అన్వేషించండి
Advertisement
Bigg Boss Telugu 6: 'బిగ్ బాస్ హౌస్ కాస్కోండి బాలాదిత్య వస్తున్నాడు'
పన్నెండో కంటెస్టెంట్ గా నటుడు బాలాదిత్య ఎంట్రీ ఇచ్చారు.
బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్(Bigg Boss). అన్ని భాషల్లో ఈ షో సూపర్ హిట్ అయింది. తెలుగులో కూడా ఈ షోకి మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటివరకు ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. అలానే ఈ ఏడాది ఓటీటీ వెర్షన్ తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయాలనుకున్నారు. హాట్ స్టార్ లో 24 గంటల కాన్సెప్ట్ తో ఈ షోని నడిపించారు. కానీ ఆశించిన స్థాయిలో ఓటీటీ వెర్షన్ క్లిక్ అవ్వలేదు.
ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ సీజన్ 6 కోసం రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 4 నుంచి ఈ షోని మొదలుపెట్టారు. ఇప్పటివరకు నాలుగు సార్లు ఈ షోని హోస్ట్ చేసిన నాగార్జున ఇప్పుడు ఐదోసారి కూడా హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈసారి మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ కనిపించనున్నారు. ఆదివారం నాడు గ్రాండ్ గా షో మొదలైంది. ఇక కంటెస్టెంట్స్ ను ఒక్కొక్కరిగా నాగార్జున ఇంట్రడ్యూస్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ సీజన్ 6 కోసం రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 4 నుంచి ఈ షోని మొదలుపెట్టారు. ఇప్పటివరకు నాలుగు సార్లు ఈ షోని హోస్ట్ చేసిన నాగార్జున ఇప్పుడు ఐదోసారి కూడా హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈసారి మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ కనిపించనున్నారు. ఆదివారం నాడు గ్రాండ్ గా షో మొదలైంది. ఇక కంటెస్టెంట్స్ ను ఒక్కొక్కరిగా నాగార్జున ఇంట్రడ్యూస్ చేస్తున్నారు.
పన్నెండో కంటెస్టెంట్ గా నటుడు బాలాదిత్య ఎంట్రీ ఇచ్చారు. 'చంటిగాడు' సినిమాతో పాపులర్ అయిన బాలాదిత్య ఆ తరువాత పలు సినిమాలు, సీరియల్స్ లో నటించారు. అలానే యాంకర్ గా కూడా కొన్ని షోలు చేశారు. ఆయన్ను స్టేజ్ పైకి ఆహ్వానించిన నాగార్జున కాసేపు మాట్లాడారు. నాగార్జున నటించిన 'హలో బ్రదర్' సినిమాలో బాలాదిత్య నటించిన విషయాన్ని నాగార్జున గుర్తు చేసుకున్నారు. 'ఇన్నేళ్ల కెరీర్ లో మర్చిపోలేని విషయం ఏంటని' నాగార్జున అడగ్గా.. 'అన్న' సినిమాకి నంది అవార్డు రావడం తనకు ఎప్పటికీ గుర్తుండిపోయే విషయమని చెప్పారు బాలాదిత్య. 'బిగ్ బాస్ హౌస్ కాస్కోండి బాలాదిత్య వస్తున్నాడు' అంటూ నాగార్జున గొప్పగా చెప్పారు. హౌస్ లోకి వెళ్తున్న బాలాదిత్యకి తన చిన్నకూతురు ఫొటోను గిఫ్ట్ గా ఇచ్చారు నాగార్జున.
కంటెస్టెంట్స్ ని ఒక్కొక్కరినీ ఒక్కో కార్డు సెలెక్ట్ చేసుకోమని అడుగుతున్నారు నాగార్జున. బాలాదిత్య సెలెక్ట్ చేసుకున్న కార్డు నక్క. దానికి అర్ధం ఏంటో తరువాత చెబుతానని అన్నారు నాగార్జున.
ఇక ఈసారి అబ్బాయిల నెంబర్ కంటే అమ్మాయిలే ఎక్కువ మంది హౌస్ లో కనిపించబోతున్నారు. ఎప్పటిలానే ఈసారి కూడా బిగ్ బాస్ హౌస్ ని చాలా కొత్తగా డిజైన్ చేశారు. మొత్తం 18 మంది పోటీదారులు కాబట్టి ఈసారి షో 100 రోజులకు పైగానే ఉండే ఛాన్స్ ఉంది. మధ్యలో డబుల్ ఎలిమినేషన్స్ కూడా ఉంటాయి. ఇక టాస్క్ ల విషయానికొస్తే.. బిగ్ బాస్ హిందీ వెర్షన్ నుంచి కొన్ని టాస్క్ లను సీజన్ 6 కోసం తీసుకోబోతున్నారని సమాచారం. గత సీజన్లలో కూడా టాస్క్ లకు సంబంధించి ఇలానే చేశారు.
Also Read : ఎంబీబీఎస్ పక్కన పెట్టి మరీ వచ్చిన శ్రీ సత్య - 'రేసుగుర్రం'లో పాటతో ఎంట్రీ
Also Read : 'సుర్రు సుమ్మైపోద్ది' - బిగ్ బాస్ హౌస్ లో చలాకీ చంటి గ్రాండ్ ఎంట్రీ!
We welcome our 12th contestant #BalaAditya to Bigg Boss house.
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) September 4, 2022
#BalaAdityaOnBBTelugu#BiggBossTelugu6 #BBLiveOnHotstar@StarMaa @DisneyPlusHSTel pic.twitter.com/ajtetRWKMO
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion