AR Rahman's Son: ప్రదర్శనలో పెను ప్రమాదం, తృటిలో ప్రాణాలతో బయటపడ్డ ఏఆర్ రెహమాన్ కొడుకు!
ఏఆర్ రెహమాన్ కొడుకు అమీన్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఓ ప్రదర్శన ఇస్తుండగా భారీ షాండలియా కుప్పకూలింది. స్టేజి మీదే ఉన్న అమీన్ టీమ్ చాకచక్యంగా తప్పించుకుంది.
ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. భారతీయ దిగ్గజ సంగీత దర్శకులలో ఆయన ఒకరు. తన అద్భుత సంగీతంతో కోట్లాది మంది ప్రేక్షకులను అలరించారు. తండ్రి బాటలోనే ఆయన తనయుడు అమీన్ పయణిస్తున్నాడు. తను కూడా సంగీత కచేరీలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఓ మ్యూజిక్ ఈవెంట్‌లో ప్రదర్శన ఇస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అమీన్, ఆయన టీమ్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.
స్టేజి మీది నుంచి కిందికి దూకిన అమీన్ టీమ్
రీసెంట్ గా అమీన్ ఓ ఈవెంట్ లో పాల్గొన్నాడు. తన టీమ్ తో కలిసి కెమెరా ముందు ప్రదర్శన ఇస్తున్న సమయంలో పైన వేలాడ దీసిని భారీ షాండలియా అకస్మాత్తుగా కుప్పకూలింది. ఆ టైంలో అమీన్ తో పాటు ఆయన టీం అంతా వేదికపైనే ఉన్నారు. వాస్తవానికి అక్కడ రెండు వేదికలను ఏర్పాటు చేశారు. ఈ రెండింటినీ కవర్ చేసేలా భారీ క్రేన్ సహాయంతో ఈ షాండలియాను వేదికలపై వేలాడదీశారు. ఏం జరిగిందో తెలియదు కానీ, అకస్మాత్తుగా కూలిపోయింది. వెంటనే గమనించిన అమీన్ ఆయన టీమ్ మెంబర్స్ చాకచక్యంగా స్టేజి మీది నుంచి కిందికి దూకారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. నిజానికి జరిగిన ప్రమాద ఫోటోలను చూస్తుంటే ఏమాత్రం అలసత్వం వహించినా చాలా మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉండేది.
2 రోజులైనా షాక్ నుంచి తేరుకోని అమీన్
ఈ ప్రమాదం జరిగి మూడు రోజులు అవుతోంది. ఇప్పటికీ ఆ షాక్ నుంచి బయటపడలేకపోతున్నట్లు అమీన్ తెలిపారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రమాద సంఘటనకు సంబంధించిన ఫోటోలను ఆయన షేర్ చేశాడు. తన తల్లిదండ్రులు, అభిమానులు, శ్రేయోభిలాషుల ఆశీర్వాదం కారణంగానే తాను ప్రాణాలతో ఉన్నట్లు ఆమీన్ భావోద్వేగానికి గురయ్యాడు. అమీన్ షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజంగా దేవుడి కృప కారణంగా ఎలాంటి ప్రమాదం జరగలేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రెహమాన్ మంచి తనమే అతడి కొడుకును ఈ గండం నుంచి గట్టెక్కించిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. స్వరమాంత్రికుడి కుటుంబ చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు.
Read Also: చావు అంచుల్లోకి వెళ్లి వచ్చా, గుండె పోటుపై సుస్మితా సేన్ ఎమోషనల్!
ఇక 20 ఏళ్ల గాయకుడు అమీన్ ‘ఓ కాదల్ కన్మణి’ చిత్రంతో తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఈ సినిమాకు తన తండ్రి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. అప్పటి నుంచి అనేక భారతీయ భాషలలో అమీన్ పలు పాటలు పాడాడు.
View this post on Instagram
Read Also: చావు అంచుల్లోకి వెళ్లి వచ్చా, గుండె పోటుపై సుస్మితా సేన్ ఎమోషనల్!