Bigg Boss: బిగ్ బాస్ షోలో అశ్లీలత - ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు!
ఏపీ హైకోర్టులో బిగ్ బాస్ షోపై నిషేధం విధించాలంటూ పిటిషన్ దాఖలైంది.
బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్(Bigg Boss). ఈ షోని ఇష్టపడేవారితో పాటు విమర్శించేవారు కూడా చాలా మంది ఉన్నారు. ఈ షోలో బూతులు, బోల్డ్ నెస్ ఎక్కువయ్యాయంటూ కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. ఫ్యామిలీతో కలిసి ఇలాంటి షోలను చూడలేమంటూ విమర్శిస్తున్నారు. తాజాగా ఈ గేమ్ షోపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇప్పటికే బిగ్ బాస్ షోపై సీపీఐ నారాయణ చాలా సార్లు ఫైర్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ ను బ్రోతల్ హౌస్ తో పోల్చారాయన. సమాజాన్ని చెడగొట్టేలా ఈ షో ఉందంటూ ఆయన పలు సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఏపీ హైకోర్టులో బిగ్ బాస్ షోపై నిషేధం విధించాలంటూ పిటిషన్ దాఖలైంది. బిగ్ బాస్ షోలో అశ్లీలత ఎక్కువైందంటూ అడ్వకేట్ శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు.
AP High Court fires on Bigg Boss show: షోను వెంటనే నిలిపివేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపింది హైకోర్టు. పిటిషన్ తరపున న్యాయవాది ఐబీఎఫ్ గైడ్ లైన్స్ పాటించలేదన్నారు. న్యాయస్థానం సైతం బిగ్ బాస్ షోలో అశ్లీలతపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా 1970లలో సినిమాల విషయాన్ని హైకోర్టు ప్రస్తావించింది. కేంద్రం తరఫు న్యాయవాది దీనిపై స్పందించేందుకు సమయం కోరారు. ప్రతివాదులకు నోటీసుల విషయాన్ని తదుపరి వాయిదాలో నిర్ణయిస్తామని న్యాయస్థానం తెలిపింది. విచారణను అక్టోబరు 11కు న్యాయస్ధానం వాయిదా వేసింది.
సీపీఐ నారాయణ వ్యాఖ్యలు:
బిగ్ బాస్ హౌస్ ముమ్మాటికీ బ్రోతల్ హౌస్ అంటూ రీసెంట్ గా మరోసారి విరుచుకుపడ్డారు నారాయణ. అక్కడికి వెళ్లి వచ్చిన వాళ్లు సంసారులు కాదన్నారు. అందులో ఏదో ఒకటి చేసుకునే బయటకు వస్తారంటూ తీవ్ర విమర్శలు చేశారు.బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చిన వాళ్లు పతివ్రతలు కారని నారాయణ అన్నారు. ఎవరైనా వాళ్లు పతివ్రతలే అని చెప్పినా తను నమ్మనన్నారు. పెళ్లి కాని అమ్మాయిలు, అబ్బాయిలు హౌస్ లోపలికి వెళ్లి ఏం చేసుకుంటున్నారో ఓపెన్ గా చూపించే దమ్ముందా? అని నారాయణ ప్రశ్నించారు. అంతేకాదు.. బిగ్ బాస్ హోస్ట్ నాగార్జుననూ నారాయణ టార్గెట్ చేశారు. వాళ్ల ఇంట్లో వారిపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బిగ్ బాస్ పై నారాయణ నిత్యం ఇలాంటి కామెంట్లు చేయడం, మీడియాలో ఆ వార్తలు ప్రసారం కావడం జరిగినా.. బిగ్ బాస్ నిర్వహకులు, నాగార్జున ఏనాడు స్పందించలేదు. కానీ, మరింత తీవ్ర స్థాయిలో ఎటాక్ చేయడంతో నాగార్జున మొన్నామధ్య షోలో ఇన్ డైరెక్ట్ గా నారాయణపై పంచ్ వేశారు.
Also Read : 'నేనే వస్తున్నా' రివ్యూ : ధనుష్ డబుల్ యాక్షన్ ఎలా ఉంది? హిట్టా ఫట్టా?