News
News
X

Bigg Boss 6 Telugu: 'ఉన్మాదిలా ఆడుతున్నావ్' - రేవంత్ కి క్లాస్, డైరెక్ట్ ఎలిమినేషన్ తో షాకిచ్చిన నాగార్జున!

ఈరోజు ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ పై నాగార్జున ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

FOLLOW US: 

బిగ్ బాస్ సీజన్ 6 అప్పుడే యాభై ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది. ఇప్పటికే చాలా మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్ లో 14 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. వీరందరూ కూడా ఈ వారం ఎలిమినేట్ అవ్వడానికి నామినేట్ అయ్యారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో వీకెండ్ లో తెలిసిపోతుంది. ఇప్పటికే శనివారం ఎపిసోడ్ కి సంబంధించిన ఒక ప్రోమోను వదిలారు. తాజాగా మరో ప్రోమోని రిలీజ్ చేశారు. 

ఇందులో నాగార్జున.. బాలాదిత్యతో మాట్లాడుతూ టాస్క్ లో అతడికి కోపమొచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. దానికి బాలాదిత్య బాధేసిందని అన్నారు.  'సత్యతోనేనా గొడవ' అని నాగ్ అడగ్గా.. 'అవును సార్' అని బదులిచ్చారు బాలాదిత్య. దానికి వెంటనే సత్య.. 'సారీ చెప్పాను సార్' అని అన్నారు. 'గీతూ చెప్పమంటే చెప్పావ్' అని నాగ్ అన్నారు. వెంటనే సత్య 'నాకు ప్రామిస్ గా గుర్తు లేదు సార్' అని బదులిచ్చారు. 'అదే ఫుడ్ ఐటెం అయితే గుర్తుంటాది' అని నాగ్ కౌంటర్ ఇచ్చారు. 

శ్రీహాన్, శ్రీసత్యలతో మాట్లాడుతూ.. 'మీరిద్దరూ కలిసి ఆడారా..? లేక మిగతా జంటల హెల్ప్ తీసుకొని ఆడారా..?' అని నాగ్ ప్రశ్నించారు. 'కలిసే ఆడాం సార్' అని చెప్పారు. 'మీకు ఎవరూ చేపలు ఇవ్వలేదా..?' అని నాగ్ ప్రశ్నించగా.. గీతూ పక్కన పడేసినవి తీసుకున్నట్లు చెప్పారు శ్రీసత్య. దానికి నాగ్ 'గీతూ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడింది మీ గేమ్' అని నాగ్ సీరియస్ గా అన్నారు.

ఫెమినిస్ట్ మాట్లాడాల్సిన మాటలేనా అవి:

News Reels

వసంతిని ఉద్దేశిస్తూ.. 'ఆ చిట్టీల ఆట ఏంటమ్మా..? ఎంతో ఫైట్ చేసి చేసి.. సింపుల్ గా ఇచ్చేశావ్' అని నాగ్ అనగా.. 'ఇక్కడ ముగ్గురు అమ్మాయిల కంటే నువ్ ఫిజికల్ గా తక్కువ టాస్క్ లు ఆడతావని అన్నప్పుడు(సూర్యని ఉద్దేశిస్తూ) ట్రిగ్గర్ అయిపోయి ఇచ్చేశానని' చెప్పారు. వెంటనే నాగ్ 'సూర్య నువ్ ఫెమినిస్ట్ అని చెప్పుకుంటావ్.. మరి ఫెమినిస్ట్ మాట్లాడాల్సిన మాటలేనా అవి' అని నాగ్ క్లాస్ పీకారు. 

ఉన్మాదిలాగా ఆడుతున్నావ్:

'కామెడీకి ఒక్కోసారి హద్దు ఉంటుందనేది మర్చిపోతున్నావ్' అని ఫైమాని ఉద్దేశిస్తూ అన్నారు. దానికి ఆమె అర్ధం కానట్లుగా ఎక్స్ ప్రెషన్స్ పెట్టింది. ఆ తరువాత రేవంత్ గేమ్ గురించి మాట్లాడుతూ అతడికొక వీడియో వేసి చూపించారు నాగ్. అందులో రేవంత్.. గీతూ, కీర్తిలను గేమ్ లో తోసేస్తూ కనిపించారు. కావాలని చేయలేదని రేవంత్ చెప్పగా.. 'ఇంటెన్షనల్ గా చేశావ్ అని నేను చెప్పడం లేదు.. కానీ అగ్రెషన్ కనిపిస్తుంది. ఒక ఉన్మాదిలాగా ఆడుతున్నావ్' అని అన్నారు. ఆ తరువాత ఈరోజు ఎపిసోడ్ లో డైరెక్ట్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పి.. ఒక కంటెస్టెంట్ ను బయటకు పంపించేశారు. అదెవరో ఈరోజు ఎపిసోడ్ లో తెలియనుంది. 

Also Read : గరికపాటిపై 'చిరు' సెటైర్ - మెగాస్టార్ మర్చిపోలేదుగా

Published at : 29 Oct 2022 07:36 PM (IST) Tags: Srihaan Revanth Bigg Boss 6 Telugu Bigg Boss 6 Nagarjuna surya

సంబంధిత కథనాలు

Sunset Circle Awards 2022 : ఆస్కార్‌కు ముందు 'ఆర్ఆర్ఆర్'కు ఇంటర్నేషనల్ అవార్డులు - దర్శకుడిగా రాజమౌళికి...

Sunset Circle Awards 2022 : ఆస్కార్‌కు ముందు 'ఆర్ఆర్ఆర్'కు ఇంటర్నేషనల్ అవార్డులు - దర్శకుడిగా రాజమౌళికి...

Ram Charan New Movie: రాంచరణ్‌తో జతకట్టేందుకు జాన్వీ గ్రీన్ సిగ్నల్? బుచ్చిబాబు-చెర్రీ మూవీలో హీరోయిన్‌ ఆమేనా?

Ram Charan New Movie: రాంచరణ్‌తో జతకట్టేందుకు జాన్వీ గ్రీన్ సిగ్నల్? బుచ్చిబాబు-చెర్రీ మూవీలో హీరోయిన్‌ ఆమేనా?

Siddu On Tillu Square Rumours: డీజే టిల్లు తప్పేమీ లేదని చెబుతాడా? సిద్ధూ ఏం నిజాలు మాట్లాడతాడో?

Siddu On Tillu Square Rumours: డీజే టిల్లు తప్పేమీ లేదని చెబుతాడా? సిద్ధూ ఏం నిజాలు మాట్లాడతాడో?

Bigg Boss 6 Telugu: ‘టికెట్ టు ఫినాలే’ కోసం కిందా మీద పడి కొట్టుకున్న అమ్మాయిలు

Bigg Boss 6 Telugu: ‘టికెట్ టు ఫినాలే’ కోసం కిందా మీద పడి కొట్టుకున్న అమ్మాయిలు

Kartikeya's Bedurulanka 2012 First Look : పల్లెటూరిలో యుగాంతం - కార్తికేయ 'బెదురులంక 2012'

Kartikeya's Bedurulanka 2012 First Look : పల్లెటూరిలో యుగాంతం - కార్తికేయ 'బెదురులంక 2012'

టాప్ స్టోరీస్

విజయామా? వైఫల్యామా ? రాజధాని విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నది ఎవరు?

విజయామా? వైఫల్యామా ? రాజధాని విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నది ఎవరు?

IND vs NZ 3rd ODI: కివీస్ బౌలర్ల ధాటికి భారత్ విలవిలా- న్యూజిలాండ్ లక్ష్యం ఎంతంటే!

IND vs NZ 3rd ODI: కివీస్ బౌలర్ల ధాటికి భారత్ విలవిలా- న్యూజిలాండ్ లక్ష్యం ఎంతంటే!

WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్, ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్, ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

Viral News: పిల్లాడ్ని చంపేస్తారా? పెళ్లి కూడా ప్రశాంతంగా చేసుకోనివ్వరా!

Viral News: పిల్లాడ్ని చంపేస్తారా? పెళ్లి కూడా ప్రశాంతంగా చేసుకోనివ్వరా!