By: ABP Desam | Updated at : 12 Mar 2023 01:12 PM (IST)
Edited By: anjibabuchittimalla
Image Credit: T-Series Telugu/YouTube
‘పేపర్ బాయ్’ సినిమాతో దర్శకుడిగా సక్సెస్ అందుకున్న జయ శంకర్, ప్రస్తుతం ‘అరి’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించబోతున్నారు. సినిమా టైటిల్ తోనే ప్రేక్షకులలో ఆసక్తి కలిగించిన దర్శకుడు, ఫస్ట్ లుక్, ప్రచార వీడియోలతో మరింత ఇంట్రెస్ట్ కలిగించారు. ఈ మూవీలో మంగ్లీ పాడిన ‘‘చిన్నారి కిట్టయ్య’’ పాట ప్రేక్షకాదరణ దక్కించుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ట్రైలర్ విడుదల అయ్యింది.
ఈ ట్రైలర్ అరిషడ్వర్గాలు అంటే ఏంటి అనే వాయిస్ తో మొదలవుతుంది. కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాల చుటూ తిరుగుతూ ఆసక్తి కలిగిస్తోంది. మనిషి ఎలా బతకకూడదో ఈ ట్రైలర్ లో చూపించారు. అరిషడ్వర్గాలుగా ఉన్న ఆరుగురికి ఉన్న కామన్ శత్రువు ఎవరు? అనే ఆసక్తికర కథతో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రతి మనిషిలో ఉండే ఆరు అవ లక్షణాల కారణంగా ఎంతగా దిగజారుతారు అనే విషయాన్ని ఇందులో చూపించారు. మనిషి ఈ ఆరు చెడు లక్షణాలతో ఎలా పతనం అవుతాడో ఆవిష్కరించనున్నారు. ఓవైపు శ్రీకృష్ణ తత్వాన్ని చూపిస్తూనే మరోవైపు, ఆరుగురు తమ శత్రువులను ఎలా ఎదుర్కొంటారో ఇందులో చూపించనున్నారు.
ఇక ఈ సినిమాలో ఆరు అవలక్షణాలలో కనిపించే ఆరుగురు వ్యక్తులుగా అనసూయ, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యర్, సుభలేఖ సుధాకర్, సురభి ప్రభావతి, వైవా హర్ష కీలక పాత్రలు పోషించారు. అందరికంటే అందంగా కనిపించాలని చెప్తూ అనసూయ ఆకట్టుకుంది. శుభలేక సుధాకర్ మరోసారి చక్కటి పాత్రలో ఆకట్టుకున్నారు. ఓ అమ్మాయిని దారుణంగా రేప్ చేయాలని చెప్పడతో తను షాక్ అవుతూ కనిపిస్తారు. ఇక సురభి ప్రభావతి పాత్రలో ఇట్టే ఒదిగిపోయి కనిపించింది. ప్రైడ్‌గా సాయి కుమార్ పవర్ ఫుల్ రోల్ లో కనిపించారు. ఆంగర్ పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ కనిపించగా, వైవా హర్ష శృంగారం కోసం పరితపించే వాడిగా కనిపించారు. ఇక సుమన్, ఆమని, శ్రీనివాస్ రెడ్డి, చమ్మక్ చంద్ర, పావని రెడ్డి, జెమినీ సురేష్, యాంకర్ అంజలి, సురభి విజయ్ సహా పలువురు కీలక పాత్రల్లో కనిపించారు.
ఇక ఆర్వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శేషు మారంరెడ్డి, శ్రీనివాస్ రామిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. శివ శంకర వరప్రసాద్ సినిమాటోగ్రఫీ ఇచ్చారు. కాసర్ల శ్యామ్, వనమాలి సాహిత్యం అందించారు. జి.అవినాష్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తుండగా, భాను, జీతు కొరియోగ్రాఫర్లుగా ఉన్నారు.
Here’s the #TheatricalTrailer of my next #ARI https://t.co/yZEijbbaAw
— Anasuya Bharadwaj (@anusuyakhasba) March 12, 2023
A film by @vjayashankarr #ARItheatricalTrailer #OutNow pic.twitter.com/RElExt252G
Janaki Kalaganaledu March 23rd: జానకి, రామ హనీమూన్- మనవడిని చూసి మురిసిపోతున్న జ్ఞానంబ
Aditi Rao Hydari-Siddharth: సిద్దార్థ్‌తో రిలేషన్‌పై అదితి రావు ఘాటు స్పందన - అదేంటీ, అలా అనేసింది?
Rashmika Mandanna: ఇంట్లో పని మనుషుల పాదాలకు నమస్కరిస్తా - రష్మిక
NTR 30 Muhurtham : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల
Gruhalakshmi March 23rd: తులసి తన భార్య కాదని వాసుదేవ్‌కి చెప్పేసిన నందు- హీరోలాగా ఫైట్ చేసి దివ్యని కాపాడిన విక్రమ్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా
KCR Tour: నేడు 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన - పూర్తి షెడ్యూల్ ఇదీ
New Contraceptive Tool: గర్భనిరోధకానికి కొత్త సాధనం - తెలుగు రాష్ట్రాల్లో అమలుకు ప్రయత్నాలు
‘సూర్య’కుమార్ కాదు, ‘శూణ్య’కుమార్- 3 డకౌట్లతో మిస్టర్ 360ని ఆటాడుకుంటున్న నెటిజన్లు