Anushka Shetty: మళ్లీ బరువు పెరిగిన అనుష్క - న్యూ లుక్ వైరల్!
అనుష్క మళ్లీ బరువు పెరిగిపోయింది. ఆ కారణంగానే ఆమె సినిమాలకు దూరంగా ఉంటుందని అందరూ భావించారు.
దక్షిణాది స్టార్ హీరోయిన్ గా అనుష్క శెట్టి తన సత్తా చాటింది. తన కెరీర్ లో కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసింది. 'అరుంధతి', 'భాగమతి' లాంటి సినిమాలు ఆమె స్థాయిని పెంచాయి. 'బాహుబలి' సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయింది ఈ బ్యూటీ. చాలా కాలంగా ఈమె సినిమాలకు దూరంగా ఉంటుంది. తన శరీర బరువుని తగ్గించుకునే పనిలో పడింది అనుష్క.
కొన్నాళ్లక్రితం ఈమెకి సంబంధించిన కొన్ని ఫొటోలు బయటకొచ్చాయి. అందులో అనుష్క సన్నబడి కొత్త లుక్ తో కనిపించింది. కానీ ఆమె మళ్లీ బరువు పెరిగిపోయింది. ఆ కారణంగానే ఆమె సినిమాలకు దూరంగా ఉంటుందని అందరూ భావించారు. అయితే ఇప్పుడు అదే లుక్ తో ఓ సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది అనుష్క. దీనికి సంబంధించిన ఫొటోలు బయటకొచ్చాయి.
యూవీ క్రియేషన్స్ లో ఓ సినిమా చేయడానికి ఒప్పుకుంది అనుష్క. నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. మహేష్ పి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా సెట్స్ లో జాయిన్ అయింది అనుష్క. ఇటీవల సెట్స్ లో దర్శకుడి పుట్టినరోజుని కూడా సెలబ్రేట్ చేశారు. అనుష్క కొత్త సినిమా మొదలుపెట్టడం అభిమానులకు సంతోషాన్నిచ్చే విషయమే.
కానీ ఆమె ఈ సినిమాలో కూడా కాస్త బొద్దుగానే కనిపించబోతుంది. అయితే అనుష్క కావాలనే బరువు పెరిగిందని.. ఈ సినిమాలో ఆమె లుక్ ని అలానే డిజైన్ చేశారని టాక్. ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం.. నాలుగు దక్షిణాది భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
View this post on Instagram