Bigg Boss 6 Telugu Memes: కితకితలు పెడుతున్న ‘బిగ్ బాస్’ మీమ్స్, గీతూ to రేవంత్ - అందరినీ ఆడేసుకుంటున్నారు!
‘బిగ్ బాస్’ సీజన్-6 రంజుగా సాగుతోంది. హౌస్‌లో ఉన్న 21 మంది కంటెస్టెంట్ల మధ్య నిప్పు పెట్టి.. మనకు వినోదాన్ని పంచే పనిలో ‘బిగ్ బాస్’ ఉన్నాడు.
‘బిగ్ బాస్’ మొదలైందంటే.. మీమర్స్ కూడా పండుగ మొదలవుతుంది. హౌస్‌లో ఉండే కంటెస్టెంట్ల తీరును ఫన్నీగా ఎండగట్టడం మీమర్స్ ప్రత్యేకత. ఇక తేడాగా బిహేవ్ చేస్తే ట్రోల్స్ మామూలుగా ఉండవు. మీమర్స్ చేసే ఫన్నీ మీమ్స్‌కు ‘బిగ్ బాస్’ నిర్వాహకులు కూడా ఫిదా అవుతుంటారు. ఒక్కోసారి వాటిని హౌస్ మేట్స్‌కు కూడా చూపిస్తూ నవ్వులు పూయిస్తారు. తాజాగా అరియానా హోస్ట్ చేస్తున్న ‘బిగ్ కేఫ్’లో కూడా మీమ్స్‌కు ప్రాధాన్యమిస్తున్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్లను బాగా ట్రోల్ చేస్తున్నారు.
‘బిగ్ బాస్’ సీజన్-6 రంజుగా సాగుతోంది. హౌస్‌లో ఉన్న 21 మంది కంటెస్టెంట్ల మధ్య నిప్పు పెట్టి.. మనకు వినోదాన్ని పంచే పనిలో ‘బిగ్ బాస్’ ఉన్నాడు. అదేనండి.. నామినేషన్లతో హౌస్ మేట్స్‌కు నిద్రలేకుండా చేస్తూ హౌస్‌లో కుంపటి పెట్టాడు బిగ్ బాస్. దీంతో ఎవరూ తగ్గడం లేదు. నువ్వెంతంటే నువ్వెంత అన్నట్లుగా ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక నామినేషన్లో ఉన్నవారి పరిస్థితి మరింత దారుణం. వారు తమ బాధను ఎలా వ్యక్తం చేయాలో తెలియక సతమతం అవుతున్నారు. ముఖ్యంగా వచ్చిన వారం రోజులోనే ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయే పరిస్థితి వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. తామంటే ఏంటో నిరూపించుకోడానికి కూడా తగిన సమయం లేకపోవడంతో నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్లు తమ ఫ్రస్ట్రేషన్‌ను తమను నామినేట్ చేసినవారిపై చూపిస్తున్నారు. వారి ఫ్రస్ట్రేషన్‌ను మీమర్స్ ఫన్నీగా వాడేస్తున్నారు. ఈ కింది మీమ్స్ చూస్తే మీరు కూడా తప్పకుండా నవ్వేస్తారు.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
‘బిగ్ బాస్’లోకి ఇప్పటివరకు ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లు వీరే:
1. కీర్తి భట్ (‘కార్తీక దీపం’ సీరియల్ నటి)
2. సుదీప (‘నువ్వు నాకు నచ్చావ్’లో బాలనటి)
3. శ్రీహన్ (సిరి బాయ్ ఫ్రెండ్, యూట్యూబర్)
4. నేహా (యాంకర్)
5. శ్రీ సత్య (మోడల్)
6. అర్జున్ కళ్యాణ్ (సీరియల్ నటుడు)
7. చలాకీ చంటి (‘జబర్దస్త’ కమెడియన్)
8. అభినయ శ్రీ (నటి, డ్యాన్సర్)
9. గీతూ (సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్)
10. బాలాదిత్య (నటుడు)
11. మరీనా (సీరియల్ నటి, రోహన్ భార్య)
12. రోహన్ (సీరియల్ నటి, మరినా భర్త)
13. వాసంతి కృష్ణన్ (సీరియల్ నటి)
14. షాని (నటుడు)
15. ఆర్జే సూర్య (ఆర్జే)
16. ఆది రెడ్డి (యూట్యూబర్)
17. ఆరోహిరావు (టీవీ యాంకర్)
18. ఫైమా (‘జబర్దస్త్’ కమెడియన్)
19. రాజశేఖర్ (నటుడు)
20. ఇనయా (నటి)
21. రేవంత్ (సింగర్)
ఏయే కంటెస్టెంట్లకు ఎంత?: ‘బిగ్ బాస్’లో ఉన్నన్ని రోజులు కంటెస్టెంట్లకు పారితోషికం లభిస్తుందనే సంగతి తెలిసిందే. అది ఒక్కో సెలబ్రిటీకి ఒక్కో విధంగా ఉంటుంది. కొందరికి రూ.15 వేల నుంచి రూ.60 వేల వరకు లభించవచ్చట. ఇనయా సుల్తానా, టీవీ9 యాంకర్ ఆరోహిలకు రోజుకు రూ.15 వేల రూపాయలు ఇస్తున్నట్లు సమాచారం. అభినయశ్రీ, సుదీప రూ.20 వేలు, సోషల్ మీడియా ఇన్ఫ్ఫ్లూయెన్సర్ గీతూ రోజుకు రూ.25 వేలు ఇస్తున్నట్లు తెలిసింది. జబర్దస్త్ ఫైమా, వాసంతి కూడా రోజుకు రూ.25 వేలే అందుకుంటున్నట్టు సమాచారం. యూట్యూబర్ ఆది మాత్రం రోజుకు 30 వేలు లభిస్తుందనేది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. ఇక సీరియల్ నటి శ్రీ సత్య రోజుకు రూ.30 వేలు, నటుడు షానీ కూడా రూ.30 వేలు, అర్జున్, కార్తీక దీపం హీరోయిన్ కీర్తి భట్ రోజుకు రూ.35 వేలు, మెరీనా-రోహిత్‌లలో మెరీనాకు రూ.35 వేలు, రోహిత్‌కు రూ.45 వేలు ఇస్తున్నారని తెలిసింది. అంటే ఈ జంట రోజుకు రూ.80 వేల దాకా సంపాదిస్తున్నట్లే. ఆర్జే సూర్య రూ.40 వేలు, శ్రీహాన్, చలాకీ చంటిలకు రోజుకు రూ.50 వేలు, రేవంత్‌కు రూ.60 వేలు చొప్పున ఇస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
గమనిక: ఇందులో పేర్కొన్న మీమ్స్‌లోని అంశాలన్నీ ఆయా వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయం. వాటికి ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదు. కాసేపు హాయిగా నవ్వించాలనేదే మా ఉద్దేశం.