈ ముగ్గురూ శివాజీని నామినేట్ చేశారు. ముందుగా నామినేట్ చేసిన అర్జున్.. శివాజీ హౌజ్‌లోకి వచ్చేముందే అందరి గురించి తెలుసుకొని వచ్చాడని ఆరోపించాడు. అంతే కాకుండా తన గురించి శివాజీకి ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని, అందుకే తన గేమ్‌కు అడ్డుకట్ట వేయాలని చూస్తున్నాడని నామినేషన్‌కు తన కారణాన్ని వివరించాడు. తను కెప్టెన్ అయినప్పుడు కూడా శివాజీ ఒక్కడే హెల్ప్ చేసినట్టుగా అందరికీ కనిపించేలా చేశాడని అన్నాడు. గౌతమ్ ఆరోపణలు విన్న శివాజీ.. తన గేమ్ ఎప్పుడూ కరెక్ట్ కాదని, అందుకే తనకు సపోర్ట్ చేయలేదని ముక్కుసూటిగా చెప్పాడు. అంతే కాకుండా గౌతమ్ అవసరం కోసమే తనను నామినేట్ చేస్తున్నాడని అన్నాడు.
బాధతో శివాజీ నామినేషన్..
గౌతమ్ తర్వాత వచ్చిన అర్జున్.. కెప్టెన్సీ టాస్క్ సమయంలో తన భార్య పేరును మధ్యలోకి తీసుకొచ్చి హైలెట్ చేశాడని, అది ప్రేక్షకులకు కూడా తప్పుగా అర్థమయ్యి ఉంటుందని చెప్తూ శివాజీని నామినేట్ చేశాడు. నాగార్జున కూడా అదే మాట అన్నారని, అది తనకు నచ్చక నామినేట్ చేస్తున్నానని చెప్పాడు. అర్జున్ చేసిన ఈ పనికి శివాజీ చాలా సీరియస్‌గా రియాక్ట్ అయ్యాడు. అర్జున్ ఇచ్చిన ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌ను తీసేసి ఇదంతా నీ గేమ్ ప్లాన్ అని అర్థం చేసుకోలేకపోయానని ఆరోపణలు చేశాడు. కెప్టెన్సీ టాస్క్ సమయంలోనే తనకు సపోర్ట్ చేయొద్దు అని చెప్తే సరిపోయేదని, నామినేషన్స్‌లో చెప్పాల్సిన పాయింట్ కాదు అని వాపోయాడు. అంతే కాకుండా కోపంతో కాదు బాధతో అర్జున్‌ను నామినేట్ చేస్తున్నానని క్లారిటీ ఇచ్చాడు శివాజీ.
అమర్ స్ట్రాటజీ..
ఆ తర్వాత వచ్చిన అమర్‌దీప్ ముందుగా ప్రశాంత్‌ను నామినేట్ చేశాడు. మర్డర్ టాస్క్‌లో త్వరగా దెయ్యం అయిపోయావు కాబట్టి గతవారం ఆట ఎక్కువగా కనిపించలేదని కారణం చెప్పాడు. అమర్ నామినేషన్స్‌ను తీసుకోలేకపోయిన ప్రశాంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనను సపోర్ట్ చేసినందుకు కళ్లు తెరుచుకున్నాయని బాధపడ్డాడు. అంతే కాకుండా దానికి నమ్మకద్రోహం అని పేరు కూడా పెట్టాడు. ఇదంతా తన మంచి గురించే చెప్తున్నానని అమర్ సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. నమ్మకద్రోహం అంటే నా చెప్పుతో నేను కొట్టుకోవడం అని క్లారిటీ ఇచ్చాడు.
ప్రశాంత్‌తో పాటు గౌతమ్‌ను కూడా నామినేట్ చేశాడు అమర్. కెప్టెన్సీ టాస్క్ సమయంలో గౌతమ్.. ముందుగా వెళ్లకపోయుంటే తనకు కెప్టెన్ అయ్యే అవకాశం వచ్చేదేమో అని కారణంగా చెప్పాడు. దానికి గౌతమ్.. అమర్ కంటే అర్జునే ఎక్కువ అని ముక్కుసూటిగా సమధానమిచ్చాడు. నామినేషన్స్ ముగిసిన తర్వాత కూడా ప్రశాంత్ ఏడుస్తూనే ఉన్నాడు. దీంతో అమర్ వెళ్లి తనను ఓదార్చే ప్రయత్నం చేశాడు. శోభా.. తనను సేఫ్ గేమ్ అన్నందుకు బాధపడుతున్నానని వాపోయాడు ప్రశాంత్. ఇక ఈవారం నామినేషన్స్‌లో అమర్ తప్పా అందరు కంటెస్టెంట్స్ ఉన్నారు. దీంతో సేఫ్ గేమ్ ఎవరిదో కాదు నీదే అంటూ తన ఫ్రెండ్ శోభా.. అమర్‌పై కామెంట్ చేసింది.
Also Read: మహేష్ బాబును ఇబ్బంది పెట్టిన అనిల్ కపూర్ - నేను సీనియర్, నో చెప్పడానికి వీల్లేదు!
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply