AR Rahman's daughter: ఏఆర్ రెహ్మాన్ కూతురి పెళ్లి - వరుడు ఎవరో తెలుసా?
ఏఆర్ రెహ్మాన్ పెద్ద కూతురు ఖతీజా రెహ్మాన్ వివాహం వైభవంగా జరిగింది.
ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్ పెద్ద కూతురు ఖతీజా రెహ్మాన్ వివాహం వైభవంగా జరిగింది. రియాస్దీన్ షేక్ మహమ్మద్ అనే సౌండ్ ఇంజనీర్‌తో మే5న ఆమెకి వివాహం జరిగింది. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోల్లో పెళ్లి కొడుకు రియాస్దీన్ షేక్ మహమ్మద్ తెల్లటి షేర్వానీ వేసుకొని కనిపించారు.
ఖతీజా ప్రింటెడ్ ఆఫ్ వైట్ లెహంగా ధరించింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఖతీజా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలానే రెహ్మాన్ నూతన జంటకు విషెస్ తెలుపుతూ ఫొటోను షేర్ చేశారు. దీంతో పలువురు ప్రముఖులు సహా.. నెటిజన్ల నుంచి కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.
రెహ్మాన్ కూతురు ఖతీజా కూడా సింగర్ గా మంచి పేరు తెచ్చుకుంది. 2010లో విడుదలైన 'రోబో'సినిమాలో 'ఓ మరమనిషి' పాటను దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఆలపించారు. ఇటీవల ఓటీటీలో విడుదలైన కృతిసనన్ 'మీమీ' చిత్రంలో 'రాక్‌ఏ బై బేబీ' పాటను పాడారు.
Also Read: ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్ - ఫొటో వైరల్
Also Read: పాపులర్ నటికి వేధింపులు - దర్శకుడు అరెస్ట్
View this post on Instagram
View this post on Instagram