News
News
X

NBK107 Title Launch : 'సింహా' కలిసొచ్చేలా - బాలకృష్ణ NBK107 సినిమా టైటిల్ ఇదే

NBK107 Title Announcement : నట సింహం నందమూరి బాలకృష్ణ కొత్త సినిమాకు 'వీర సింహారెడ్డి' టైటిల్ ఖరారు చేశారు. ఈ రోజు కర్నూల్ కొండారెడ్డి బురుజు దగ్గర అభిమానుల సమక్షంలో టైటిల్ ప్రకటించారు.

FOLLOW US: 
 
నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అభిమానులకు సూపర్ కిక్ ఇచ్చే న్యూస్ ఇది. గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఓ సినిమా నిర్మిస్తున్నారు. హీరోగా బాలకృష్ణకు 107వ సినిమా ఇది. దీనికి 'వీర సింహారెడ్డి' (Veera Simha Reddy) టైటిల్ ఖరారు చేశారు. ఈ రోజు కర్నూలులో కొండారెడ్డి బురుజు దగ్గర అభిమానుల సమక్షంలో జరిగిన కార్యక్రమంలో టైటిల్ వెల్లడించారు. 

సింహా సెంటిమెంట్ కంటిన్యూ చేశారు!
NBK 107 Title - Veera Simha Reddy : 'సమర సింహా రెడ్డి', 'నరసింహ నాయుడు', లక్ష్మీ నరసింహ', 'జై సింహ' 'బొబ్బిలి సింహ' - సింహ టైటిల్‌లో వచ్చిన బాలకృష్ణ ప్రతి సినిమా బాక్సాఫీస్ బరిలో భారీ విజయం నమోదు చేసింది. అంతే కాదు... ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు గోపీచంద్ మలినేని సినిమాకు 'వీర సింహా రెడ్డి' టైటిల్ ఖరారు చేయడంతో ఇదీ భారీ హిట్ అని నందమూరి అభిమానులు సంతోషంగా చెబుతున్నారు. ఈ చిత్రానికి God Of Masses అనేది ఉపశీర్షిక. 

సంక్రాంతికి 'వీర సింహా రెడ్డి'
Veera Simha Reddy Release Date : బాలకృష్ణ - గోపీచంద్ మలినేని సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది? అనేది కొన్ని రోజులుగా సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది. ఈ రోజు టైటిల్ ప్రకటనతో పాటు విడుదల తేదీ విషయంలోనూ స్పష్టత ఇచ్చారు. సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు వెల్లడించారు. 'జై సింహా' కూడా సంక్రాంతికి విడుదలై భారీ విజయం సాధించింది. 

Also Read : 'ప్రిన్స్' రివ్యూ : శివకార్తికేయన్, 'జాతి రత్నాలు' దర్శకుడి సినిమా ఎలా ఉందంటే?

News Reels

View this post on Instagram
 
A post shared by Mythri Movie Makers (@mythriofficial)

టర్కీలో ఊర మాస్ ఫైట్... పాట!
ఆ మధ్య టర్కీలోని ఇస్తాంబుల్‌లో బాలకృష్ణ, ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా... నెల రోజులకు పైగా షూటింగ్ చేశారు. ఆ షెడ్యూల్‌లో రామ్ - లక్ష్మణ్ మాస్టర్స్ నేతృత్వంలో భారీ ఊర మాస్ ఫైట్ తీశారు. ఆ వీడియోస్ నెట్టింట లీక్ అయ్యాయి. బాలకృష్ణ కట్టి పట్టుకుని ప్రత్యర్థులను ఊచకోత కోస్తున్న వీడియో అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఆ ఫైట్ తీయడానికి ముందు... బాలకృష్ణ, హీరోయిన్ శ్రుతీ హాసన్ (Shruti Hassan) మీద ఒక పాట తీశారు. దానికి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. 

వరలక్ష్మీ... హానీ రోజ్ కూడా!
శ్రుతీ హాసన్ కాకుండా NBK107లో మరో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. అందులో మలయాళ భామ హానీ రోజ్ (Honey Rose) ఒకరు. తన క్యారెక్టర్ టిపికల్ తెలుగు సినిమా హీరోయిన్ తరహాలో ఉంటుందని ఆమె పేర్కొన్నారు. తమిళ అమ్మాయి వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalakshmi Sarathkumar) కీలక పాత్ర చేస్తున్నారు. 'చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రవి ప్రత్యేక గీతంలో స్టెప్పులు వేశారు. ఇందులో ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి పాత్రలో కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్ రోల్ చేస్తున్నారు. ఇంకా మలయాళ నటుడు లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ప్రధాన పాత్రలు చేస్తున్నారు.

Published at : 21 Oct 2022 08:17 PM (IST) Tags: Balakrishna Shruti Haasan Gopichand Malineni NBK 107 Balakrishna New Movie Veera Simha Reddy

సంబంధిత కథనాలు

Jagamemaya Trailer: ‘జగమే మాయ’ ట్రైలర్ - వామ్మో, ఈ అమ్మాయ్ చాలా ‘చిత్ర’మైనది!

Jagamemaya Trailer: ‘జగమే మాయ’ ట్రైలర్ - వామ్మో, ఈ అమ్మాయ్ చాలా ‘చిత్ర’మైనది!

Bigg Boss 6 Telugu: ఇంటి సభ్యులకు చుక్కలు చూపిస్తున్న బిగ్‌బాస్, విన్నర్ ప్రైజ్ మనీ పెంచేందుకు వింత టాస్కులు

Bigg Boss 6 Telugu: ఇంటి సభ్యులకు చుక్కలు చూపిస్తున్న బిగ్‌బాస్, విన్నర్ ప్రైజ్ మనీ పెంచేందుకు వింత టాస్కులు

Keerthy Suresh: నన్ను కమిట్మెంట్ అడిగితే అదే చెప్తా - కాస్టింగ్ కౌచ్‌పై కీర్తి సురేష్

Keerthy Suresh: నన్ను కమిట్మెంట్ అడిగితే అదే చెప్తా - కాస్టింగ్ కౌచ్‌పై కీర్తి సురేష్

Tamannaah Interview : 'గుర్తుందా శీతాకాలం' ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ఓపెన్ అయిన తమన్నా

Tamannaah Interview : 'గుర్తుందా శీతాకాలం' ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ఓపెన్ అయిన తమన్నా

Mirzapur season 3: ‘మీర్జాపూర్’ సీజన్ 3 అప్‌డేట్ - ఎమోషనల్ పోస్టుతో గుడ్డూ భయ్యా గుడ్ న్యూస్!

Mirzapur season 3: ‘మీర్జాపూర్’ సీజన్ 3 అప్‌డేట్ - ఎమోషనల్ పోస్టుతో గుడ్డూ భయ్యా గుడ్ న్యూస్!

టాప్ స్టోరీస్

YS Sharmila: కేసీఆర్ అంటే కొట్టి చంపే రాజ్యాంగం, తెలంగాణలో ఇదే అమలవుతోంది: వైఎస్ షర్మిల

YS Sharmila: కేసీఆర్ అంటే కొట్టి చంపే రాజ్యాంగం, తెలంగాణలో ఇదే అమలవుతోంది: వైఎస్ షర్మిల

TDP Leader Narayana : మాజీ మంత్రి నారాయణకు రిలీఫ్ - బెయిల్ కొనసాగిస్తూ హైకోర్టు తీర్పు !

TDP Leader Narayana :  మాజీ మంత్రి నారాయణకు రిలీఫ్ -  బెయిల్ కొనసాగిస్తూ హైకోర్టు తీర్పు !

Assistant Professor Jobs: వైద్యశాఖలో 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!

Assistant Professor Jobs: వైద్యశాఖలో 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!

Vizag Woman Murder: విశాఖలో డ్రమ్ములో మహిళ డెడ్ బాడీ కేసు ఛేదించిన పోలీసులు, ట్విస్ట్ మామూలుగా లేదు

Vizag Woman Murder: విశాఖలో డ్రమ్ములో మహిళ డెడ్ బాడీ కేసు ఛేదించిన పోలీసులు, ట్విస్ట్ మామూలుగా లేదు