News
News
X

Bigg Boss Arohi: అందుకే నా ప్రేమ బ్రేకప్, కన్నీళ్లు పెట్టిస్తున్న ‘బిగ్ బాస్’ ఆరోహీ లవ్ స్టోరీ!

Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ ఆరోహి ఇప్పుడు ఎంతో మందికి పరిచయం ఉన్న పేరుగా మారిపోయింది.

FOLLOW US: 

Bigg Boss 6 Telugu: ఆరోహి... ఈ పేరు మొన్నటి వరకు పెద్దగా ఎవరికీ తెలియదు. ఆమెను చూసి పోలుస్తారేమో కానీ, పేరును మాత్రం గుర్తుపెట్టుకోరు. కానీ ఇప్పుడు ఈమె బిగ్ బాస్‌లో సందడి చేస్తోంది. అంతేకాదు అవసరం అయిన చోట తన గొంతును వినిపిస్తోంది. బిగ్‌బాస్ ఇంట్లో... గుంపులో గోవిందంలా కలిసిపోవడం కన్నా, తమ ఉనికిని కాపాడుకోవడమే నిజమైన టాస్క్. ఆ విషయంలో ఆరోహి మొదటి వారమే విజయవంతమైంది. కానీ మొదటి వారమే నామినేషన్లో ఉండి, ఎలిమినేషన్ గండం నుంచి తప్పించుకుంది. వయసులో చిన్నపిల్లే అయినా ఇతర సీనియర్ కంటెస్టెంట్లకి గట్టిపోటీనే ఇస్తోంది. ఇక ఆమె నిజజీవిత కథ మాత్రం కన్నీరు తెప్పించేలా ఉంది. 

కూలి పని చేసుకుని...
ఆరోహి బిగ్‌బాస్ కి రావడానికి కొన్ని రోజుల ముందే కొన్ని యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్య్వూ ఇచ్చి వచ్చింది. ఇప్పుడు అవి ట్రెండవుతున్నాయి. అందులో ఆమె వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంది. ఆమెకు అయిదేళ్ల వయసులోపే తల్లి చనిపోయింది. తండ్రి వేరే పెళ్లి చేసుకుని ఆరోహిని, ఆమె అన్నను వదిలి వెళ్లిపోయాడు. దీంతో అమ్మమ్మ చేరదీసింది. అన్నను హాస్టల్లో వేయడంతో అన్నాచెల్లెళ్ల మధ్య బంధం కూడా సరిగా లేదు. ఈమె అసలు పేరు అంజలి. యాంకరింగ్ ఫీల్డ్ లోకి వచ్చాక ఆరోహిగా పేరు మార్చుకుంది. ఆమె స్కూలు చదువుతూ కూలి పనులకు కూడా వెళ్లిందట. పత్తి ఏరడానికి, మిరప చేనులోని పనికి వెళ్లింది. ఆ డబ్బులను చదువుకు ఉపయోగించింది. అమ్మమ్మ వాళ్లింట్లో ఉండే తన చదువును పూర్తి చేసింది. డిగ్రీ చదువుతున్నప్పుడు వరంగల్ లోకల్ ఛానెల్ లో పనిచేసింది. నాలుగు వేలు జీతం వచ్చేది. షార్ట్ ఫిల్మ్‌కు డబ్బింగ్‌లు చెప్పడం, చిన్న చిన్న పాత్రల్లో నటించడం వంటివి చేసేది. వాటికి చాలా తక్కువ వచ్చినా,చదువు కోసం కంటిన్యూ చేసింది. ఎంబీఏ చదువును మధ్యలో వదిలేసి యాంకర్ గా అడుగుపెట్టింది.    

బ్రేకప్ అయ్యింది
అందరిలాగే తనకు కుటుంబం ఉంటే బావుంటుందని చాలాసార్లు అనిపిస్తుందని చెప్పింది ఆరోహి. తాను ఒకబ్బాయిని ప్రేమించానని, ఆ అబ్బాయి కూడా ప్రేమించాడు కానీ పెళ్లి పీటలు ఎక్కలేదని వివరించింది. దానిక్కారణం ఆరోహికి కుటుంబం లేకపోవడమే. ఆ పిల్లాడికి పెద్ద కుటుంబం ఉంది, కానీ ఆరోహికి లేదు. అదే బ్రేకప్‌కు కారణం అయ్యింది. ఫ్యామిలీ లేని అమ్మాయి వద్దంటూ అబ్బాయి తరుపు వారు నో చెప్పేశారు. కుటుంబం లేకపోవడమే తనకు పెద్ద సమస్యగా మారిపోయింది. కనీసం ఒక అబ్బాయిని ప్రేమించినా కూడా పెళ్లి చేయమని అడగడానికి ఇంట్లో పెద్దవాళ్లు ఎవరూ లేరని బాధపడుతూ చెబుతోంది ఆరోహి. ప్రస్తుతం ఎలాంటి లవ్ స్టోరీలు లేవంట. ఫ్యామిలీ లేని సింగిల్ ఉమెన్ ని చేసుకోవడానికి ఎవరూ ఇష్టపడరు అని, ఆస్తి,కుటుంబం లేని అమ్మాయిని ఎవరూ ఒప్పుకోరని తన అభిప్రాయాన్ని చెప్పుకుంది. అందుకే తాను పెద్దగా ప్రేమ, పెళ్లి గురించి ఎక్కువ ఆలోచించలేదని చెబుతోంది.  

అలవాటైపోయింది...
పాతికేళ్లుగా ఒంటరిగా బతకడం అలవాటైపోయింది ఆరోహికి. సమస్యలను అధిగమించడం, బాధలను భరించడం అన్నీ ఆమెకు ఆమెనే నేర్చుకుంది. ఇప్పుడు కూడా భవిష్యత్తులో జీవిత భాగస్వామి వచ్చినా అతనిలో అన్ని బాధలు షేర్ చేసుకుంటానో లేదో తెలియదని అంటోంది. ఇప్పుడు కూడా సమస్య వచ్చినా ఎవరితోనూ షేర్ చేసుకోనని తానే ఎదుర్కొంటానని అంటోంది. పాతికేళ్ల ఒంటరితనం తనకు నేర్పిన పాఠం అదేనని చెప్పుకొచ్చింది. 

View this post on Instagram
 
A post shared by Arohi Rao (@arohi_rao)

Also read: సిసింద్రీ టాస్క్‌లో రేవంత్ గెలవకుండా అడ్డుకున్న ఫైమా, ఫైర్ అయిన రేవంత్

Also read: నామినేషన్లో ఆ ఎనిమిది మంది, ఎక్స్‌ట్రాలు వద్దంటూ గీతూపై రేవంత్ ఫైర్, బిగ్‌బాస్ నిర్ణయాన్నే నామినేట్ చేసిన ఆది

Published at : 13 Sep 2022 03:32 PM (IST) Tags: Arohi Rao Biggboss Arohi TV9 Arohi Biggboss Telugu 6 Biggboss season 6

సంబంధిత కథనాలు

Nani's Dasara: నాని 'దసరా' సినిమా బిజినెస్ - అప్పుడే రూ.100 కోట్లు టచ్ చేసింది!

Nani's Dasara: నాని 'దసరా' సినిమా బిజినెస్ - అప్పుడే రూ.100 కోట్లు టచ్ చేసింది!

Bigg Boss Season 6: ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఎలక్షన్స్, సూర్యకు హ్యాండిచ్చిన ఇనయా - యాంగ్రీ మ్యాన్ కి కెప్టెన్సీ?

Bigg Boss Season 6: ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఎలక్షన్స్, సూర్యకు హ్యాండిచ్చిన ఇనయా - యాంగ్రీ మ్యాన్ కి కెప్టెన్సీ?

Vijay Deverakonda Rashmika: రౌడీ బాయ్‌తో రష్మిక మాల్దీవులకు టూర్? ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమైన జంట!

Vijay Deverakonda Rashmika: రౌడీ బాయ్‌తో రష్మిక మాల్దీవులకు టూర్? ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమైన జంట!

Bheeshma Parvam in Telugu: మమ్ముట్టి ‘భీష్మ పర్వం’ మూవీని రామ్ చరణ్ రీమేక్ చేయనున్నారా?

Bheeshma Parvam in Telugu: మమ్ముట్టి ‘భీష్మ పర్వం’ మూవీని రామ్ చరణ్  రీమేక్ చేయనున్నారా?

అహంకారానికి మమకారమే సమాధానం - గరికపాటి వివాదంపై బ్రహ్మాజీ, శ్రీనివాస కుమార్ సీరియస్ కామెంట్స్!

అహంకారానికి మమకారమే సమాధానం - గరికపాటి వివాదంపై బ్రహ్మాజీ, శ్రీనివాస కుమార్ సీరియస్ కామెంట్స్!

టాప్ స్టోరీస్

MP Laxman on BRS Party: బీఆర్ఎస్ పార్టీ పేరుతో మునుగోడులో గెలిచి చూపించండి - ఎంపీ లక్ష్మణ్

MP Laxman on BRS Party: బీఆర్ఎస్ పార్టీ పేరుతో మునుగోడులో గెలిచి చూపించండి - ఎంపీ లక్ష్మణ్

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐకి ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐకి ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల

Munugode TRS Candidate: మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్, విజయం తమదేనని ధీమా

Munugode TRS Candidate: మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్, విజయం తమదేనని ధీమా

Police Seized Money In Munugode: మునుగోడు నామినేషన్ల తొలిరోజే రెండు చోట్ల డబ్బు స్వాధీనం, నిఘా పెంచిన పోలీసులు

Police Seized Money In Munugode: మునుగోడు నామినేషన్ల తొలిరోజే రెండు చోట్ల డబ్బు స్వాధీనం, నిఘా పెంచిన పోలీసులు