News
News
X

Bigg Boss 6 Telugu: నా బేబీని బతికించుకోలేక పోయా, సుదీప ఎమోషనల్ స్టోరీ, కూతురి గురించి చెప్పిన ఆదిరెడ్డి

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ కొట్లాటలే కాదు కన్నీళ్లు కూడా కలుస్తాయి అని చెప్పింది ఈ ఎపిసోడ్.

FOLLOW US: 

Bigg Boss 6 Telugu: ‘జీవితంలో పిల్లలు ఎంత ముఖ్యం’ అన్న అంశంపై తమ భావాలను పంచుకోమని చెప్పారు బిగ్ బాస్. దీంతో బిగ్ బాస్ ఇల్లు ఎమోషనల్ గా మారిపోయింది. ముఖ్యంగా సుదీపకు పిల్లల్లేరు అన్న సంగతి ఈ కార్యక్రమం ద్వారానే తెలిసింది. ఎప్పుడో పెళ్లయినా కూడా ఇప్పటివరకు పిల్లలు లేరన్న సంగతి సుదీప కన్నీళ్లతో చెప్పింది. 

థైరాయిడ్ వల్ల...
‘2015లో నేను గర్భం ధరించా, కానీ నేను అప్పటికి బిడ్డను  కనేందుకు రెడీగా లేను. అందరూ ఒత్తిడితో వచ్చిన గర్భాన్ని ఎందుకు వదులుకోవాలి అని ఉంచుకున్నారు. నా బిడ్డతో మాట్లాడడం కూడా మొదలుపెట్టా. బేబీ హార్ట్ బీట్ కూడా బావుంది. కానీ అప్పుడు నాకు థైరాయిడ్ చాలా ఎక్కువ వచ్చేసింది. దాన్ని మేనేజ్ చేసుకోలేకపోయా. బిడ్డను కోల్పోవాల్సి వచ్చింది. నా చెల్లికి కూతురు పుట్టే వరకు నేను నాది అనుకోలేకపోయాను. ఆ బిడ్డ వల్లే మా రెండు కుటుంబాలు దగ్గరయ్యాయి. మా ఆయన అంటుంటాడు... అది వాళ్ల పిల్ల ఎప్పుడైనా ఇచ్చేయాలి అని, చిన్న బొమ్మనే ఇవ్వాలంటే మనసు ఒప్పలేదు, వాళ్ల పాపని వాళ్లకి ఇస్తుంటే ప్రాణం పోయినట్టు అనిపించింది... అందరి పిల్లలు నా దగ్గరికి వస్తుంటారు. కానీ నా పిల్లలే నా చేతుల్లోకి రావడం లేదు. భవిష్యత్తులో సుదీప కూడా తల్లి అవుతుందని అనుకుంటున్నాను’ అంటూ ఎంతో ఏడ్చింది సుదీప. ఆమె స్టోరీ ఇంటిలోని సభ్యులను చాలా కదిలించింది. తల్లి కావాలని గత ఏడేళ్లుగా సుదీప ఎదురుచూడడం కళ్లు చెమ్మగిల్లేలా చేసింది. 

ఆదిరెడ్డి కూడా తన కూతురు హద్విత గురించి చెప్పడం మొదలుపెట్టాడు. నాకు పిల్లలంటే ఇష్టం ఉండదని గీతక్కలాగే అంటూ ప్రారంభించాడు. ఇప్పటికీ తన భార్య అంటుంటుందని డెలివరీ రోజు తన పక్కన లేనని, అది తాను రిగ్రెట్ ఫీలవుతున్నానని చెప్పాడు. తన చెల్లెలు అంధురాలని, దాని వల్ల బంధువులు తన పాప కళ్లు కూడా తేడాగా ఉన్నాయని అన్నారని చెప్పుకొచ్చాడు. వెంటనే తాను వైద్యులను కలిసి పాప కళ్లు చూపించానని, ఎలాంటి సమస్యా లేదని చెప్పడంతో చాలా ఆనందపడ్డానని అన్నాడు. ఇంట్లోకి కొత్త సభ్యులు వస్తే ఎంత వెధవ అయిన కనెక్ట్ అయిపోతారని చెప్పుకొచ్చాడు.  

నా భార్య ప్రెగ్నెంట్
తన భార్య గర్భవతి అని, ఏడోనెల వచ్చి ఉంటుందని చెప్పాడు రేవంత్. తన భార్య వల్లే ఇక్కడికి వచ్చానని చెప్పుకొచ్చాడు. తనకి నాన్న అనే పిలుపు తెలియదని, ఎప్పుడెప్పుడా నాన్న అని పిలుచుకుంటానా అని వెయిట్ చేస్తున్నట్టు చెప్పాడు.బాబు పుడితే తండ్రి పేరు పెట్టుకుంటానని, కూతురు పుడితే లక్ష్మిదేవి పుట్టిందని అనుకుంటా అని చెప్పుకున్నారు.  మిగతా సభ్యులంతా తమ బాధను పంచుకున్నారు. 

చంటి మాట్లాడుతూ తల్లి తన కళ్ల ముందే మంటల్లో కాలిపోయిందన, తాను ఎవరనైనా ఇష్టపడితే అందరూ ఇలాగే దూరం అవుతారని అన్నాడు. తనకు ఇద్దరు కూతుళ్లని, వాళ్లిద్దరూ స్కూలుకెళ్లాక నిద్ర లేస్తానని, వారు పడుకున్నాక వస్తానని చెప్పారు. 

Also read: టీ ఎలా చేయాలో తెలియదు కానీ కెప్టెన్ అయిపోతాడంట, చంటి సెటైర్లు - డ్యాన్సులతో దద్దరిల్లిన ఇల్లు

Also read: నాలుగో నెలలో బిడ్డను పొగొట్టుకున్న మెరీనా - రోహిత్, ఎమోషన్‌తో నిండిపోయిన బిగ్‌బాస్ ఇల్లు

Published at : 16 Sep 2022 07:58 AM (IST) Tags: Bigg Boss Telugu Bigg Boss 6 Telugu Bigg boss 6 Telugu episode 12 Bigg boss Revanth Bigg boss sudeepa

సంబంధిత కథనాలు

Bandla Ganesh: 'భార్యని, బిడ్డల్ని ప్రేమించనోడు అసలు మనిషేనా' - పూరీ జగన్నాథ్‌పై బండ్ల గణేష్ కామెంట్స్!

Bandla Ganesh: 'భార్యని, బిడ్డల్ని ప్రేమించనోడు అసలు మనిషేనా' - పూరీ జగన్నాథ్‌పై బండ్ల గణేష్ కామెంట్స్!

Bigg Boss: బిగ్ బాస్ షోలో అశ్లీలత - ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు!

Bigg Boss: బిగ్ బాస్ షోలో అశ్లీలత - ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు!

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

Megastar Chiranjeevi: మరో రీమేక్‌పై చిరు ఫోకస్ - డైరెక్టర్ ఫైనల్ అయినట్లేనా?

Megastar Chiranjeevi: మరో రీమేక్‌పై చిరు ఫోకస్ - డైరెక్టర్ ఫైనల్ అయినట్లేనా?

Masooda Release Date : మూడు భాషల్లో సంగీత హారర్ డ్రామా 'మసూద' - విడుదలకు అంతా రెడీ

Masooda Release Date : మూడు భాషల్లో సంగీత హారర్ డ్రామా 'మసూద' - విడుదలకు అంతా రెడీ

టాప్ స్టోరీస్

యాదాద్రీశునికి కేజీ 16 తులాల బంగారం విరాళం - కేటీఆర్ కుమారుడి చేతుల మీదుగా ఇచ్చిన కేసీఆర్ !

యాదాద్రీశునికి కేజీ 16 తులాల బంగారం విరాళం -  కేటీఆర్ కుమారుడి చేతుల మీదుగా ఇచ్చిన కేసీఆర్ !

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ

Kanpur News: హాస్టల్‌లో అమ్మాయిల న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసిన స్వీపర్!

Kanpur News: హాస్టల్‌లో అమ్మాయిల న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసిన స్వీపర్!

Ponniyin Selvan Review - 'పొన్నియిన్ సెల్వన్' రివ్యూ : 'బాహుబలి' చూసిన కళ్ళకు నచ్చుతుందా? లేదా?

Ponniyin Selvan Review - 'పొన్నియిన్ సెల్వన్' రివ్యూ : 'బాహుబలి' చూసిన కళ్ళకు నచ్చుతుందా? లేదా?