By: ABP Desam | Updated at : 20 Mar 2023 06:03 PM (IST)
Edited By: Mani kumar
Image Credit:Akhil Sarthak/Instagram
బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్ గురించి అందరికీ తెలిసిందే. రెండు సార్లు బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి ఎంతో మంది అభిమానులు సొంతం చేసుకున్నాడు అఖిల్. బిగ్ బాస్ తర్వాత పలు టీవీషోలలో కనిపించాడు కూడా. ఆయన ప్రస్తుతం ఓ టీవీలో డ్యాన్స్ షోలో చేస్తున్నాడు. తేజస్వి మదివాడతో కలసి ఫ్లోర్ పై డ్యాన్స్ ఇరగదీస్తున్నాడు అఖిల్. అయితే ఇటీవల ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు అఖిల్. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఇది చూసిన ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ డాన్స్ ప్రోగ్రాంలో పర్ఫామెన్స్ చేస్తున్నపుడు తనకు కడుపులో బొడ్డు కింద భాగంలో నొప్పి వచ్చిందని చెప్పాడు అఖిల్. ఎప్పటి నుంచో అది అలాగే ఉందని, అయినా నొప్పిని తట్టుకొని డాన్స్ చేస్తూ వచ్చానని చెప్పాడు. కానీ డాన్స్ చేస్తున్నకొద్దీ ఆ నొప్పి ఎక్కువైందని అన్నాడు. దీంతో ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని తెలిపాడు. అసలు ముందు నుంచీ ఏం జరిగిందో చెప్పాడు. ఎపిసోడ్ లో కూడా దాన్ని పూర్తిగా చూపించలేదని, అందుకే వీడియో చేసి చెప్పాల్సి వచ్చిందని అన్నాడు.
తాము లీస్ట్ నుంచి టాప్ 2 లో ఉన్నామనేది షాకింగ్ గా ఉందని అన్నాడు. తాను ఎలాగో తరువాత ఎపిసోడ్ కు రాలేనని వారికి తెలుసని అందుకే అలా చేశారని అన్నాడు. తమని కిందకు లాగి ఇంకొకర్ని సేవ్ చేయాలనే ఆలోచనలో ఏమైనా ఉన్నారేమోనని చెప్పాడు. తన నొప్పి జనాలకు కనిపించదని, షో మధ్యలో వదిలేసి వెళ్లియానని అనుకుంటారని, అందుకే ఇదంతా చెప్తున్నానని తెలిపాడు. తానూ తేజస్వి ఎంతో కష్టపడి డాన్స్ చేసి తమ బెస్ట్ ను ఇచ్చామని అన్నాడు. అయినా తాను నొప్పితో బాధపడుతున్నానను అంటే ఒక్కరు కూడా నమ్మలేదని చెప్పాడు. అదే తనకు బాధ కలిగించిందని అన్నాడు. అయినా తన గురించి ఏవేవో అంటున్నారని, తనకు వెళ్లిపోవాలని అని ఉంటే అసలు ముందు షో లోకి ఎందుకు వస్తాను, ఇంతలా ఎందుకు కష్టపడతానని ప్రశ్నించారు.
ఏదేమైనా తనకు ఇన్ని రోజులుగా సపోర్ట్ ఇచ్చిన అందరికీ ధన్యావాదాలు అని తెలిపాడు. ప్రేక్షకుల సపోర్ట్ లేకపోతే అసలు ఈ డాన్స్ ప్రోగ్రామే ఉండదన్నాడు. ప్రేక్షకుల వల్లే తనకు మంచి రేటింగ్ వచ్చిందని చెప్పుకొచ్చాడు. మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఎంతగానో ప్రయత్నించాను, కానీ ఇలా వెళ్లిపోవాల్సి వచ్చింది నన్ను క్షమించండి అంటూ ఎమోషనల్ అయ్యాడు అఖిల్. అయినా పర్లేదు.. మళ్లీ రెట్టింపు వేగంతో మీ ముందుకు వస్తాను అని పేర్కొన్నాడు. మొత్తంగా ఆ డ్యాన్స్ ప్రోగ్రాంలో తమపై కావాలనే ఇలా చేశారు అని చెప్పకనే చెప్పేశాడు అఖిల్. అసలు ఆ ప్రోగ్రాంలో అఖిల్, తేజస్వీ జోడికే ఎక్కువ పాపులారిటీ ఉండేది. ఇప్పుడు వీరిద్దరూ షో నుంచి పక్కకు తప్పుకోవడం చర్చనీయాంశమైందనే చెప్పాలి. పాపం అఖిల్‌కు షోలు కలిసిరావడం లేదంటూ అభిమానులు వాపోతున్నారు.
Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్
Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?
Chiranjeevi Cancer : నేనూ క్యాన్సర్ బారిన పడ్డాను - మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు
Guppedanta Manasu Rishi Re-Entry: జైల్లోంచి విడుదలైన రిషి - మూడేళ్లలో ఏం జరిగింది - మరింత ఇంట్రెస్టింగ్ గా 'గుప్పెడంతమనసు'
ఒడిశా రైలు ప్రమాదంపై టాలీవుడ్ సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి - రక్తదానం చేయాలని అభిమానులకు చిరు పిలుపు
Chandrababu Delhi Tour: ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో ముగిసిన చంద్రబాబు భేటీ - పొత్తు కుదురుతుందా?
KCR Nirmal Tour: నేడు నిర్మల్ జిల్లాలో సీఎం కేసీఆర్ టూర్, బహిరంగ సభ కూడా
Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!
Weather Latest Update: తెలంగాణలో ఈవారం ఠారెత్తనున్న ఎండ, ఐఎండీ హెచ్చరిక - ఏపీలో ఈ జిల్లాల్లో వడగాడ్పులు!