Bigg Boss 5 Telugu: మొత్తానికి షణ్ముఖ్ కి ఛాన్స్ వచ్చిందిగా.. కెప్టెన్ గా రచ్చ చేస్తాడేమో..
గేమ్ సరిగ్గా ఆడకపోయినప్పటికీ.. షణ్ముఖ్ క్రేజ్ మాత్రం పెరిగిపోతుంది. ఇప్పుడిప్పుడు గేమ్ ఆడడం మొదలుపెట్టాడు.

బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొన్న కంటెస్టెంట్స్ లో షణ్ముఖ్ కి మంచి క్రేజ్ ఉంది. యూట్యూబ్ స్టార్ కావడంతో అతడిపై అందరి దృష్టి పడింది. మొదటి నుంచి కూడా హౌస్ లో తన ప్రవర్తనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. గేమ్ సరిగ్గా ఆడకపోయినప్పటికీ.. షణ్ముఖ్ క్రేజ్ మాత్రం పెరిగిపోతుంది. ఇప్పుడిప్పుడు గేమ్ ఆడడం మొదలుపెట్టాడు. ఇప్పటివరకు షణ్ముఖ్ హౌస్ లో కెప్టెన్ అవ్వలేదు.
Also Read: సిస్టర్ సెంటిమెంట్.. ఫ్యామిలీ ఎమోషన్స్.. రజినీకాంత్ మాస్ అవతార్..
అయితే ఈసారి ఆ ఛాన్స్ దక్కినట్లు తెలుస్తోంది. నిన్నటి నుంచి హౌస్ లో కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ టాస్క్ లో బిగ్ బాస్ ఇచ్చిన ఐదు ఛాలెంజ్ లలో ఎవరు గెలుస్తారో వాళ్లకు కెప్టెన్సీ టాస్క్ ఆడే ఛాన్స్ వస్తుంది. ఇప్పటికే షణ్ముఖ్ కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో గెలిచాడు. ఈరోజు రేపట్లో కెప్టెన్సీ టాస్క్ కూడా జరుగుతుంది. ఈ టాస్క్ లో షణ్ముఖ్ విజేతగా నిలిచినట్లు వార్తలొస్తున్నాయి.
తొలిసారి షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్ కి కెప్టెన్ అయ్యాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. అదే నిజమైతే షణ్ముఖ్ హౌస్ లో రచ్చ చేయడం ఖాయం. హౌస్ లో ఉన్న రవి అండ్ కో తో షణ్ముఖ్ కి సరిగ్గా పడడం లేదు. నిన్నటి ఎపిసోడ్ లో కూడా షణ్ముఖ్ గేమ్ లో ఎక్కడా కనిపించడంతో రవి అన్నాడు. కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ సమయంలో కూడా షణ్ముఖ్ తో విశ్వ చిన్న గొడవ పెట్టుకున్నాడు. కెప్టెన్ అయితే గనుక వీరందరికీ షణ్ముఖ్ సమాధానమిచ్చినట్లు అవుతుంది.
Also Read: 'దెబ్బకు థింకింగ్ మారిపోవాలా..' బాలయ్య ప్రోమో.. అదిరిపోయిందంతే..
Also Read: ‘దే కాల్ హిమ్ గని.. కనివిని ఎరుగని’ వరుణ్ తేజ్ మూవీ ఫుల్ సాంగ్ వచ్చేసింది
Also Read: ప్రీతమ్‌తో సమంత ఫొటో.. విదేశాలకు చెక్కేస్తున్నానంటూ..
Also Read: మెగా సినిమా షూటింగ్ కు ముహూర్తం పెట్టేశారు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Before You Go
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















