IPL, 2022 | Match 68 | Brabourne Stadium, Mumbai - 20 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
CSK
CSK
IPL, 2022 | Match 69 | Wankhede Stadium, Mumbai - 21 May, 07:30 pm IST
(Match Yet To Begin)
MI
MI
VS
DC
DC

Avatar 2 Trailer: అవతార్ 2 ట్రైలర్ - మరో విజువల్ ట్రీట్ కి రెడీనా?

'అవతార్: ది వే ఆఫ్ వాటర్' ట్రైలర్ ను విడుదల చేశారు.

FOLLOW US: 

ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా అవతార్ రికార్డు 12 ఏళ్లు గడిచినా ఇంకా చెక్కు చెదరలేదు. సీక్వెల్ అనౌన్స్ చేయగానే సోషల్ మీడియా ఊగిపోయింది. మొత్తం నాలుగు సీక్వెల్స్ రాబోతున్నట్లు ప్రకటించారు. రెండో సీక్వెల్ కి 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' అనే టైటిల్ పెట్టారు. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ను 'డాక్టర్ స్ట్రేంజ్' మూవీ థియేటర్లలో ప్లే చేశారు. ఇప్పుడు నేరుగా సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. 

ముందుగా పండోరా గ్రహానికి సంబంధించిన స్టన్నింగ్ విజువల్స్‌తో ట్రైలర్ మొదలైంది. పండోరాలోని అద్భుతమైన లొకేషన్లు, చూడగానే మైమరపించే నీలి రంగులోని సముద్రాన్ని తర్వాత చూపిస్తారు. అక్కడ నుంచి సినిమా పేరును జస్టిఫై చేస్తూ విజువల్స్ అండర్ వాటర్‌లోకి వెళ్తాయి. హీరో శామ్ వర్తింగ్‌టన్ చేసిన జేక్ సల్లీ, హీరోయిన్ జో సల్దానా 'నేతిరి' పాత్రలకు సంబంధించిన కొత్త క్లోజప్ షాట్లను ఇందులో చూడవచ్చు. 

అయితే ఇందులో కొత్తగా కనిపించేవి జేక్ సల్లీ, నేతిరికి పుట్టిన పిల్లలే. వీరు సగం మనుషులు కాగా, సగం పండోరాకు చెందిన నావి జాతికి చెందిన వారు. హీరో, హీరోయిన్ దత్తత తీసుకున్న జాక్ చాంపియన్  అనే కొత్త పాత్ర ఇందులో ఉంది. ఆ తర్వాత పండోరాలోని సముద్ర జీవులను చూడవచ్చు. ఇవి పెద్ద సైజులో ఉండటంతో పాటు అక్కడి వారితో స్నేహపూరితంగానే ఉన్నాయి. టైటానిక్ ఫేమ్ ‘కేట్ విన్‌స్లెట్’ను నావి గ్రహానికి చెందిన వ్యక్తిగా చూపించారు. ఇందులో ఒక డైలాగ్ కూడా ఉంది. ‘నాకు ఒక్క విషయం మాత్రం తెలుసు. మనం ఎక్కడికి వెళ్లినా... కుటుంబమే మనకు కోట.’ అని హీరో అంటాడు.

దీన్ని బట్టి ఇందులో గాడ్ ఫాదర్ తరహా ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని గతంలోనే నిర్మాతలు తెలిపారు. అయితే ఈ సినిమా గురించి ఇంకా తెలియాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ఇందులో కథేంటి అనే విషయం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అవతార్: ది వే ఆఫ్ వాటర్ డిసెంబర్ 16వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. 2024లో అవతార్ 3, 2026లో అవతార్ 4, 2028లో అవతార్ 5 కూడా విడుదల కానున్నాయి. 

Also Read: 'సర్కారు వారి పాట' సెన్సార్ రివ్యూ!

Also Read: 'ప్రతి అమ్మ ఇలానే ఆలోచిస్తే' - 'మేజర్' ట్రైలర్ వేరే లెవెల్

View this post on Instagram
 
A post shared by Avatar (@avatar)

Published at : 09 May 2022 08:19 PM (IST) Tags: James cameron Avatar 2 Avatar 2 movie Avatar Avatar 2 Trailer

సంబంధిత కథనాలు

Sirivennela HBD: నిన్ను తలుచుకోని నిమిషం, నీ పాట ధైర్యం చెప్పని క్షణముందా సీతారాముడూ!

Sirivennela HBD: నిన్ను తలుచుకోని నిమిషం, నీ పాట ధైర్యం చెప్పని క్షణముందా సీతారాముడూ!

NTR Birthday Special: బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన కొమురం భీముడు- బృందావనంలో అందాల రాముడు

NTR Birthday Special: బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన కొమురం భీముడు- బృందావనంలో అందాల రాముడు

NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!

NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!

Bollywood: భార్యతో విడిపోతున్న మరో హీరో? 19 ఏళ్ల ప్రేమకు ఫుల్‌స్టాప్?

Bollywood: భార్యతో విడిపోతున్న మరో హీరో? 19 ఏళ్ల ప్రేమకు ఫుల్‌స్టాప్?

Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు 

Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు 
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Nikhat Zareen Profile: ఓవర్‌నైట్ గెలుపు కాదిది - నిఖత్ జరీన్‌ది 12 ఏళ్ల శ్రమ!

Nikhat Zareen Profile: ఓవర్‌నైట్ గెలుపు కాదిది - నిఖత్ జరీన్‌ది 12 ఏళ్ల శ్రమ!

CM Jagan Davos Tour : సీఎం జగన్ దావోస్ పర్యటన, పెట్టుబడులే టార్గెట్!

CM Jagan Davos Tour : సీఎం జగన్ దావోస్ పర్యటన, పెట్టుబడులే టార్గెట్!

Natural Painkillers: ఈ ఆహారపదార్థాలలో పెయిన్ కిల్లర్స్ లక్షణాలు అధికం, నొప్పిని తగ్గిస్తాయి

Natural Painkillers: ఈ ఆహారపదార్థాలలో పెయిన్ కిల్లర్స్ లక్షణాలు అధికం, నొప్పిని తగ్గిస్తాయి

Astrology: సెప్టెంబరులో పుట్టారా, ఎన్నికష్టాలు పడినా తగ్గేదేలే అనే టైప్ మీరు

Astrology: సెప్టెంబరులో పుట్టారా, ఎన్నికష్టాలు పడినా తగ్గేదేలే అనే టైప్ మీరు