Aryan Khan D'YAVOL X: ఈ బట్టలు కొనాలంటే కిడ్నీలు అమ్మాల్సిందే, షారుఖ్ కొడుకు క్లోత్స్ బ్రాండ్ పై నెటిజన్ల ట్రోల్స్
ఆర్యన్ ఖాన్ కొత్త క్లోత్స్ బ్రాండ్ D'YAVOL X ప్రారంభం అయ్యింది. ఇందులో బట్టల ధరలు చూసి వినియోగదాలు షాక్ అవుతున్నారు. ఈ బ్రాండ్ దుస్తులు కొనుగోలు చేయాలంటే కిడ్నీలు అమ్మాల్సిందేనని విమర్శిస్తున్నారు.
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ లగ్జరీ దుస్తుల బ్రాండ్ ఓపెన్ అయ్యింది. D'YAVOL X పేరుతో తాజాగా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. గత కొద్ది కాలంగా తన బ్రాండ్ కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో ఆర్యన్ బిజీగా ఉన్నాడు. తన తండ్రితో కలిసి ఈ బ్రాండ్ ప్రచారంలో భాగంగా ఓ యాడ్ కూడా రూపొందించాడు. మొత్తంగా D'YAVOL X బ్రాండ్ మీద అందరిలో ఓ ఆసక్తి కలిగించాడు. తాజాగా D'YAVOL X దుస్తుల అమ్మకాలను మొదలు పెట్టాడు.
ధరలపై నెటిజన్ల ట్రోలింగ్!
D'YAVOL Xలో దుస్తులు కొనుగోలు చేయాలి అనుకునే వారు, ఆ ధరలు చూసి షాక్ అయ్యారు. ధరలు మధ్య తరగతి వినియోగదారులకు అందనంత దూరంలో ఉన్నాయి. వీటి ధరలు చూసి నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. "ఖాన్ సాబ్ నా ఒక కిడ్నీని అమ్మినా బట్టలు కొనుగోలు చేయలేను. కచ్చితంగా నా రెండు కిడ్నీలను అమ్మాల్సిందే" అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. "ఇప్పుడే రేట్లు చెక్ చేశాను. ఈ ధరలను చూస్తే నాకు పిచ్చెక్కింది. మధ్య తరగతి వినియోగదారులు ఈ ధరలను ఎప్పటికీ పెట్టి కొనలేడు. ఈ ధరలు చూసి ఆశ్చర్యపోతున్నాను” అంటూ మరో నెటిజన్లు కామెంట చేశాడు. "లెదర్ జాకెట్ ధర రూ. 2 లక్షలా?" అని మరో వినియోగదారులు షాక్ అయ్యాడు.
View this post on Instagram
ధరలు చూస్తే కళ్లు తిరగాల్సిందే!
అటు ఫ్యాషన్ రంగం గురించి వివరాలు వెల్లడించే డైట్ సబ్యా దుస్తుల బ్రాండ్ సైతం D'YAVOL X ధరల గురించి స్పందించింది. వారి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో, D'YAVOL X స్టోర్ నుంచి తీసిని స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసారు. ప్రింటెడ్ డిజైన్‌తో ఉన్న ఓ తెల్ల రంగు టీ ధర ఏకంగా ₹24,400గా చూపిస్తోంది. మరో నల్లటి హూడీ ధర ₹45,500 కాగా, ఒక జాకెట్ ధర ₹2 లక్షలకు పైగా ఉంది. ఆర్యన్ దుస్తుల బ్రాండ్ ధరపై ప్రతికూల కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇక D'YAVOL X వెబ్‌సైట్ ప్రారంభం అయిన వెంటనే చాలా మంది యాక్సెస్ అయ్యేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో సర్వర్ డౌన్ అయ్యింది. “సైట్ ప్రారంభం అయిన వెంటనే ఎక్కువ ట్రాఫిక్ వచ్చింది. ఎక్కువ చెకౌట్లు కూడా ఎదుర్కొన్నాము. దయచేసి మాతో సహకరించండి. మళ్లీ యథావిధిగా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం” అని ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.
కొడుకు డైరెక్షన్, తండ్రి యాక్టింగ్
తాజాగా D'YAVOL X బ్రాండ్ కు సంబంధించిన యాడ్ షూట్ చేశారు. తన క్లాత్ బ్రాండ్ కు సంబంధించిన వీడియోను నెట్టింట్లోకి వదిలాడు. ఈ టీజర్ వీడియోలో షారుఖ్‌ను చూపించి చూపించనట్లు చూపించారు. ఆర్యన్ తన తొలి యాడ్ లో తండ్రి షారుఖ్ నటించడం స్పెషల్ గా చెప్పుకొచ్చాడు. అటు ఆర్యన్ ఓ వెబ్ సిరీస్ రూపొందించే పనిలో ఉన్నాడు. ఇప్పటికే ఈ సిరీస్ కు సంబంధించిన స్ర్కిప్ట్ వర్క్ కంప్లీట్ చేశాడు. తన దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కబోతున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ప్రాజెక్ట్ ఇదే ఏడాది సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉటుంది. త్వరలోనే ఈ సిరీస్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Read Also: ‘ఢీ’ పేరు ఇస్తుంది, జబర్దస్త్ డబ్బులు ఇస్తుంది - సూసైడ్ సెల్ఫీ వీడియోలో చైతు మాస్టర్ ఆవేదన