అన్వేషించండి

ఏందీ ఇంత పెద్ద సింగర్ ఇలా చేస్తున్నాడు - రేవంత్‌పై గీతూ కామెంట్స్, క్లాస్ పీకిన చంటి

‘బిగ్ బాస్’ హౌస్‌లో నామినేషన్స్ వేడి ఇంకా తగ్గలేదు. ఇంకా హౌస్ మేట్స్ దాని గురించే చర్చించుకుంటూ వాదోపవాదాలు చేసుకుంటున్నారు.

‘బిగ్ బాస్’ సీజన్-6 రంజుగా సాగుతోంది. హౌస్‌లో ఉన్న 21 మంది కంటెస్టెంట్ల మధ్య నిప్పు పెట్టి.. మనకు వినోదాన్ని పంచే పనిలో ‘బిగ్ బాస్’ ఉన్నాడు. అదేనండి.. నామినేషన్లతో హౌస్ మేట్స్‌కు నిద్రలేకుండా చేస్తూ హౌస్‌లో కుంపటి పెట్టాడు బిగ్ బాస్. దీంతో ఎవరూ తగ్గడం లేదు. నువ్వెంతంటే నువ్వెంత అన్నట్లుగా ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక నామినేషన్లో ఉన్నవారి పరిస్థితి మరింత దారుణం. వారు తమ బాధను ఎలా వ్యక్తం చేయాలో తెలియక సతమతం అవుతున్నారు. ముఖ్యంగా వచ్చిన వారం రోజులోనే ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయే పరిస్థితి వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. తామంటే ఏంటో నిరూపించుకోడానికి కూడా తగిన సమయం లేకపోవడంతో నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్లు తమ ఫ్రస్ట్రేషన్‌ను తమను నామినేట్ చేసినవారిపై చూపిస్తున్నారు. 

బుధవారం వెల్లడించిన నామినేషన్ల ప్రకారం.. చంటి, ఇనయా సుల్తానా, రేవంత్, ఫైమా, అభినయాశ్రీ, శ్రీసత్య, ఆరోహీలు ఈ వారం నామినేషన్లలో ఉన్నారు. శనివారం జరగబోయే ఎలిమినేషన్లలో వీరిలో ఒకరు లేదా ఇద్దరు బయటకు వెళ్లే అవకాశం ఉంది. అంటే డబుల్ ఎలిమినేషన్‌కు అవకాశం ఉందన్నమాట. దీంతో హౌస్ నుంచి బయటకు వెళ్లబోయే ఆ ఇద్దరు ఎవరనే ఆసక్తి నెలకొంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో బాలాదిత్య, రేవంత్‌లు నామినేషన్ల గురించి మాట్లాడుకుంటున్నారు. నామినేషన్లు ప్రతివారం జరిగేవేనని, జనాలేమీ నిన్ను తిట్టుకోవడం లేదని, కూల్‌గా ఉండమంటూ రేవంత్‌కు బాలాదిత్య క్లాస్ ఇస్తున్నట్లు కనిపించింది. ప్రతి వారం ఎవరో ఒకరు మరొకరిలో తప్పును చెప్పి నామినేట్ చేయాల్సి ఉంటుందని తెలిపాడు. ఆ తర్వాత శ్రీసత్యశ్రీ, ఇనయా మాట్లాడుకోవడం కనిపించింది. శ్రీసత్య మాట్లాడుతూ.. బుర్రలో మంచిగా ఉంటే నోరు మంచిగా మాట్లాడుతుంది. అక్కడ చిరాగ్గా ఉంటే నోటి నుంచి చిరాకైనా మాటలు వస్తాయని తెలిపింది.

ఆ తర్వాత ఇనయా, బాలాదిత్య మధ్య వాగ్వాదం జరిగింది. ‘‘ఎందుకు నన్ను ఇంతగా టార్గెట్ చేసుకుంటున్నారు’’ అని ఇనయా అడిగిన ప్రశ్నకు బాలాదిత్య ‘‘మీ బుర్రలో నా గురించి మీరు ఏమనుకుంటున్నారో, నేను మీకు ఎలా చెబితే మీకు నచ్చుతుందనేది.. నేను స్కాన్ చేసి, స్కెచ్ వేసి, ప్లాన్ వేసి మాట్లాడలేను’’ అని అన్నాడు. ఏదైనా ముఖం మీద చెబితే నేను ఫైట్‌కు సిద్ధమే అని ఇనయా సమాధానం ఇచ్చింది. ఇందుక బాలాదిత్య స్పందిస్తూ.. ‘‘నేను ఫైట్ సిద్ధం కాదు చెల్లి’’ అని అన్నాడు. 

మరోవైపు చంటి.. గీతూకు క్లాస్ పీకుతూ కనిపించాడు. ‘‘భగవంతుడు చెవులెందుకు ఇచ్చాడు. ఎక్కువ విని, తక్కువ మాట్లాడాలి’’ అన్నాడు. గీతూ రేవంత్ గురించి మాట్లాడుతూ.. ‘‘రేవంత్ ఎంత త్వరగా వెళ్లిపోతే అంత మంచిది ఆయనకే. ఆయన హౌస్‌లో ఇంకొన్నాళ్లు ఉన్నాడంటే.. జనాలంతా ఏందీ ఇంత పెద్ద సింగర్ ఇట్లా చేస్తున్నాడని అనిపిస్తుంది’’ అని కామెంట్ చేసింది. 

Also Read: బిగ్‌బాస్-6 కంటెస్టెంట్‌లా రెమ్యునరేషన్లు ఇవే, అతడు టాప్ - ఆమె లీస్ట్
Also Read: ‘బిగ్ బాస్’ సీజన్-6లో ఈసారి గట్టి పోటీయే, ఈ కంటెస్టెంట్లలో మీ ఫేవరెట్ ఎవరు?

టాప్ హెడ్ లైన్స్

Kadali Satyanarayana: బిగ్ బాస్ 10 తెలుగులోకి రచయిత్రి.. కడలి సత్యనారాయణ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు!
బిగ్ బాస్ 10 తెలుగులోకి రచయిత్రి.. కడలి సత్యనారాయణ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget