News
News
X

Bigg Boss 6 Telugu: పంచ్ పడింది, మళ్లీ గీతూ నోటికి పనిచెప్పింది, ఈసారి కెప్టెన్సీ కంటెండర్ల పోటీ అదిరిపోయింది

Bigg Boss 6 Telugu: కెప్టెన్సీ కంటెండర్లను ఎంచుకునే టాస్కు ఈరోజు రచ్చరచ్చగా అయ్యేలా ఉంది.

FOLLOW US: 

Bigg Boss 6 Telugu: ఈనాటి ప్రోమోను చూస్తుంటే ఎవరికైనా నామినేషన్ రోజులు గుర్తుకు రావడం ఖాయం. కెప్టెన్సీ కంటెండర్లు కాకుండా పక్కవారిని అడ్డుకునే బాధ్యత ఇంటి సభ్యులకు ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో నామినేషన్ వేసిన రేంజ్‌లో ఇంటి సభ్యులు రెచ్చిపోయి ఆడారు. ఇక గీతూ - చంటి మధ్య షరా మామూలుగానే మాటల యుద్ధం సాగింది. 

ప్రోమోలో ఏముందంటే... మొదట మెరీనా - రోహిత్ కాస్త వాదించుకుంటూ కనిపించారు. ఆ తరువాత కెప్టెన్సీ కంటెండర్ల టాస్కును ఇచ్చాడు బిగ్‌బాస్.బీబీ హోటల్ టాస్కులో బాగా ఆడిన వారి ఫోటోలను అక్కడ పెట్టారు. దాని  ఎదురుగా బాక్సింగ్ గ్లవ్ పెట్టారు. టాస్కు నుంచి బయటికి వచ్చిన వారంతా బెల్ మోగినప్పుడల్లా బాక్సింగ్ గ్లవ్ దక్కించుకోవాలి. దాంతో అక్కడ ఉన్న ఫోటోలో ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్ కాకూడదు అనుకుంటున్నారో వారి ఫోటోపై పంచ్ ఇవ్వాలి. 

అలా ఆదిరెడ్డి గ్లవ్స్ దక్కించుకుని అర్జున్ కళ్యాణ్ ఫోటోపై పంచ్ ఇచ్చాడు. కెప్టెన్సీకి తక్కువ డిజర్వ్‌డ్ అనిపిస్తోందని కారణం చెప్పాడు.ఇక రేవంత్ రాజశేఖర్ ఫోటోపై పంచ్ ఇచ్చాడు. ఆల్రెడీ రాజ్ కెప్టెన్ అయ్యాడని అందుకే పంచ్ ఇచ్చినట్టు చెప్పాడు. సూర్య గ్లవ్‌తో వాసంతి ఫోటోపై పంచ్ ఇచ్చాడు. ఇక చంటి గీతూ ఫోటో పై పంచ్ ఇచ్చాడు. దీంతో గీతూ మళ్లీ నోటికి పనిచెప్పింది. 

నోటిదూల అంటే ఇదే
గీతూ నోటిదూల అంటే ఒప్పుకోదు కానీ నాగార్జునే తేల్చారు ఆమెకే నోటిదూల అని. చంటి గీతూ ఫోటోపై పంచ్ కొట్టాక ‘కెప్టెన్ అంటే అందరితో స్నేహంగా ఉంటూ, పనులను షేర్ చేయాలి, అది తనలో కొంచెం లేదు అని నా ఉద్దేశం’ అన్నాడు. దానికి గీతూ ‘గేమ్ ఆడడం రానోళ్లు నా గురించి మాట్లాడుతుంటే కామెడీగా ఉంది’ అంటూ వెటకారంగా అక్కడ్నించి వెళ్లిపోయింది. దీంతో చంటికి కోపం వచ్చింది. దీన్నే పోక్ చేయడం అంటారు అన్నాడు. 

News Reels

గీతూ ఇంకా వెనక్కి తగ్గకుండా గేమ్ ఆడడం రానోళ్లే మీరు అంటూ మళ్లీ మళ్లీ రెచ్చగొట్టింది. చంటి కూడా వెనక్కి తగ్గకుండా ‘నీకు తెలిసిందే చెటాకు, అది నువ్వు గేమ్ అనుకుంటున్నావ్’ అంటూ మర్యాదగానే ఇచ్చిపడేశాడు. 
గీతూ ‘నన్ను ఎవడు ఏం చేయలేడు’ అంటూ ఓవర్ యాక్షన్ చేసింది. చంటికి గీతూ ప్రవర్తన మాత్రం చాలా చిరాకు తెప్పించింది. చూసే ప్రేక్షకులకు కూడా అలాగే అనిపించి ఉండొచ్చు. 

Also read: హౌస్‌లో రేవంత్ భార్య సీమంతం వీడియో, ఎమోషనల్ అయిన స్టార్ సింగర్

Also read: పూల్‌లో ఆ పనిచేసిన శ్రీహాన్? ఛీ కొట్టిన కంటెస్టెంట్లు, బాత్రూమ్ దగ్గరే కాపలా కాసిన రేవంత్

Published at : 29 Sep 2022 05:15 PM (IST) Tags: Bigg Boss 6 Telugu inaya sulthana Bigg boss 6 Telugu Nagarjuna Biggboss Daily Updates Revnath Chanti geethu fight

సంబంధిత కథనాలు

ఫైమా సంచాలక్‌గా నువ్వలా చేయొచ్చా? - ప్రశ్నించిన నాగార్జున, తలదించుకున్న ఫైమా

ఫైమా సంచాలక్‌గా నువ్వలా చేయొచ్చా? - ప్రశ్నించిన నాగార్జున, తలదించుకున్న ఫైమా

బిగ్‌బాస్ హౌస్ నుంచి మోడల్ రాజ్ అవుట్?

బిగ్‌బాస్ హౌస్ నుంచి మోడల్ రాజ్ అవుట్?

బిగ్‌బాస్ వేదికపై ఆదిరెడ్డి చెల్లెలు, ఫైమా అక్క, రేవంత్ అన్న - మళ్లీ మెరిసిన కుటుంబసభ్యులు, సెలెబ్రిటీలు

బిగ్‌బాస్ వేదికపై ఆదిరెడ్డి చెల్లెలు, ఫైమా అక్క, రేవంత్ అన్న - మళ్లీ మెరిసిన కుటుంబసభ్యులు, సెలెబ్రిటీలు

Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది

Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది

Bigg Boss 6 Telugu Episode 83: ఎట్టకేలకు కెప్టెన్ అయిన ఇనాయ - అమ్మ కోరిక తీర్చింది, మట్టి తింటున్న ఫైమా

Bigg Boss 6 Telugu Episode 83: ఎట్టకేలకు కెప్టెన్ అయిన ఇనాయ - అమ్మ కోరిక తీర్చింది, మట్టి తింటున్న ఫైమా

టాప్ స్టోరీస్

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం: సీఎం కేసీఆర్

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం:  సీఎం కేసీఆర్

మంత్రి అప్పలరాజుకు అసమ్మతి సెగ, అతడిని ఓడించాలంటూ వైసీపీ నేతల ప్రచారాలు!

మంత్రి అప్పలరాజుకు అసమ్మతి సెగ, అతడిని ఓడించాలంటూ వైసీపీ నేతల ప్రచారాలు!

Bandi Sanjay : పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Bandi Sanjay :  పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Weather Latest Update: ‘ఆ ఫేక్ తుపానును నమ్మొద్దు’ -ఏపీకి స్వల్ప వర్ష సూచన! తెలంగాణలో 4 జిల్లాలకి చలి అలర్ట్

Weather Latest Update: ‘ఆ ఫేక్ తుపానును నమ్మొద్దు’ -ఏపీకి స్వల్ప వర్ష సూచన! తెలంగాణలో 4 జిల్లాలకి చలి అలర్ట్