‘బిగ్ బాస్’ సీజన్-6లో ఈసారి గట్టి పోటీయే, ఈ కంటెస్టెంట్లలో మీ ఫేవరెట్ ఎవరు?
‘బిగ్ బాస్’ హౌస్‌లోకి 21 మంది కంటెస్టెంట్లు వచ్చేశారు. మరి, వీరిలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు?
‘బిగ్ బాస్’ సీజన్-6లో ఈ సారి పోటీగా గట్టిగానే ఉండనుంది. ఎందుకంటే.. ఈ సారి ఇప్పటికే ప్రజాభిమానం పొందిన సెలబ్రిటీలు పెదన్న(బిగ్ బాస్) ఇంట్లో అడుగుపెట్టారు. వీరిలో కొందరి నేపథ్యం గుండె బరువు ఎక్కిస్తుంది. ముఖ్యంగా ‘కార్తీక దీపం’ సీరియల్ నటి కీర్తి భట్.. చిన్నతనంలో పూర్తిగా కుటుంబాన్ని కోల్పోయి.. ఒంటరైంది. ఆమె తండ్రి ఆస్తులను సైతం రా‘బంధు(వు)’లు ఎత్తుకుపోవడంతో ఆమె రోడ్డున పడింది. ఆ స్థాయి నుంచి ఇప్పుడు కీర్తి నటిగా ఎదిగి ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి ఫేవరెట్ కంటెస్టెంట్‌గా ప్రవేశించింది. ఆమెకు మహిళల సపోర్ట్ పూర్తిగా ఉంది. ఇందుకు ఆమె వ్యక్తిత్వం, నడవడిక తోడైతే బిగ్ బాస్‌లో తిరుగే ఉండదు.
ఆమె తర్వాత గుండెను పిండే గతం కలిగిన సెలబ్రిటీ.. ఫైమా. పేద కుటుంబానికి చెందిన ఫైమా, ఈటీవీలో ప్రసారమయ్యే ‘పటాస్’ కార్యక్రమం నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. ఆమెకు ఆ షోస్‌లో వచ్చే పారితోషికం ఎంతో తెలీదుగానీ.. ఆమె నవ్వించే నవ్వులకు ఎంత ఇచ్చినా తక్కువే అనే భావన ప్రేక్షకుల్లో ఉంది. మరి, ఫైమా కూడా తన వ్యక్తిత్వంతో ప్రేక్షకులకు ఎంత దగ్గరవుతుందో చూడాలి. ఫైమా తర్వాత ఆకట్టుకొనే మరో సెలబ్రిటీ చలాకీ చంటి. ‘జబర్దస్త్’ షోతో మంచి పేరు సంపాదించిన చంటికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ముక్కుసూటిగా ఉండే చంటి ఎంతమందికి నచ్చుతాడో చూడాలి. ఆ తర్వాత శ్రీహన్. ఇదివరకు సీజన్లో పాల్గొన్న సిరి బాయ్ ఫ్రెండ్ ఇతడు. అప్పట్లోనే శ్రీహన్ ప్రేమకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సిరి.. షన్ముఖ్‌కు క్లోజ్‌గా ఉన్నా, శ్రీహన్ ఒక్క మాట కూడా అనకుండా ఆమెను తిరిగి తన జీవితంలోకి ఆహ్వానించాడు. అయితే, శ్రీహాన్‌కు యూట్యూబ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో శ్రీహన్‌ను తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే శ్రీహన్ చాలా మెచ్యూర్డ్ కంటెస్టెంట్. ఈ టైప్ కంటెస్టెంట్లకు విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువ.
ఇక బాలాదిత్య కూడా అందరికీ సుపరిచితుడే. బాలనటుడిగా మెప్పించిన బాలాదిత్య, నటుడిగా మాత్రం స్థిరపడలేకపోయాడు. కానీ, అతడు హౌస్‌లో అందరినీ మెప్పించడమే కాకుండా, ప్రేక్షకులకు కూడా మళ్లీ దగ్గరవ్వాల్సి ఉంటుంది. బాలాదిత్య విజయం కేవలం అతడి చేతిలోనే ఉంది. ఎందుకంటే, ప్రజలకు తెలియని బాలాదిత్యను ఇప్పుడు నేరుగా కోట్లది కళ్లు ప్రత్యక్షంగా చూస్తాయి. చివరిగా సింగర్ రేవంత్. ఇతడి జాతీయ స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారనే సంగతి మీకు తెలిసిందే. మరి, ‘బిగ్ బాస్’లో ఆ అభిమానం ఓట్లుగా మారుతాయో లేదో చూడాలి. రేవంత్ మెప్పిస్తే.. తప్పకుండా కప్‌తో తిరిగి వస్తాడు. దీనిపై రేవంత్ కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. వీరే కాకుండా ఆర్జే సూర్య, యాంకర్ నేహాకు కూడా అవకాశం ఉన్నా.. బాగా కష్టపడాల్సి ఉంటుంది. అయితే, మిగతా కంటెస్టెంట్లను తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే అది ‘బిగ్ బాస్’ హౌస్. ఏమైనా జరగొచ్చు. అంతేకదా నాగార్జున గారు!!
Also Read: ‘బిగ్ బాస్’ సీజన్-6 ప్రైజ్ మనీ ఎంత? హౌస్‌లో ఉంటే వచ్చే ప్రయోజనాలేమిటీ?
‘బిగ్ బాస్’ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లు వీరే:
1. కీర్తి భట్ (‘కార్తీక దీపం’ సీరియల్ నటి)
2. సుదీప (‘నువ్వు నాకు నచ్చావ్’లో బాలనటి)
3. శ్రీహన్ (సిరి బాయ్ ఫ్రెండ్, యూట్యూబర్)
4. నేహా (యాంకర్)
5. శ్రీ సత్య (మోడల్)
6. అర్జున్ కళ్యాణ్ (సీరియల్ నటుడు)
7. చలాకీ చంటి (‘జబర్దస్త’ కమెడియన్)
8. అభినయ శ్రీ (నటి, డ్యాన్సర్)
9. గీతూ (సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్)
10. బాలాదిత్య (నటుడు)
11. మరీనా (సీరియల్ నటి, రోహన్ భార్య)
12. రోహన్ (సీరియల్ నటి, మరినా భర్త)
13. వాసంతి కృష్ణన్ (సీరియల్ నటి)
14. షాని (నటుడు)
15. ఆర్జే సూర్య (ఆర్జే)
16. ఆది రెడ్డి (యూట్యూబర్)
17. ఆరోహిరావు (టీవీ యాంకర్)
18. ఫైమా (‘జబర్దస్త్’ కమెడియన్)
19. రాజశేఖర్ (నటుడు)
20. ఇనయా (నటి)
21. రేవంత్ (సింగర్)