అన్వేషించండి

Vaishnavi Chaitanya: ‘బేబీ’తో బడా ఆఫర్ కొట్టేసిన వైష్ణవి చైతన్య - ఆ ప్రముఖ నిర్మాణ సంస్థతో ఒప్పదం?

‘బేబీ’ సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించింది వైష్ణవి చైతన్య. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ బ్యూటీ పేరే వినిపిస్తోంది. తాజాగా ఈ అమ్మడు గురించి మరో బిగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Vaishnavi Chaitanya: దర్శకుడు సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ‘బేబీ’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ లు ప్రధాన పాత్రల్లో కనిపించారు. ప్రస్తుతం మూవీ థియేటర్లలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. ముఖ్యంగా ఈ మూవీలో నటించిన నటీనటులకు యూత్ లో మంచి క్రేజ్ వచ్చేసింది. హీరోయిన్ గా చేసిన వైష్ణవి చైతన్య నటనకు మంచి మార్కులు దక్కుతున్నాయి. తాజాగా వైష్ణవి గురించి మరో వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. వైష్ణవి త్వరలో ప్రముఖ నిర్మాణ సంస్థలో లో ఓ సినిమా చేస్తుందని టాక్ వస్తోంది. దీంతో వైష్ణవి పేరు మరోమారు ఇండస్ట్రీలో మారుమోగుతోంది. 

గీతా ఆర్ట్స్ లో వైష్ణవి చైతన్య..

ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘బీబీ’ హీరోయిన్ వైష్ణవి చైతన్య పేరే వినబడుతోంది. ‘బేబీ’ సినిమా సక్సెస్ కావడంతో ఈ బ్యూటీకు ఫుల్ క్రేజ్ వచ్చేసింది. ఇదే క్రేజ్ తో ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ లో సినిమా చేసే చాన్స్ కొట్టేసిందట వైష్ణవి. ఇప్పుడిదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే గీతా ఆర్ట్స్ లో వైష్ణవి సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన లేడీ ఓరియెంటెడ్ కథ కూడా రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై ‘బేబీ’ సక్సెస్ మీట్ లో అల్లు అరవింద్ లీకులిచ్చారు కూడా. అలాగే అల్లు శిరీష్ తో కూడా వైష్ణవి మరో సినిమా చేయనుందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇప్పటికే అందుకు సంబంధించిన ప్లానింగ్స్ కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇక ‘బేబీ’ సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ సైతం మూవీలో వైష్ణవి నటనకు ఫిదా అయిపోయారు. ఈ విషయాన్ని సక్సెస్ మీట్ లో చెప్పి వైష్ణవిపై ప్రశంసల వర్షం కురిపించారు. గతంలో అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలో వైష్ణవి అల్లు అర్జున్ కు సిస్టర్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఇలా అల్లు ఫ్యామిలీ బ్లెసింగ్స్ తో వైష్ణవి మరో బిగ్ ప్రాజెక్ట్ లో చాన్స్ కొట్టేసిందని టాక్. మరి ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలను ఎప్పుడు వెల్లడిస్తారో చూడాలి. 

కెరీర్ ప్రారంభంలో టిక్ టాక్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్ రీల్స్, డబ్ స్మాష్ వీడియోలతో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుందీ బ్యూటీ. తర్వాత మెల్లగా షార్ట్ ఫిల్మ్ లలో నటించింది. ఆమె నటించిన పలు షార్ట్ ఫిల్మ్స్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి కూడా. తర్వాత పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. ఆమె నటించిన ‘సాఫ్ట్వేర్ డెవలపర్స్’ వెబ్ సిరీస్ ఆమెకు మంచి క్రజ్ ను తెచ్చిపెట్టింది. అయితే చాలా రోజులు సినిమా అవకాశాల కోసం ఎదురు చూసినా ఒక్కటీ రాలేదు. అయితే యూట్యూబ్, సోషల్ మీడియాలో మాత్రం అదే ఫాలోయింగ్ ను మెయిన్టైన్ చేస్తూ వచ్చింది. దీంతో ఎట్టకేలకు ‘బేబీ’ లాంటి మంచి కథ దొరకడంతో వైష్ణవి ఫేట్ మారిపోయింది. ఈ మూవీ మంచి సక్సెస్ అవ్వడంతో ఆమెకు ఇప్పుడు వరుసగా బిగ్ స్క్రీన్ ఆఫర్లు వస్తున్నాయి. మరి మున్ముందు వైష్ణవి ఎలాంటి సినిమాల్లో కనిపిస్తుందో చూడాలి. 

Also Read: ‘గుంటూరు కారం’ నుంచి మరొకరు ఔట్ - మహేష్ వెకేషన్‌కు వెళ్లిన ప్రతిసారీ ఇదే జరుగుతుందా?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget