Shrihan: హీరోగా మారిన బిగ్ బాస్ కంటెస్టెంట్ - ‘ఆవారా జిందగీ’ పేరుతో ప్రేక్షకుల ముందుకు!
షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీహాన్. ప్రస్తుతం బిగ్ బాస్-6 రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా కొనసాగుతున్నాడు. ఈయన హీరోగా తెరకెక్కిన సినిమా విడుదలకు రెడీ అయ్యింది.

యూట్యూబ్ వేదికగా పాపులారిటీ సంపాదించిన శ్రీహాన్.. పలు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గత సీజన్ బిగ్ బాస్ రియాలిటీ షో కంటెస్టెంట్ సిరి హన్మంతు బాయ్ ఫ్రెండ్ గా బాగా క్రేజ్ సంపాదించాడు. ఈ సీజన్ బిగ్‌బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ఈయన కీలక పాత్రలో నటించిన ‘ఆవారా జిందగి’ సినిమా విడుదలకు రెడీ అవుతున్నది. ఫన్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులను అలరించబోతుంది.
శ్రీహన్ ముఖ్యపాత్రలో ‘ఆవారా జిందగి’ అనే సినిమా తెరకెక్కింది. నలుగురు యువకుల మధ్య నడిచే కథతో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందింది. జీరో లాజిక్ 100% ఫన్ అనే ట్యాగ్ లైన్ ఈ సినిమాపై క్రేజ్ ను పెంచుతుంది. ఈ సినిమా అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఆకట్టుకునేలా ఉంటుందని మూవీ మేకర్స్ వెల్లడించారు. ఇప్పటికే సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి.
విభా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద దేప శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరెక్కింది. నంద్యాల మధుసూదన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. బిగ్ బాస్ శ్రీహాన్, ముక్కు అజయ్, ఢీ చెర్రీ, జస్వంత్, షియాజీ షిండే, సద్దాం, టార్జాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీహన్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుకానున్నాయి. ఈ చిత్రానికి ప్రతీక్ నాగ్ మ్యూజిక్ అందించారు. కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ డేట్ త్వరలో ప్రకటించనున్నట్లు సినిమా యూనిట్ వెల్లడించింది.
Here's the Title logo Of Fun-filled Entertainer #AwaraZindagi !
— BA Raju's Team (@baraju_SuperHit) October 1, 2022
🌟ing : BiggBoss Fame #Srihaan #MukkuAjay #Cherry #Saddam #Jaswanth
#VibhaEntertainments Under #NandyalaMadhusudhanReddy #DepaSrikanthReddy #PrateekNag @PROSaiSatish pic.twitter.com/GgLlJEA67M
ఇక శ్రీహాన్ బిగ్ బాస్ హౌస్ లో మంచి ఆట తీరు కనబరుస్తున్నాడు. అందరితో కలగలుపుగా ఉన్నా.. ఇయానాతో గొడవ కారణంగా తనకు ఎక్కువ ప్రయారిటీ వచ్చింది. ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్లలో బలమైన పార్టిసిపెంట్ గా కొనసాగుతున్నాడు. ఇదే ఆట తీరు కనబర్చితే టైటిల్ విన్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఆయన విజేతగా నిలవాలని బుల్లితెర ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో విజయాన్ని అందుకుంటున్న సినిమాల్లో ఎక్కువగా ఫన్ ఎంటర్ టైనర్స్ ఉన్నాయి. తాజాగా వచ్చిన F2, జాతి రత్నాలు, F3 లాంటి సినిమాలు ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుత తరం యువతీ యువకులు ఎక్కువగా కామెడీ కమ్ లవ్ స్టోరీలనే ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ శ్రీహాన్ సినిమా ‘ఆవారా జిందగి’ సైతం మంచి విజయాన్ని అందుకుంటుందని సినిమా యూనిట్ ఆశిస్తుంది.
Also read: విడాకుల కోసం కోర్టుకెక్కిన కలర్స్ స్వాతి, అప్పుడు వద్దన్నా పెళ్లి చేసుకుని ఇప్పుడిలా!
Also Read : వెయ్యి కోట్లు దాటే మార్కెట్ ఎట్లుంటదో చూపిస్తా: పవన్‌పై బండ్ల గణేష్ ట్వీట్
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















