Bhagavanth Kesari: బాలయ్యా మజాకా!, సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న 'భగవంత్ కేసరి' గణేష్ యాంథమ్!
బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 'భగవంత్ కేసరి'లో మొదటి పాట 'గణేష్ యాంథమ్'ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ సాంగ్ ట్రెండింగ్ లో నెంబర్ వన్ గా నిలిచి సత్తా చాటుతోంది.
టాలీవుడ్ సీనియర్ హీరో, నటసింహం నందమూరి బాలకృష్ణ ఫుల్ జోష్ లో దూసుకెళ్తున్నారు. వరుస బ్లాక్ బస్టర్లతో దుమ్మురేపుతున్నారు. ఈ ఏడాది ఆరంభంలో 'వీరసింహారెడ్డి' సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రూ.100 కోట్ల కలెక్షన్స్ ని అందుకుని రికార్డ్స్ క్రియేట్ చేసింది. 'అఖండ' సినిమా కంటే ముందు బాలయ్య నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రూ.50 కోట్ల మార్క్ అందుకున్న దాఖలాలే లేవు. కానీ 'అఖండ' సినిమాతో ఆయన రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఆయన ఏ సినిమా చేసినా బాక్సాఫీస్ వద్ద ఈజీగా రూ.100 కోట్ల కలెక్షన్స్ అందుకోవడం గ్యారెంటీ అయ్యింది.
యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న 'గణేష్ యాంథమ్'
ప్రస్తుతం బాలయ్య, కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'భగవంత్ కేసరి' అనే సినిమా చేస్తున్నారు. బాలకృష్ణ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ పై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ఈ సినిమాపై ఆడియన్స్ లో విపరీతమైన క్యూరియాసిటిని పెంచాయి. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాట 'గణేష్ యాంథమ్'ను మేకర్స్ విడుదల చేశారు. బాలయ్యలోని ఎనర్జీని, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ను ఈ పాటలో అద్భుతంగా చూపించారు. శ్రీలీల ఎక్స్ ప్రెషన్స్ అదుర్స్ అనిపించాయి. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపు ఊపేస్తోంది. థమన్ అందించిన మ్యూజిక్ మాస్ జనాలను అద్భుతంగా ఆకట్టుకుంటోంది. ఈ లిరికల్ వీడియో ఇప్పటికే 12 మిలియన్ల వ్యూస్‌ని దాటుకుని జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. యూట్యూబ్ మ్యూజిక్‌లో నంబర్ 1 ట్రెండింగ్‌లో ఉంది.
హీరోయిన్ గా నటిస్తున్న కాజల్ అగర్వాల్
'భగవంత్ కేసరి' చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి భారీ నిర్మాణ వ్యయంతో రూపొందిస్తున్నారు. తెలంగాణ నేటివిటీతో తండ్రీ కూతుర్ల బాండింగ్ నేపథ్యంలో ఈ సినిమా కథ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. యువ కథానాయిక శ్రీ లీల బాలయ్య కూతురి పాత్రలో కనిపించబోతోంది. నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. బాలకృష్ణకు సోదరుడిగా ఆయన నటించనున్నట్లు తెలుస్తోంది. పాలక్ లల్వానీకి కీలక పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు.. సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా, తమ్మి రాజు ఎడిటర్‌గా, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. యాక్షన్ పార్ట్‌కి వి వెంకట్ కొరియోగ్రఫీ చేయనున్నారు. 'భగవంత్ కేసరి' అక్టోబర్ 19న భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రానుంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial