Chor Bazaar: ఆకాష్ పూరి 'చోర్ బజార్'కి బాలకృష్ణ సపోర్ట్
ఆకాష్ పూరి నటిస్తోన్న 'చోర్ బజార్' ట్రైలర్ ను బాలకృష్ణ విడుదల చేయనున్నారు.
ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న సినిమా 'చోర్ బజార్'. గెహన సిప్పీ నాయికగా నటిస్తోంది. 'దళం', 'జార్జ్ రెడ్డి' సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతోంది.
లవ్, యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడేమో ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. గురువారం (రేపు) నటసింహం బాలకృష్ణ ఈ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. తాజాగా హీరో ఆకాష్ పూరి, గెహనా సిప్పీ ఒక వీడియో ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆకాష్ తండ్రి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ 'పైసా వసూల్' చిత్రంలో నటించారు.
అప్పటినుంచి బాలకృష్ణతో పూరి కుటుంబానికి మంచి అనుబంధం ఏర్పడింది. దాంతో ఆకాష్ సినిమాకు సపోర్ట్ చేసేందుకు ఎంత బిజీగా ఉన్నా బాలకృష్ణ ఒప్పుకున్నారు. ఆయనకు చిత్రబృందం థాంక్స్ తెలియజేశారు. ప్రచార కార్యక్రమాలు జోరందుకున్న 'చోర్ బజార్' సినిమా త్వరలో థియేటర్ ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.
ఈ చిత్రంలో ఆకాశ్ పూరి దొంగగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. కార్ల టైర్ల నుంచి బైక్ పార్టుల వరకు ప్రతిదీ ఎత్తేస్తూ చోర్ బజార్‌లో అమ్మేయడం ఈ గ్యాంగ్ పని. పాతబస్తీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.
Also Read: రోలెక్స్ సర్ కి రోలెక్స్ గిఫ్ట్ ఇచ్చిన కమల్ - రేటెంతో తెలుసా?
Also Read: మా సినిమా బ్రాహ్మణుల మనోభావాలను కించపరిచేలా ఉండదు - 'అంటే సుందరానికీ' దర్శకుడు వివేక్ ఆత్రేయ
#Chorbazaar Trailer releasing tomorrow by Nandamuri #Balakrishna garu #ChorbazaarTrailerTomorrow @ActorAkashPuri @gehna_sippy @GeorgeReddyG1 @Vsraju_subbu @IVProductions_ @LahariMusic @GskMedia_PR pic.twitter.com/4QN84PRwHb
— I V Productions (@IVProductions_) June 8, 2022
View this post on Instagram