అన్వేషించండి

Ayodhya Sri Ram: అయోధ్య శ్రీరామ రూపం, ధరణి దర్శన పుణ్యతీర్థం - వైరల్ సాంగ్ విన్నారా?

Ayodhya Ram Mandir: దేశమంతా జైశ్రీరామ్ నామస్మరణతో పులకించిపోతున్న వేళ... అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా రూపొందించిన 'అయోధ్య శ్రీరామ్' సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జై శ్రీరామ్... జై శ్రీరామ్... జై శ్రీరామ్... సోమవారం ఎటు చూసినా శ్రీరాముని నామ స్మరణ వినిపించింది. ప్రజల్లో రామునిపై భక్తి భావం కనిపించింది. శ్రీరాముడు జన్మించిన అయోధ్య నగరంలో సోమవారం బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ అంగ రంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా 'అయోధ్య శ్రీ రామ్' పేరుతో తెలుగు, హిందీ భాషల్లో ప్రవాస ఆంధ్రుని నిర్మాణ సారధ్యంలో రూపొందించిన గీతం వీక్షకుల్ని ఆకట్టుకుంటోంది. 

సత్య కశ్యప్ సంగీతంలో...
సమీర్ పెనకలపాటి నిర్మాణంలో!
యువ సంగీత దర్శకుడు సత్య కశ్యప్ 'అయోధ్య శ్రీరామ్' గీతానికి మంచి బాణీ అందించారు. ఆయన డివోషనల్ సాంగ్ చేయడం ఇదే తొలిసారి. ఇంతకు ముందు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన 'ఐస్ క్రీమ్ 2'తో పాటు కమల్ కామరాజు హీరోగా నటించిన 'లా', ఇంకా 'ఐరావతం' తదితర సినిమాలకు సంగీతం అందించారు. 

ఎస్.పి. ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన ప్రవాస భారతీయుడు, తెలుగు వ్యక్తి సమీర్ పెనకలపాటి 'అయోధ్య శ్రీరామ్' గీతాన్ని ప్రొడ్యూస్ చేశారు. ఈ భక్తి పాటతో ఆయన ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించారు.

ప్రవాస భారతీయులు, ఎస్.పి. ప్రొడక్షన్ హౌస్ అధినేత సమీర్ పెనకలపాటి ఈ 'అయోధ్య శ్రీరామ్' గీతం గురించి మాట్లాడుతూ... "శ్రీ రాముని స్తుతిస్తూ ఒక గీతం రూపొందించే అవకాశం మాకు లభించడం చాలా అదృష్టంగా  భావిస్తున్నాను. ఇది మాకు లభించిన ఆ శ్రీరాముని కృప. ఈ ఆల్బమ్ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ ఆ అవతార పురుషుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీరామ గీతంతో మా ఎస్.పి. ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయడం నా పూర్వజన్మ సుకృతం. ఈ గీతాన్ని ఆంజనేయ - లక్ష్మణ సమేత సీతారాముల పాదపద్మాలకు భక్తిపూర్వకంగా సమర్పించుకుంటున్నా" అని అన్నారు.

Also Readనాలుగు వందల కోట్లు... ఐదు సినిమాలు... బెంగళూరులో ఈ రోజు ఓపెనింగ్!

సంగీత దర్శకుడు సత్య కశ్యప్ మాట్లాడుతూ ''ఆది పురుషుడు రామయ్యపై ఎంతో అవ్యాజ్యమైన భక్తితో 'అయోధ్య శ్రీరామ్' పేరుతో ప్రత్యేక ఆల్బమ్ రూపొందించాం. ప్రపంచవ్యాప్తంగా గల కోట్లాది హిందువుల 500 ఏళ్ల ఆకాంక్ష నెరవేరిన వేళ... ఆ అయోధ్యలో ఆయన మందిరం ప్రారంభమైన రోజు... చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైన తరుణంలో పాట విడుదల కావడం మరింత ఆనందంగా ఉంది'' అని చెప్పారు.

Also Readఆ రోజు థియేటర్లలో 'ఎమర్జెన్సీ' - ఇందిరా గాంధీగా కంగన లుక్ చూశారా?

యూట్యూబ్‌లో 24 గంటల్లో 50 వేల వ్యూస్!
'అయోధ్య శ్రీరామ్' పాటకు తెలుగులో చిరంజీవి ఎన్ని సాహిత్యం అందించారు. ఈ బాణీ రూపకర్త సత్య కశ్యప్ స్వయంగా ఆలపించారు. ప్రముఖ గాయని చిన్మయి, స్నికిత, స్రగవి కోరస్ అందించారు. హిందీ గీతానికి తన్వీర్ ఘాజి సాహిత్యం అందించగా... ఆకాంక్ష సైనీతో కలిసి సత్య కశ్యప్ పాడారు. ఈ పాటకు యువర్స్ ఉన్ని ఎడిటర్. ప్రజెంట్ ట్రెండ్ చూస్తుంటే మరిన్ని వ్యూస్ వచ్చేలా ఉన్నాయి.

Also Readదర్శకుడిగా ధనరాజ్ మొదటి సినిమా ఫస్ట్ లుక్ - ఆయన వెనుక ఉన్న నటుడిని గుర్తు పట్టారా?

టాప్ హెడ్ లైన్స్

Dhanush OM Release Date : ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో ధనుష్ కొత్త మూవీ - మల్టీ చాప్టర్‌గా ఓం... రిలీజ్ ఎప్పుడంటే?
ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో ధనుష్ కొత్త మూవీ - మల్టీ చాప్టర్‌గా ఓం... రిలీజ్ ఎప్పుడంటే?
Azadi 501 Series Trailer : ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ స్కామ్ సిరీస్ - ఇంట్రెస్టింగ్‌గా ఆజాదీ 501 ట్రైలర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ స్కామ్ సిరీస్ - ఇంట్రెస్టింగ్‌గా ఆజాదీ 501 ట్రైలర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Vishwanath And Sons Wedding Song : సూర్య పాడిన వెడ్డింగ్ సాంగ్ - న్యూ కపుల్ డోంట్ మిస్ దిస్ లిరిక్స్
సూర్య పాడిన వెడ్డింగ్ సాంగ్ - న్యూ కపుల్ డోంట్ మిస్ దిస్ లిరిక్స్
Case Of Kondana OTT : చిన్న కారణానికే హత్య... ఒక్క రాత్రిలో ఊహించని ఘటనలు - ఓటీటీ ట్రెండింగ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్
చిన్న కారణానికే హత్య... ఒక్క రాత్రిలో ఊహించని ఘటనలు - ఓటీటీ ట్రెండింగ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: YS Jagan సూటి ప్రశ్న
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: వైఎస్ జగన్ ప్రశ్న
Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
IND VS ZIM 2nd T20 Result Update: శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్, య‌శ్, ప్రిన్స్
శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్ శర్మకు 3 వికెట్లు
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
Pawan Kalyan Seed Balls: డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
Dharmendra Pradhan Resignation News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
Azadi 501 Series Trailer : ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ స్కామ్ సిరీస్ - ఇంట్రెస్టింగ్‌గా ఆజాదీ 501 ట్రైలర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ స్కామ్ సిరీస్ - ఇంట్రెస్టింగ్‌గా ఆజాదీ 501 ట్రైలర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Team India Equals Own World Record :  వ‌ర‌ల్డ్ రికార్డును స‌మం చేసిన టీమిండియా.. అత్య‌ధిక సార్లు ఆ ఘ‌న‌తను సాధించిన జ‌ట్టుగా శ్రేయ‌స్ సేన‌.. పొట్టి ఫార్మాట్లో అత్య‌ధికంగా..
వ‌ర‌ల్డ్ రికార్డును స‌మం చేసిన టీమిండియా.. అత్య‌ధిక సార్లు ఆ ఘ‌న‌తను సాధించిన జ‌ట్టుగా శ్రేయ‌స్ సేన‌.. పొట్టి ఫార్మాట్లో అత్య‌ధికంగా..
Embed widget