అన్వేషించండి

Telangana 10th Class Results: రేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల, కేశవరావు చేతుల మీదుగా రిజల్ట్స్

TG SSC Results 2026 | తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలను ఈ నెల 29 లేదా 30వ తేదీన విడుదల చేసేందుకు పరీక్షల విభాగం ఏర్పాట్లు పూర్తి చేసింది.

Telangana SSC Exam Results | హైదరాబాద్: కొన్ని రోజుల కిందట ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్. ఇక టెన్త్ పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు (TG SSC Results) విడుదలకు ప్రభుత్వ పరీక్షల విభాగం సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 29న లేదా 30న ఫలితాలను వెల్లడించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారని సమాచారం. ఈ మార్చి 14వ తేదీ నుండి ఏప్రిల్ 13 వరకు జరిగిన 10వ తరగతి పరీక్షలకు సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరుకాగా, ఏప్రిల్ 23 నాటికే జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేశారు. అధికారిక వెబ్‌సైట్ https://bse.telangana.gov.in/

ముందుగా ఫలితాలను మే మొదటి వారంలో విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, ప్రక్రియ వేగవంతం కావడంతో ఏప్రిల్ నెలాఖరులోనే విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫలితాల తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు ముఖ్య అతిథిగా హాజరై టెన్త్ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఒకవేళ టెక్నికల్ కారణాల వల్ల ఏప్రిల్ 29న ఫలితాల విడుదల వీలుకాకపోతే, మరుసటి రోజు 30వ తేదీన టెన్త్ రిజల్ట్స్ వెల్లడి కావడం ఖాయమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు (TS Intermediate Results)
తెలంగాణలో 2 వారాల కిందటే ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి. ఏప్రిల్ 12న విడుదలైన తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో సెకండియర్ విద్యార్థులు 70.58 శాతం ఉత్తీర్ణత సాధించగా, జనరల్ విభాగంలో మొత్తం 4,11,474 మందికి గాను 3,11,112 మంది పాసయ్యారు. బాలికలు 1,74,136 మంది ఉత్తీర్ణతతో పైచేయి సాధించగా, బాలురు 1,36,976 మంది పాసయ్యారు; అలాగే ఒకేషనల్ విభాగంలో 72.71 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు అధికారులు ప్రకటించారు.

ఇక ఇంటర్ ఫస్టియర్‌లో 66.94 శాతం మంది జనరల్ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 1,67,045 మంది మరియు బాలురు 1,28,734 మంది పాసయ్యారు. ఒకేషనల్ విభాగంలో 59.30 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, మొత్తంగా ఇంటర్ ఫలితాల్లో బాలికలే అత్యధిక శాతం ఉత్తీర్ణతతో తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు.

 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Embed widget