అన్వేషించండి

Project K Movie: అమెరికాలో అడుగు పెట్టిన ‘బాహుబలి’ బ్రదర్స్, శాన్ డియాగోలో ఇక రచ్చే!

ప్రభాస్, దీపికా పదుకొణె కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రాజెక్ట్ K’. జులై 20న ఈ మూవీ టైటిల్, గ్లింప్స్ శాన్ డియాగోలో విడుదల చేయనున్నారు. ఈ ఈవెంట్ కోసం ప్రభాస్, రానా ఇప్పటికే అమెరికాకు చేరుకున్నారు.

ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ప్రాజెక్ట్-K’. ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి దిగ్గజ నటులు ఈ మూవీలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ టీమ్ విడుదల చేసిన పోస్టర్లు, మేకింగ్ వీడియోస్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచాయి. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, గ్లింప్స్ విడుదల చేయనున్నారు. అమెరికా వేదికగా ఈ వేడుక జరగనుంది.

ప్రతిష్టాత్మక ఈవెంట్ కు ‘బాహుబలి’ బ్రదర్

‘ప్రాజెక్ట్-K’ మూవీ టైటిల్‌ను అంతర్జాతీయ వేదికపై గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.  ఇవాళ్టి (జులై19) నుంచి నుంచి అమెరికా శాన్ డియాగోలో కామిక్ కాన్ వేడుకల జరగనున్నాయి. అక్కడే జులై 20న ప్రాజెక్ట్‌ గా టైటిల్‌తో పాటు గ్లింప్స్ రిలీజ్ చేస్తారు. ఈ ప్రఖ్యాత ఈవెంట్‌లో ఎంట్రీ ఇస్తున్న తొలి ఇండియన్ మూవీ ‘ప్రాజెక్ట్ K’ కావడం విశేషం. ఈ కార్యక్రమంలో ప్రభాస్‌, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత అశ్వినీదత్ కూడా పాల్గొంటారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయాన్ని ప్రకటించింది చిత్ర నిర్మాణ సంస్థ. ఈ టైటిల్, గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ లో ‘బాహుబలి’ బ్రదర్ రానా కూడా పాల్గొనబోతున్నట్లు తెలిపింది. ఈ మేరకు శాన్ డియాగోలో ప్రభాస్, రానా ల్యాండ్ అయ్యారంటూ ఓ ఫోటోను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. దీంతో, ప్రభాస్ తో పాటు రానా అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు.    

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies)

రెండు భాగాలుగా ‘ప్రాజెక్ట్ K’ విడుదల

అటు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె  సైతం ఈ మూవీ గురించి కీలక విషయాన్ని ఇన్‌ స్టా గ్రామ్‌ లో పంచుకుంది. "కామిక్ కాన్‌కి వెళ్ళిన తొలి భారతీయ చలనచిత్రంలో భాగమైనందుకు గర్వంగా ఉంది. అక్కడ కలుద్దాం" అని పోస్ట్ చేసింది. ఈ మూవీలో దీపికాతోపాటు దిశా పటానీ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమాగా 'ప్రాజెక్ట్ కె'ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.  టాలీవుడ్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రాల్లో ఒకటిగా ‘ప్రాజెక్ట్ K’ కానుంది. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలకానున్నట్లు సమాచారం. సైన్స్ ఫిక్షన్ ఫ్రాంచైజీ తొలి భాగం కమల్ తో పోరాడేందుకు భవిష్యత్తులోకి ప్రయాణించేందుకు ప్రభాస్‌ సిద్ధం కావడంతో ముగుస్తుంది. ఫ్రాంచైజీ 2వ భాగం పూర్తిగా ప్రభాస్, కమల్ హాసన్ మధ్యే నడవనున్నట్లు తెలుస్తోంది. ‘ప్రాజెక్ట్ K’ మూవీ జనవరి 12, 2024 నాడు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, ఆంగ్ల భాషల్లో విడుదల కానుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by दीपिका पादुकोण (@deepikapadukone)

Read Also: బస్తీ పోరి ‘బేబీ’గా ఎలా మారింది? వైష్ణవి చైతన్య గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 18th: నిండు మనసులు: కోరికలు చిట్టీలో రాసి అమ్మవారి ముందు పెడితే నెరవేరుతాయంట మీకు తెలుసా!
నిండు మనసులు: కోరికలు చిట్టీలో రాసి అమ్మవారి ముందు పెడితే నెరవేరుతాయంట మీకు తెలుసా!
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? ఈ RedFlagsను అస్సలు విస్మరించొద్దు
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? ఈ RedFlagsను అస్సలు విస్మరించొద్దు
Jana Nayakudu OTT: జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? ఈ RedFlagsను అస్సలు విస్మరించొద్దు
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? ఈ RedFlagsను అస్సలు విస్మరించొద్దు
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
Embed widget