అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Avatar 2 Trailer Out: వావ్ అనిపించే విజువల్స్‌తో అవతార్-2 ట్రైలర్ - వసూళ్ల వరద ఖాయం!

జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన అవతార్ 2 ట్రైలర్ విడుదల అయింది.

ప్రపంచవ్యాప్తంగా సినిమా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న అవతార్ సీక్వెల్ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్ (Avatar: The Way Of Water)’ ట్రైలర్ బుధవారం సాయంత్రం సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల్లో విడుదల అయింది. డిసెంబర్ 16వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

ఈ ట్రైలర్‌లో కథను పెద్దగా రివీల్ చేయలేదు. అయితే పండోరా గ్రహం మీద ఉన్న కొత్త ప్రాంతాలను, జీవులను ఈ ట్రైలర్‌లో చూపించారు. ముఖ్యంగా నీటిలో ఉన్న జీవుల విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. కొత్త పాత్రలను కూడా ఈ ట్రైలర్‌లో చూడవచ్చు.

మొదటి భాగం చివర్లో భూమికి చెందిన మనుషులను తిరిగి వెనక్కి పంపేసినట్లు చూపించారు. అయితే వారు మళ్లీ తిరిగి వచ్చినట్లు ఈ ట్రైలర్‌లో తెలుస్తోంది. పండోరా గ్రహంలో నీటిలో ఉండే వారికి, భూమి నుంచి వచ్చిన వారికి, మొదటి భాగంలో చూపించిన పండోరా వాసులకు మధ్య యుద్ధం జరుగుతున్న విజువల్స్ కూడా ట్రైలర్‌లో చూడవచ్చు.

ఈ సినిమా నిడివి 3 గంటల 10 నిమిషాలు ఉండనుందని తెలుస్తోంది. అవతార్‌కు సంబంధించి మొత్తం నాలుగు భాగాలు ఒకేసారి తెరకెక్కినట్లు తెలుస్తోంది. అవతార్ 3 2024లో, అవతార్ 4 2026లో, అవతార్ 5 2028లో విడుదల కానున్నాయి. ప్రస్తుతం అవతార్ 3 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అవతార్ 4, 5ల షూటింగ్ కూడా ఎప్పుడో అయిపోయిందని వార్తలు వస్తున్నాయి. ఏకంగా 160 భాషల్లో అవతార్ 2 విడుదల కానుంది.

కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హక్కులు రూ.100 కోట్ల వరకు పలుకుతున్నాయని టాక్. పెద్ద హీరోల సినిమాలకు తప్ప మిగతా తెలుగు హీరోల సినిమాల హక్కులు అందులో సగం కూడా పలకవు. పెద్ద హీరోల సినిమాలు కూడా సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప ఆ వసూళ్లు దాదాపు అసాధ్యం. దీన్ని బట్టి అవతార్ క్రేజ్ ఏంటి అనేది అర్థం చేసుకోవచ్చు.

View this post on Instagram
 
A post shared by Avatar (@avatar)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget