X

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్-5: సీక్రెట్ రూమ్‌కు లోబో.. హౌస్‌మేట్స్ మరీ అంత పిచ్చోళ్లా పెద్దాయనా??

‘బిగ్ బాస్’ సీక్రెట్ రూమ్ బిగ్ ఫ్లాప్ షోనా? ఈ వారం ఎలిమినేట్ అయ్యేది శ్వేత వర్మనా?

FOLLOW US: 

‘బిగ్ బాస్ -5’.. సీజన్ల తర్వాత సీజన్లు వస్తున్నాయి గానీ, టాస్కులు.. స్కిట్లలో మాత్రం మార్పులు ఉండటం లేదు. దీంతో సభ్యులు మారుతున్నారేగానీ.. మళ్లీ మళ్లీ అవే చూస్తున్న ఫీలింగ్ కలుగుతోంది. పైగా.. బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటరవుతున్న సభ్యులు కూడా అప్పటికే అన్ని సీజన్లు నమిలి మింగేశారు. దీంతో బిగ్ బాస్ పెట్టే ప్రతి టాస్క్, ప్రతి అడుగు గురించి వారికి పూర్తి అవగాహన ఉంది. ముఖ్యంగా ఆర్జే కాజల్‌కు.. ‘బిగ్ బాస్’ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాను ఏం చేస్తే ప్రేక్షకులు చూస్తారు.. ఏం చేస్తే.. బిగ్ బాస్‌లో తన ఎపిసోడ్ ప్రసారమవుతుందో తెలుసు. 

మిగతా సభ్యులకు ‘బిగ్ బాస్’ గురించి పూర్తి అవగాహన ఉంది. అలాంటివారికి ఊహించని ట్విస్ట్ ఇవ్వాల్సిన బిగ్ బాస్.. రొటీన్ ఫార్ములాను ప్రయోగించాడు. శనివారం ఎలిమినేషన్ అంటూ షాకిచ్చినా.. లోబోను బయటకు తీసుకెళ్లి.. సీక్రెట్ రూమ్‌కు పంపించారు. పైగా స్టేజ్ మీదకు రాగానే.. లోబోతో సభ్యుల గురించి పాజిటీవ్, నెగటీవ్ అభిప్రాయాలను కూడా చెప్పించలేదు. దీంతో హౌస్‌మేట్స్‌కు కూడా లోబో బయటకు వెళ్లడం లేదని అర్థమైపోయింది. అయితే, వారికి ఏమీ తెలియనట్లు డ్రామా నటిస్తున్నట్లు స్పష్టమవుతోంది. లోబో తమని సీక్రెట్ రూమ్ నుంచి గమనిస్తున్నాడనే సందేహం కూడా వారికి కలిగినట్లు కనిపిస్తోంది.

బిగ్ బాస్-4 తరహాలోనే..: గత సీజన్ తరహాలోనే ఈసారి కూడా సీక్రెట్ రూమ్ ఫార్ములా ఉపయోగించాడు. అప్పట్లో కూడా ఇంట్లో అర్హత లేని సభ్యుడిని ఎంపిక చేయాలని, వారిని బయటకు పంపే నిర్ణయం మీదేనంటూ బిగ్ బాస్ చెప్పడం.. ఫలితంగా అఖిల్ సీక్రెట్ రూమ్‌కు వెళ్లడం జరిగింది. అదే సీన్ ఈ సీజన్‌లో కూడా రిపీట్ అయ్యింది. అయితే, అఖిల్-అభి వల్ల సీక్రెట్ టాస్క్ చాలా ఆసక్తికరంగా సాగింది. అయితే, లోబో సీక్రెట్ రూమ్‌కు వెళ్లడం వల్ల బిగ్ బాస్‌కు పెద్ద లాభం ఉండదని.. అతడి బదులు మానస్ లేదా శ్రీరామ చంద్ర సీక్రెట్ రూమ్‌కు వెళ్లి ఉంటే రక్తికట్టేదని అంటుున్నారు. ఈ సీజన్‌లో సీక్రెట్ రూమ్ పెద్ద ఫ్లాప్ అని కూడా కామెంట్లు చేస్తున్నారు. తప్పకుండా కాజల్ ఇప్పటికే అందరి చెవుల్లో ఈ విషయాన్ని ఉదేసి ఉంటుందని ప్రేక్షకులు అంటున్నారు. 

Also Read: బిగ్ బాస్-5.. తల్లి సేఫ్.. కూతురు ఔట్.. ఈ రోజు ఎలిమినేట్ అయ్యేది ఆమే!

శ్వేత ఔట్: ‘బిగ్ బాస్ -5’ హౌస్‌లో అడుగుపెట్టిన రోజు నుంచి తల్లీ-కూతుళ్లుగా ప్రేమను వలకబోస్తున్న యానీ మాస్టర్, శ్వేత వర్మలకు ఇటీవల బిగ్ బాస్ గొడవలు పెట్టాడు. బొమ్మల టాస్క్‌లో యానీ మాస్టర్, శ్వేత మధ్య పెద్ద వారే జరిగింది. గత టాస్క్‌లో ఫ్రెండ్ పోయాడు, ఈ సారి బిడ్డ పోయిందంటూ యానీ భావోద్వేగానికి గురయ్యారు. ఆదివారం జరిగే ఎలిమినేషన్‌లో శ్వేత.. తన ఇంటికి వెళ్లేందుకు బట్టలు సర్దేసుకోనున్నట్లు తెలిసింది. ఈ వారం ఆమె ఎలిమినేట్ అవుతుందనేది పక్కా సమాచారం. 

Also Read: చేసింది చాలు రెచ్చగొట్టొద్దు .. మోహన్ బాబు కామెంట్స్ వైరల్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Bigg Boss 5 Telugu Bigg Boss 5 బిగ్ బాస్ 5 తెలుగు Lobo బిగ్ బాస్ 5 లోబో Sweta Varma Lobo secret room

సంబంధిత కథనాలు

Siddharth : టికెట్ రేట్లపై ఏపీ స‌ర్కార్‌కు హీరో సిద్ధార్థ్ కౌంట‌ర్‌!?

Siddharth : టికెట్ రేట్లపై ఏపీ స‌ర్కార్‌కు హీరో సిద్ధార్థ్ కౌంట‌ర్‌!?

Omicran Movie: ‘ఒమిక్రాన్’ ఇది వైరస్ కాదు 1963లో విడుదలైన సినిమా.. ట్విస్ట్ ఏమిటంటే...

Omicran Movie: ‘ఒమిక్రాన్’ ఇది వైరస్ కాదు 1963లో విడుదలైన సినిమా.. ట్విస్ట్ ఏమిటంటే...

Mega154 : సెట్స్‌కు వ‌చ్చిన మెగాస్టార్‌... నెర్వ‌స్‌లో డైరెక్ట‌ర్‌

Mega154 : సెట్స్‌కు వ‌చ్చిన మెగాస్టార్‌... నెర్వ‌స్‌లో డైరెక్ట‌ర్‌

Chiyaan61: ర‌జ‌నీకాంత్‌తో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేసిన ద‌ర్శ‌కుడితో విక్ర‌మ్‌... ద‌ళిత్ సినిమా క‌న్ఫ‌ర్మ్‌

Chiyaan61: ర‌జ‌నీకాంత్‌తో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేసిన ద‌ర్శ‌కుడితో విక్ర‌మ్‌... ద‌ళిత్ సినిమా క‌న్ఫ‌ర్మ్‌

Ileana D'cruz: బికినీ షోలో ఇలియానా తర్వాతే ఎవరైనా అనేలా...

Ileana D'cruz: బికినీ షోలో ఇలియానా తర్వాతే ఎవరైనా అనేలా...
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Samsung Galaxy A13 5G: అత్యంత చవకైన శాంసంగ్ 5జీ ఫోన్ వచ్చేసింది.. లాంచ్ చేసిన కంపెనీ.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Samsung Galaxy A13 5G: అత్యంత చవకైన శాంసంగ్ 5జీ ఫోన్ వచ్చేసింది.. లాంచ్ చేసిన కంపెనీ.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

AP NGT Polavaram : పర్యావరణ అనుమతుల ఉల్లంఘన.. ఏపీ ప్రాజెక్టులకు ఎన్జీటీ రూ. 120 కోట్ల జరిమానా !

AP NGT Polavaram :  పర్యావరణ అనుమతుల ఉల్లంఘన.. ఏపీ ప్రాజెక్టులకు ఎన్జీటీ రూ. 120 కోట్ల జరిమానా !

OnePlus RT: వన్‌ప్లస్ ఆర్‌టీ ధర లీక్.. 9 సిరీస్ కంటే తక్కువే.. ఎంతంటే?

OnePlus RT: వన్‌ప్లస్ ఆర్‌టీ ధర లీక్.. 9 సిరీస్ కంటే తక్కువే.. ఎంతంటే?

IND Vs NZ: భారత్, న్యూజిలాండ్ రెండో టెస్టు రేపే.. తెలుగు తేజానికి అవకాశం దక్కేనా?

IND Vs NZ: భారత్, న్యూజిలాండ్ రెండో టెస్టు రేపే.. తెలుగు తేజానికి అవకాశం దక్కేనా?