By: ABP Desam | Updated at : 25 Jan 2023 02:56 PM (IST)
బాలకృష్ణ
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కు డ్యూయల్ రోల్స్ బాగా కలిసి వచ్చాయి. గత పదేళ్ళ కాలంలో ఆయన చేసిన సినిమాలు చూస్తే... లేటెస్ట్ సంక్రాంతి హిట్ 'వీర సింహా రెడ్డి', అంతకు ముందు 'అఖండ', 'లెజెండ్', 'సింహా' సినిమాల్లో డ్యూయల్ రోల్ చేశారు. ఇలా చెబుతూ వెళితే చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు సెట్స్ మీద ఉన్న సినిమాలో కూడా ఆయన డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు టాక్.
అనిల్ రావిపూడి సినిమాలో... ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమాలో నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఆయన డ్యూయల్ రోల్ చేస్తున్నారట. ఒకటి తండ్రి రోల్ అని, మరొకరి యంగ్ రోల్ అని సమాచారం. అయితే, దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాలో బాలకృష్ణ తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు. ఫిబ్రవరి నుంచి సినిమా లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.
నందమూరి అందగాడితో తెలుగు తెర చందమామ జోడీ కడుతోంది. బాలకృష్ణ - అనిల్ రావిపూడి సినిమాలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) కథానాయికగా నటించనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించనున్నారు.
బాలకృష్ణతో కాజల్ తొలి చిత్రమిది!
బాలకృష్ణ, కాజల్ కలయికలో తొలి చిత్రమిది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తేజ దర్శకత్వం వహించిన 'లక్ష్మీ కళ్యాణం' సినిమాతో కాజల్ కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన 'బృందావనం', 'టెంపర్' సినిమాల్లో నటించారు. ఇప్పుడు బాలయ్యతో సినిమా చేస్తున్నారు. దీని కంటే ముందు బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ కాంబినేషన్ రెండు మూడు సినిమాలకు పరిశీలనలోకి వచ్చింది. అయితే, ఇప్పటికి కుదిరింది.
Also Read : పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'లో యువ హీరోకి ఛాన్స్ - సిరీస్ నుంచి సినిమాకు
బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమాలో కథానాయికగా తొలుత హిందీ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. ఓ దశలో ప్రియాంకా జవాల్కర్ పేరు బలంగా వినిపించింది. ఆమెకు ఆడిషన్, లుక్ టెస్ట్ కూడా చేశారు. దాదాపు ఆమెను ఫైనలైజ్ చేశారని కూడా ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపించింది. అయితే... ఎందుకో చివరి క్షణంలో ఆమె చేతిలో నుంచి అవకాశం చేజారింది.
Also Read : 'పఠాన్' రివ్యూ : కింగ్ ఖాన్ షారుఖ్ ఈజ్ బ్యాక్! మరి, సినిమా ఎలా ఉంది?
ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ 108వ చిత్రమిది. అందుకని, NBK 108 వర్కింగ్ టైటిల్ పెట్టారు. డిసెంబర్ నెలాఖరులో సినిమా కోసం వేసిన భారీ జైలు సెట్‌లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. వెంకట్ మాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫీ ఫైట్స్ తీశారు.
ఎన్‌బికె 108లో శరత్ కుమార్!
వినోదంతో పాటు వాణిజ్య విలువలు జోడించి వరుస విజయాలు అందుకుంటున్న అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ సినిమాలో నటుడు శరత్ కుమార్ (Sarathkumar) కూడా ఉన్నారు. ఫస్ట్ షెడ్యూల్ షూటింగులో ఆయన కూడా పాల్గొన్నారు. బాలకృష్ణ, శరత్ కుమార్ సహా ఇతర ప్రధాన తారాగణం మీద కీలక సన్నివేశాలు తెరక్కించినట్టు నిర్మాతలు తెలిపారు.
శ్రీలీల క్యారెక్టర్ ఏంటి?
తండ్రీ కుమార్తెల ఈ సినిమా రూపొందుతోందని ఫిల్మ్ నగర్ టాక్. బాలకృష్ణకు ఈ సినిమా కొత్తగా ఉంటుందని, ఆయనకు డిఫరెంట్ ఇమేజ్ తీసుకు వస్తుందని టాక్. బాలకృష్ణను దృష్టిలో పెట్టుకుని అనిల్ రావిపూడి పవర్ ఫుల్ స్క్రిప్ట్ రాశారని చిత్ర బృందం చెబుతోంది. ఈ సినిమాలో కుమార్తె పాత్రకు 'పెళ్లి సందడి', లేటెస్ట్ మాస్ మహారాజా రవితేజ హిట్ 'ధమాకా' ఫేమ్ శ్రీ లీల (Sree Leela) ఎంపిక అయ్యారు. అయితే, ఆమె ఎవరి కుమార్తెగా నటిస్తున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇందులో మరో హీరోయిన్ అంజలి (Anjali) కూడా ఈ సినిమాలో ఉన్నారు. ఆమెది విలన్ రోల్ అని టాక్. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
Ennenno Janmalabandham February 3rd: యష్, వేద క్యూట్ రొమాన్స్- పెళ్లి చేసుకుంటానని మాళవికకి మాటిచ్చిన అభిమన్యు
K. Viswanath: భక్తిలో అయినా ప్రేమలో అయినా తన్మయత్వం ఒకటే -విశ్వనాథ్ సినిమాలో ఈ ఒక్క పాట చాలు
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?
K Viswanath Death: టాలీవుడ్‌ను ఖండాంతరాలకు తీసుకు వెళ్ళారు, తీరని లోటు - విశ్వనాథునికి చిరంజీవి, ఎన్టీఆర్, మమ్ముట్టి నివాళులు
K.Viswanath: చిరంజీవితో విశ్వనాథ్‌కు ప్రత్యేక అనుబంధం - కళా తపస్విని కన్నతండ్రిలా భావించే మెగాస్టార్!
YSRCP Tensions : వైఎస్ఆర్సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?
KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?
K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక
Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!