Bigg Boss 5 Updates: ‘బిగ్ బాస్ 5’ ప్రోమో: మానస్ మనసులో లహరి.. శ్రీరామ్‌తో హమీదా రొమాన్స్.. రవి, కాజల్ కెమిస్ట్రీ క్లాసులు
బిగ్ బాస్‌లో ఈ రోజు కెమిస్ట్రీ క్లాసులు జరగనున్నాయి. ఆ బాధ్యతలను రవి, కాజల్ తీసుకున్నట్లు ప్రోమోలో చూపించారు.
‘బిగ్ బాస్ 5’ హౌస్‌లో కెమిస్ట్రీ క్లాసులు మొదలయ్యాయి. బిగ్ బాస్ ఆ బాధ్యతను రవి, కాజల్‌కు అప్పగించాడు. మొన్నటి వరకు టాస్కులతో వయొలెంట్‌గా కనిపించిన ఇంటి సభ్యులను శాంతపరిచేందుకు బిగ్ బాస్.. బిబీ న్యూస్ పేరుతో వినోదం పంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు తాజా ప్రోమో ద్వారా తెలుస్తోంది. ఇందులో రిపోర్టర్ అవతారమెత్తిన రవి, కాజల్‌లు ఇంట్లో మీకు ఇష్టమైన సభ్యులు ఎవరనే ప్రశ్నలు సంధిస్తు్న్నారు. ఈ సందర్భంగా శ్రీరామ్, మానస్‌ల మనసులో మాటలను తెలుసుకొనేందుకు ప్రయత్నించారు.
ఈ సందర్భంగా రవి.. ఇంటి సభ్యులందరీ మీకు నచ్చని సభ్యులు ఎవరని అడిగగా.. కాజల్ వెంటనే ‘రవి’ అని సమాధానమిచ్చింది. ఆ తర్వాత కాజల్ రవిని ప్రశ్నిస్తూ.. ‘‘రవిగారు మీకు పెళ్లం లేకపోయి ఉంటే.. ఈ ఇంట్లో ఏ అమ్మాయి మీరు లైన్ వేస్తారు?’’ అని ప్రశ్నించగా.. రవి తడుముకోకుండా ‘కాజల్’ అని సమాధానమిచ్చాడు. దీంతో కాజల్ కాసేపు షాకై ‘అరెహో’ అంటూ నవ్వేసింది. లోబో ఇంకా ఉమాదేవి తన ప్రేమ ట్రాక్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రేమ కనిపించడం లేదని పరేషన్‌లో ఉన్నానంటూ వాపోవడాన్ని ఈ ప్రోమోలో చూడవచ్చు.
ఆ తర్వాత రవి, కాజల్.. నటరాజ్‌ను ప్రశ్నించారు. అనంతరం శ్రీరామ్‌ను ప్రశ్నిస్తూ.. ప్రియాలో మీకు నచ్చిన క్వాలిటీ ఏమిటీ అని అడిగారు. ఇందుకు శ్రీరామ్ సమాధానమిస్తూ.. ‘‘ఆమె ఎప్పుడు తయారై వచ్చినా బార్బీ డాల్‌లా ఉంటుంది’’ అని తెలిపాడు. మానస్‌ను మరదలు, వైఫ్‌గా ఎవరు ఉంటే బాగుంటుందని అడిగితే.. ‘‘మరదలైతే ప్రియాంక అని, వైఫ్‌గా లహరి’’ అని సమాధానమిచ్చాడు. అయితే, మానస్ ఇటీవల ఎక్కువగా లహరి చుట్టూ తిరగడాన్ని ఇప్పటికీ మీరు గమనించి ఉంటారు. దీంతో ఒక లవ్ ట్రాక్ కన్ఫార్మ్ అని తెలుస్తోంది. అయితే, శ్రీరామ్.. హమీదా లవ్ ట్రాక్ మీదే ఇంకా సందేహాలు ఉన్నాయి. ఈ ప్రోమోలో హమీదా, శ్రీరామ్‌లు ‘‘మనోహర..’’ పాటకు డ్యాన్స్ చేస్తూ వేడి పుట్టించేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రోమో 2:
ఇంతకు ముందు విడుదల చేసిన ప్రోమోలో.. ‘బాల్ పట్టు.. లగ్జరీ బడ్జెట్ కొట్టు’ టాస్క్‌లో సభ్యులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. అనంతరం బిగ్ బాస్.. ఈ టాస్క్‌లో వరెస్ట్ పెర్ఫార్మర్, బెస్ట్ పెర్ఫార్మ్ ఎవరో చెప్పాలని సభ్యులను అడిగాడు. ఈ సందర్భంగా సభ్యుల మధ్య వాదోపవాదనలు, అలాగే ప్రియా, కాజల్ మధ్య కూడా గొడవలను ఈ ప్రోమోలో చూపించారు. ఈ వారం నామినేషన్లో ఉమ, నటరాజ్, కాజల్, లోబో, ప్రియాంక, యానీ, ప్రియా ఉన్నారు. వీరిలో ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారనేది ఆదివారం తేలిపోతుంది.
ప్రోమో 1: