By: ABP Desam | Updated at : 04 Dec 2022 04:10 PM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@RMMKavalargal/twitter
గత కొంతకాలంగా సినిమా పరిశ్రమలో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. బడా హీరోల బర్త్ డే సందర్భంగా 4K పేరుతో సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో మహేష్ బాబు, పవన్ కల్యాణ్ లాంటి హీరోల సినిమాలను వారి పుట్టిన రోజుల సందర్భంగా విడుదల చేశారు. అభిమానుల నుంచి ఈ సినిమాల ప్రదర్శనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా కూడా రీ రిలీజ్ కు రెడీ అవుతోంది. డిసెంబర్ 12న రజనీ కాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన ‘బాబా’ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ లింక్ ను రజనీకాంత్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. తన మనసుకు నచ్చిన సినిమా త్వరలో రీ రిలీజ్ కాబోతుందని వెల్లడించారు.
A film that will forever be closest to my heart … #Baba remastered version releasing soon 🤘🏻#BaBaReRelease https://t.co/vUaQahyHlA
— Rajinikanth (@rajinikanth) December 3, 2022
గతంలో సినిమాలను రీ రిలీజ్ అంటే కేవలం ఉన్నది ఉన్నట్లుగానే ప్రదర్శించారు. అయితే, రజనీకాంత్ ‘బాబా’ సినిమా విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేసి విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కొన్ని అదనపు సీన్లు యాడ్ చేస్తున్నారట. వీటికి కోసం ఇప్పటికే రజనీకాంత్ డబ్బింగ్ కూడా చెప్పారు. తాజాగా ఆయన డబ్బింగ్ చెప్తున్న ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అటు కొన్ని సీన్లు తీసేసినట్లు సమాచారం. మరోవైపు బ్యాగ్రౌండ్ స్కోర్ లో కొన్ని మార్పులు చేయాలని భావిస్తున్నారట. ఇందుకోసం మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్. రెహమాన్ ను కూడా సంప్రదించిందట మూవీ టీమ్. ఇప్పటికే ఆ పనులన్నీ పూర్తయినట్లు తెలుస్తోంది.
రజనీకాంత్ నటించిన ‘బాబా’ మూవీ 2002లో విడుదల అయింది. ‘నరసింహ’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రజనీ మూడేళ్ళు గ్యాప్ ఇచ్చి ఈ చిత్రాన్ని చేశారు. సురేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదల అయింది. అప్పట్లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించారు. మనీషా కొయిరాల హీరోయిన్ గా చేసిన ఈ సినిమా ఆగస్టు 15 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రజనీ కాంత్ ఈ సినిమాలో హీరోగానే కాకుండా కథ, స్క్రీన్ ప్లే, నిర్మాతగా వ్యవహరించారు. సినిమా విడుదల తర్వాత పూర్తి నెగిటివ్ టాక్ రావడంతో డిజాస్టర్ గా మిగిలింది. ‘బాబా’ సినిమా వచ్చి దాదాపు 20 ఏళ్ళు పూర్తయింది. మళ్లీ ఇప్పుడు ఆ సినిమాను రజనీకాంత్ బర్త్ డే సందర్భంగా సరికొత్త మెరుగులద్ది ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. సినిమా అప్పట్లో ఫ్లాప్ గా నిలిచినప్పటికీ ఇందులో రజనీ డైలాగ్స్, పాటలను అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. Read Also: ‘జబర్దస్త్’ పవిత్ర ఇల్లు చూశారా? నాన్న లేరు, ఇంటి బాధ్యతలన్నీ ఆమెవే, ఆ నవ్వుల వెనుక ఎంత బాధ!
Posani Krishna Murali: ఆ అవమానం తట్టుకోలేక చనిపోయారు, తండ్రి గురించి చెప్తూ కంటతడి పెట్టిన పోసాని
అప్పుడు ‘విక్రమ్’తో సక్సెస్, ఇప్పుడు ‘కబ్జా’తో ప్రయోగం - నిర్మాతగా నితిన్ మళ్లీ జాక్పాట్ కొడతాడా?
Trivikram - Surya Vashistta : కో డైరెక్టర్ కుమారుడిని హీరో చేసిన త్రివిక్రమ్
Sidharth Kiara Wedding: సిద్ధార్థ్, కియారా పెళ్లికి ముహూర్తం ఫిక్స్ - జైసల్మేర్లో వెడ్డింగ్, ముంబై రిసెప్షన్!
Pathaan Movie: ‘పఠాన్’ మూవీ గురించి మీకు తెలియని 8 ఇంట్రెస్టింగ్ విషయాలు
Telangana budget 2023 : కొత్త పన్నులు - భూముల అమ్మకం ! తెలంగాణ బడ్జెట్లో ఆదాయ పెంపు మార్గాలు ఇవేనా ?
Jagan focus on Muslims : మైనార్టీలపై జగన్ ఫోకస్, త్వరలో భారీ బహిరంగ సభకు ప్లాన్!
Perni Nani On Kotamreddy : జగన్ పిచ్చి మారాజు అందర్నీ నమ్మేస్తారు, కోటంరెడ్డి నమ్మక ద్రోహం చేశారు - పేర్ని నాని
PROJECT-K 2 Parts | ప్రాజెక్ట్-K పై నమ్మకంతో Prabhas రిస్క్ చేస్తున్నారా..?| ABP Desam