అన్వేషించండి

Bigg Boss Promo: బిగ్‌బాస్: నోర్ముయ్ అంటూ ఉమాపై ప్రియాంక చిందులు.. ఇద్దర్ని లేపేస్తానన్న నటరాజ్, పండగ పూట అదే లొల్లి

పండగ పూట కూడా బిగ్ బాస్.. తన ఇంటి సభ్యులను ప్రశాంతంగా ఉంచడం లేదు. టాస్క్‌లో బెస్ట్, వరెస్ట్ ఎవరని అడిగి మరీ గొడవ పెట్టాడు.

బిగ్ బాస్ మరోసారి తన ఇంటి సభ్యుల మధ్య.. పుల్లలు పెట్టేశాడు. వినాయక చవితి సందర్భంగా ఇంట్లోవారంతా కలిసి మెలిసి.. సంతోషంగా గడుపుతారని ఊహించిన ప్రేక్షకులకు.. గోడవలతో వినోదాన్ని పంచేందుకు సిద్ధమైపోతున్నాడు. శుక్రవారం ప్రసారం కానున్న 6వ ఎపిసోడ్‌లో బిగ్ బాస్.. వినాయక చవితి వేడుకలతోపాటు.. సభ్యులను చిక్కల్లో పెట్టే టాస్క్ కూడా ఇచ్చాడు. ఆ తర్వాత బెస్ట్.. వరెస్ట్ పెర్ఫార్మర్‌ను ఎంచుకోవాలంటూ చివర్లో మెలిక పెట్టాడు. ఇంకేముంది.. కంటెంటే కంటెంట్. హౌస్‌లో అంతా దాదాపు సీరియల్ నటి ఉమానే టార్గెట్ చేసుకున్నట్లు కనిపించింది. 

‘బిగ్ బాస్‌ 5’ ప్రసారం చేస్తున్న ‘స్టార్ మా’.. గురువారం 6వ ఎపిసోడ్‌కు సంబంధించి రెండు ప్రోమోలు వదిలింది. మొదటి ప్రోమోలో బిగ్ బాస్.. ఇంటి సభ్యులంతా కలిసి వినాయక చవితి వేడుకలు జరుపుకుంటున్నట్లు చూపించారు. వినాయకుడి ఘనంగా పూజలర్పించిన సభ్యులు.. కాసేపటి తర్వాత ఇంట్లోవారికి దూరంగా పండుగ చేసుకుంటున్న నేపథ్యంలో భావోద్వేగానికి గురయ్యారు. ఆ తర్వాత బిగ్ బాస్ వారికి ఉట్టి కొట్టే టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా సభ్యులు కళ్లకు గంతలు కట్టుకుని.. వేరొకరి భుజం మీదకు ఎక్కి కుండలు(ఉట్టి) కొట్టాలి. ఈ సందర్భంగా శ్రీరామ చంద్ర.. విశ్వను భుజం మీదకు ఎక్కించుకోగా.. అతడు కళ్లకు గంతలు కట్టుకుని ఉట్టి పగలగొట్టాడు. అయితే, ఈ టాస్క్‌లో నటరాజ్‌కు అవకాశం రాలేదో.. మరేదైనా కారణం ఉందో తెలీదుగానీ.. అతడు రవితో వాగ్వాదానికి దిగడాన్ని ప్రోమోలో చూపించారు. ‘‘విశ్వ ఒక్కడే చేయగలడా? విశ్వకు మాత్రమే కండలు ఉన్నాయా. ఇంకా నలుగురు ఐదుగురు ఉన్నారు. లేపుతా నేను. ఒకరిని కాదు.. ఇద్దరి పెట్టండి లేపుతా’’ అని అన్నాడు. ఇందుకు రవి.. ‘‘నిన్ను అడిగినా కదా అన్నా.. అడిగినందుకు చెడ్డవాడిని అయ్యానా’’ అన్నాడు. 

ప్రోమో-1:

తాజాగా విడుదల చేసిన రెండో ప్రోమోలో.. ‘బిగ్ బాస్’ బెస్ట్, వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరో చెప్పండని హౌస్ సభ్యులకు ఆదేశించాడు. దీంతో అంతా విశ్వ, రవి కొందరి గురించి చెప్పారు. సరయు మాత్రం.. ‘‘పనులేవీ చేయకుండా టాస్క్‌లో కూర్చుంటున్నారు. ఓన్లీ టాయిలెట్‌కు వెళ్లడమేనా మీ పని’’ అని ఎవరిపైనో మండిపడుతూ కనిపించింది. ఆ తర్వాత లహరీ, ఆర్జే కాజల్ మధ్య వాగ్వాదం జరిగింది. ‘‘ఒకరికి రెస్పాన్సబిలిటీ ఇచ్చిన తర్వాత నువ్వెందుకు మాట్లాడుతావ్’’ అని లహరీ అనడంతో.. ‘‘నా ఇష్టం భయ్’’ అని ఆర్జే కాజల్ సమాధానం ఇచ్చింది. ‘‘పిజికల్‌గానే కాకుండా ఉమా చాలా లౌడ్‌గా మాట్లాడతారు’’ అని స్వేత.. ఉమాతో అన్నది. తర్వాత సిరి కూడా ‘‘అది మీరు మార్చుకోమని నేను చెప్పడం లేదు. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి’’ అన్నది. ఇందుకు ఉమా సమాధానమిస్తూ.. ‘‘మీరు చెప్పినా నేను మార్చుకోను’’ అని సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత ప్రియాంక మీద ఉమా అరవడం కనిపించింది. ‘‘డోన్ట్ టేక్ పర్శనల్’’ వేలు పెట్టి చూపించింది. దీంతో ప్రియాంక ‘షట్‌అప్’ (నోర్ముయ్) అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. చూస్తుంటే.. ఈ రోజు వారిద్దరి మధ్య పెద్ద రచ్చే జరిగేలా ఉంది. అయితే, ప్రోమోలో ఇంత హడావిడి చూపించినా.. ఎపిసోడ్స్‌లో మాత్రం ఆ గొడవలు అంత ప్రభావంతంగా ఉండవని ఇప్పటికే ప్రేక్షకులు కనిపెట్టేశారు. ఈ ప్రోమోలను చేసే ఎడిటర్‌ను చాలామంది పొగుడుతారు కూడా. ఏది ఏమైనా.. హౌస్ మేట్స్ మొదటి వారమే.. హోస్ట్ నాగార్జునకు పెద్ద పని చెప్పేలా ఉన్నారు. 

ఫ్రొమో-2:

టాప్ హెడ్ లైన్స్

Train Release Date: డిసెంబర్‌లో 'ట్రైన్' రిలీజ్... నితిన్, నాగచైతన్యకు పోటీగా విజయ్ సేతుపతి
డిసెంబర్‌లో 'ట్రైన్' రిలీజ్... నితిన్, నాగచైతన్యకు పోటీగా విజయ్ సేతుపతి
Godavari Serial Today October 13th: 'గోదావరి' సీరియల్: సూర్యని లవ్ చేసి నాకు ఎలా ఐలవ్‌యూ చెప్తావ్? జానుపై సంజు ఫైర్! 50 వేలు కోసం నందు, గౌతమిల గొడవ!
'గోదావరి' సీరియల్: సూర్యని లవ్ చేసి నాకు ఎలా ఐలవ్‌యూ చెప్తావ్? జానుపై సంజు ఫైర్! 50 వేలు కోసం నందు, గౌతమిల గొడవ!
Hide & Silk: రొమాంటిక్ ఫిల్మ్ 'హైడ్ అండ్ సిల్క్'లో హీరోగా సుహాస్... ప్రోమో రిలీజ్
రొమాంటిక్ ఫిల్మ్ 'హైడ్ అండ్ సిల్క్'లో హీరోగా సుహాస్... ప్రోమో రిలీజ్
Aishwarya Pisse Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ హీరోయిన్... భర్తకు దూరమై ఏడాది, ఇప్పుడు వేరు కాపురం
విడాకులు తీసుకున్న సీరియల్ హీరోయిన్... భర్తకు దూరమై ఏడాది, ఇప్పుడు వేరు కాపురం

వీడియోలు

Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్
Ashwin On Naman Dhir Bowling Performance | నమన్ ధీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లు
West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
Jagan Cases ED Speed Up: జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
EV Tyres: ఎలక్ట్రిక్‌ కార్లకు సాధారణ కారు టైర్లు వాడుతున్నారా? ఈ తప్పులతో రేంజ్‌ తగ్గడమే కాదు.. ప్రమాదం కూడా!
సాధారణ కారు టైర్లు vs ఎలక్ట్రిక్‌ కార్‌ టైర్లు... రెండూ ఒకటి కాదా? తేడా ఏంటి?
Embed widget