News
News
X

Bigg Boss 6 Telugu Episode 10: ప్రతి ఆటలో రేవంతే టార్గెట్, మొదటి ఆటలో ఫైమా అడ్డుకుంటే, రెండోసారి గీతూ ఓడించింది

Bigg Boss 6 Telugu: కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో మళ్లీ గొడవలు సాగాయి.

FOLLOW US: 


Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ సీజన్ 6లో వచ్చిన కంటెస్టెంట్లు మొదటి వారం నుంచే ఆట ఆడడం మొదలుపెట్టేశారు. గొడవలు, పంచాయతీలు మొదటివారమే ప్రారంభమైపోయాయి. అవి రెండో వారానికీ కొనసాగాయి. ఎందుకో కొంతమంది  రేవంత్ నే టార్గెట్ చేసుకున్నట్టు కనిపిస్తున్నారు. మొదటి వారం నుంచి ఈ స్టార్ సింగర్ టార్గెట్ గా మారిపోయాడు. రెండో వారం జరిగిన కెప్టెన్సీ కంటెండెర్స్ టాస్క్ లో కూడా ఫైమా, గీతూ రేవంత్‌ను ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఎందుకో ప్రతిసారి రేవంత్ నే టార్గెట్ చేసుకుంటున్నారు. ఇక ఎపిసోడ్ విషయానికి వస్తే...

రేవంత్ - అర్జున్ కళ్యాణ్ నామినేషన్ల గురించి మాట్లాడుకున్నారు.అర్జున్ తనను నామినేట్ చేయడం అది కూడా వాసంతి, శ్రీసత్యలను సిస్టర్ అని పిలువు అన్నందుకు నామినేట్ చేయడంపై రేవంత్ మాట్లాడాడు. శ్రీ సత్య రేవంత్ నిన్ను ఉడికిద్దామని అన్నాడని అంతే అని రేవంత్ నే సపోర్ట్ చేసింది. అర్జున్ మాత్రం  ఆ విషయాన్ని కాసేపు లాగాడు. తరువాత కెప్టెన్ బాలాదిత్య రేవంత్ కి హితబోధలు చేశాడు. నామినేషన్స్ సమయంలో హైపర్ గా మాట్లాడడం తగ్గించుకోవాలని చెప్పాడు. తరువాత ఆరోహి - ఆర్జే సూర్య రాత్రి కూర్చుని మాట్లాడుకుంటూ కనిపించారు. బాలాదిత్య ఏం విషయంలో దొరకడం లేదని నామినేట్ చేయడానికి మాట్లాడుకున్నారు. 

మెరీనా - రోహిత్ రొమాన్స్
తెల్లవారడంతో బుట్ట బొమ్మ సాంగ్ తో ఇంటి సభ్యులను నిద్ర లేపారు బిగ్ బాస్. వీరిద్దరూ ఉదయం లేవగానే కాసేపు రొమాన్స్ చేస్తూ కనిపించారు. నాగార్జున మొన్నటి ఎపిసోడ్లో ‘నీకు లైసెన్స్ ఉంది, మీరు భార్యాభర్తలు’ అనడంతో రోహిత్ కాస్త ధైర్యం వచ్చినట్టు కనిపించింది. శ్రీ సత్య తనకు ఒంటరిగా కూర్చుని తినడం అంటే ఇష్టమని రేవంత్ తో వాదిస్తూ కనిపించింది. 

కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్
బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ‘కెప్టెన్సీ పోటీదారుల టాస్క్’ ఇచ్చారు. దానికి సిసింద్రీ అని పేరు పెట్టారు. ప్రతి ఒక్కరికీ ఒక బేబీ ఇస్తారని, వాటి బాగోగులు వారే చూసుకోవాలి. ఎవరైనా తమ బేబీని ఒంటరిగా వదిలేస్తే ఎవరైనా కూడా ఆ బేబీని ‘లాస్ట్ అండ్ ఫౌండ్’స్థానంలో పెట్టేస్తే  ఆ బేబీ తాలూకు ఇంటి సభ్యుడు టాస్క్ నుంచి తప్పుకున్నట్టే. కాగా సిసింద్రీలో టాస్క్ లు మొదలయ్యాయి. మొదటి టాస్క్  లో అయిదుగురు పోటీపడ్డారు. అందులో గోనెసంచి తొడుక్కుని పరిగెట్టుకుంటూ వెళ్లి షేప్స్ అరెంజ్ చేయాలి. ఇందులో ఫైమా కావాలనే రేవంత్ ను ఓడించింది. దీంతో ఆయన చాలా కోప్పడ్డాడు. చంటి ఈ టాస్క్ లో గెలిచారు. చంటిని కెప్టెన్ అవ్వాలని కోరుకున్నాడు రేవంత్. చంటి కెప్టెన్సీ పోటీదారుగా ఎంపికయ్యాడు. 

రేవంతే టార్గెట్
రేవంత్ గేమ్ ఆడటానికి బొమ్మను పక్కన పెట్టాడు. టాస్క్ పూర్తయ్యాక వెంటనే బొమ్మను తీసుకోలేదు. కాసేపు నిల్చుని రెస్ట్ తీసుకున్నాడు. ఈలోపు గీతూ అతని బొమ్మను తీసుకెళ్లి లాస్డ్ అండ్ ఫౌండ్ స్థానంలో వేసేశాడు. దీంతో రేవంత్ చాలా ఫీలయ్యాడు. తిరిగి మళ్లీ తీసి ఇచ్చింది. రేవంత్ మాత్రం మళ్లీ దాన్ని అక్కడే వదిలేశాడు. దీంతో బిగ్ బాస్ అతడిని కెప్టెన్సీ కంటెంబర్ టాస్క్ నుంచి తొలగించారు. రేవంత్ మాత్రం చాలా ఎమోషనల్ ఫీలయ్యాడు. నేను రాత్రి ఆ బొమ్మను పక్కన పెట్టుకుని పడుకుందామని, బిడ్డ అనే ఫీల్ పొందుదామని అనుకున్నాను అంటూ ఏడ్చాడు. దానికి మెరీనా రోహిత్ నువ్వు ఎందుకు బాధపడుతున్నావ్... మరో మూడు నెలల్లో నీకు బిడ్డ పుట్టబోతోంది అని ఓదార్చారు. 

మధ్యలో భోజనం చేస్తున్న సమయంలో గీతూ శ్రీ సత్య బొమ్మను తీసుకెళ్లి లాస్ట్ అండ్ ఫౌండ్ స్థానంలో పెట్టేసింది. దీంతో ఆమె కూడా కెప్టెన్సీ పోటీ దారుల టాస్క్ నుంచి తప్పుకుంది. ఫైమా వచ్చి రేవంత్ ను, శ్రీ సత్యను తనకు సపోర్ట్ చేయమని అడిగింది. ఇద్దరూ అందుకు ఒప్పుకున్నారు.  రెండో టాస్క్ కోసం అయిదుగురు పోటీదారులు ఎంపికయ్యారు. వారికి ఒక టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. రేవంత్ కు నేహా కు మధ్యలో కాసేపు వాగ్వాదం జరిగింది. 

Also read: ఇతరులను గౌరవించడం నేర్చుకో అంటూ రేవంత్ పై నేహా ఫైర్, ఆ బొమ్మ కోసం ఏడ్చిన రేవంత్

Also read: అందుకే నా ప్రేమ బ్రేకప్, కన్నీళ్లు పెట్టిస్తున్న ‘బిగ్ బాస్’ ఆరోహీ లవ్ స్టోరీ!

Published at : 14 Sep 2022 06:22 AM (IST) Tags: Bigg Boss 6 Telugu Bigg Boss 6 Telugu Revanth Biggboss Telugu Geethu Bigg boss Episodes full details

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!

Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!

టాప్ స్టోరీస్

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా  .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Jinping House Arrest: షాకింగ్! గృహ నిర్బంధంలో చైనా అధ్యక్షుడు- సైన్యం చేతిలోకి దేశం!

Jinping House Arrest: షాకింగ్! గృహ నిర్బంధంలో చైనా అధ్యక్షుడు- సైన్యం చేతిలోకి దేశం!

Bathukamma 2022 : తెలంగాణలో బతుకమ్మ వేడుకలు షురూ, నేడు ఎంగిలి పూల బతుకమ్మ

Bathukamma 2022 : తెలంగాణలో బతుకమ్మ వేడుకలు షురూ, నేడు ఎంగిలి పూల బతుకమ్మ